amp pages | Sakshi

వర్గోన్నతి సరే.. వైద్యులు ఏరి..!

Published on Sun, 02/12/2017 - 02:09

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌ జిల్లావ్యాప్తంగా ఉన్న 12 పశు చికిత్సా కేంద్రాలను పశువైద్యశాలలుగా, 15 గ్రామీణ పశువైద్య కేంద్రాల ను (రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్లు) పశు చి కిత్సా కేంద్రాలుగా వర్గోన్నతి కల్పిం చిం ది. అయితే ఆ స్థాయిలో వైద్యుల ని యా మకం జరగలేదు. ప్రస్తుతం 31 మంది ఏడీలకు 19 మంది మాత్రమే సేవలం దిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్గోన్నతి పొందిన వైద్యశాలలకు నిధులు, మందులు, సౌకర్యాలు పెంచినా ఫలితం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. 
 
ఏడీల కొరత
నిబంధనల మేరకు వర్గోన్నతి పొం దిన పశు వైద్యశాలలకు వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని నియమించాల్సి ఉంది. పశు చికిత్సా కేంద్రాలకు పశు వైద్యాధికారులను నియమించాలి. అయితే జిల్లాలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో 31 మంది ఏడీలకు గాను 19 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకూ వారితోనే ఎలాగోలా నెట్టుకొచ్చేస్తుం డగా, ఇప్పుడు వర్గోన్నతి పొందిన పశువైద్యశాలలకు మరో 12 మంది ఏడీల అవసరం ఉంది. ఇప్పటికే 12 మంది ఏడీల కొరత ఉండగా అదనంగా 12 మంది ఏడీలను ఎక్కడి నుంచి తీసుకువస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక పశు చికిత్సా కేంద్రాలుగా వర్గోన్నతి పొందినా ఇప్పటివరకూ కాంపౌండర్‌ స్థాయి ఉద్యోగులతో నడుస్తున్న కేంద్రాలకు వారినే ఇన్‌చార్జిలుగా వాడుకోవాల్సిన ప రిస్థితి ఏర్పడింది. 
 
వర్గోన్నతి పొందిన చికిత్సా కేంద్రాలివే..
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ పశు చికిత్సా కేంద్రాలుగా సేవలందిస్తున్న నిడదవోలు, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, ఉండి, పోడూరు, అత్తిలి, గణపవరం, పెనుగొండ, నల్ల జర్ల, ధర్మాజీగూడెం, దెందులూరు కేంద్రాలు పశు వైద్యశాలలుగా మారనున్నాయి. వీటితో పాటు గ్రామీణ పశువైద్య కేంద్రాలుగా ఉన్న ఆచంట వేమవరం, మత్స్యపురి, తడికలపూడి, పెదకడిమి, శనివారపు పేట, పోతవరం, పశి వేదల, ఎల్‌బీ చర్ల, కోరుమామిడి, వెంకటాపురం, దొరమామిడి, ఆరుగొల ను, రేలంగి, మోగల్లు, ఆగడాలలంక కేం ద్రాలు పశు చికిత్సా కేంద్రాలుగా రూ పాంతరం చెందనున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ ఉన్న 11 పశువైద్యశాలలతో వర్గోన్నతి పొందిన 12 కలిపి మొత్తం 23 పశు వైద్యశాలలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా లో 102 పశు చికిత్సా కేంద్రాల్లో వర్గోన్నతి పొందిన 12 కేంద్రాలు పోను 95 చికిత్సా కేంద్రాలు అందుబాటులో ఉం టాయి. వీటికి వర్గోన్నతి పొందిన మరో 15 గ్రామీణ కేంద్రాలు కలిపి మొత్తంగా 105 కేంద్రాలు సేవలందించనున్నాయి. 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌