amp pages | Sakshi

హెచ్చెల్సీకి నీరు బంద్‌

Published on Mon, 11/14/2016 - 00:28

 ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటరీల షట్టర్లు దించేసిన 
  పంటలకు డిసెంబర్‌ నెలాఖరు వరకు నీళ్లు అవసరం 
  చివర్లో చేతులెత్తేసిన ప్రభుత్వంపై రైతన్నల ఆగ్రహం 
 
కణేకల్లు : 
కేటాయించిన నీటి వాటా పూర్తి కావడంతో తుంగభద్ర జలాశయం అధికారులు ఆదివారం సాయంత్రం నుంచి హెచ్చెల్సీకి నీటి సరఫరా నిలిపేశారు. తుంగభద్ర నుంచి హెచ్చెల్సీకి మొత్తం 10.50 టీఎంసీల నీరు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. పరీవాహక ప్రాంతంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది తుంగభద్రకు నీటి లభ్యత గణనీయంగా తగ్గింది. ఆ మేరకు హెచ్చెల్సీ వాటాగా 10 టీఎంసీల నీరు కేటాయించారు.
 
కేసీ కెనాల్‌ నుంచి 1 టీఎంసీ నీరు డైవర్ష¯ŒS చేసుకోవాలని అనుకున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 0.5 టీఎంసీలు మాత్రమే తీసుకున్నారు. హెచ్చెల్సీకి నీటి సరఫరా ఆగిపోవడంతో హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహళ్‌ మండలాల్లో వరి, జొన్న, మొక్కజొన్న సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. తమ పంటలను కాపాడుకొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
 
ఆంధ్రా సరిహద్దు నుంచి కణేకల్లు మార్గమధ్యంలో హెచ్చెల్సీకి రెండు చోట్ల ఉన్న క్రాస్‌ షట్టర్లను పూర్తిగా దించేసి కాల్వలో నీరు నిల్వ చేసుకున్నారు. ఆంధ్రా సరిహద్దు 105 కిలోమీటర్‌ తర్వాత ఉన్న కురువళ్లి డిస్టిబ్య్రూటరీ, 1వ డిస్టిబ్య్రూటరీలోని పంటలను కాపాడేందుకు నాగాలాపురం వద్ద రైతులు షట్టర్లను దించేశారు. దీనివల్ల ఈ రెండు డిస్టిబ్య్రూటరీలకు మూడురోజులు నీరందే అవకాశముంది. 2, 2ఏ, 3, 4వ డిస్టిబ్య్రూటరీల రైతులు అంబాపురం వద్ద హెచ్చెల్సీకున్న షట్టర్లను దించారు. దీంతో ఈ నాలుగు డిస్టిబ్య్రూటరీలకు రెండు రోజుల పాటు నీరందుతుంది. హెచ్‌ఎల్‌ఎంసీ పరిధిలో 36 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా 25 వేల ఎకరాల్లో రైతులు వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ పంటలు సాగు చేశారు.
 
ప్రతి ఏటా డిసెంబర్‌ నెలాఖరు, జనవరి మొదటి వారం వరకు ఆయకట్టుకు సాగునీరు అందించేవారు. కానీ ఈసారి ఎన్నడూ లేని విధంగా రెండవవారంలోనే హెచ్చెల్సీకి నీరు బంద్‌ కావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరి, జొన్న, మొక్కజొన్నలాంటి ఆరుతడి పంటలు బతకాలంటే డిసెంబర్‌ వరకు నీరు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోని రైతులు ఏదోక విధంగా పంటలను కాపాడుతామని చెప్పి చివరికి చేతులెత్తేసిని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈనెల 15వ తేదీ వరకు హెచ్చెల్సీకి నీరు తీసుకోవాలని అధికారులు అనుకున్నప్పటికీ డ్యామ్‌లో హెచ్చెల్సీ హెడ్‌కు నీరు పూర్తి స్థాయిలో అందకపోవడం, వస్తున్న కొద్దిపాటి నీరునూ కర్ణాటక వారు వాడుకుంటూ ఉండటం వల్ల ఆ ప్రయత్నాలు ఆపేశారు. ప్రస్తుతం డ్యామ్‌లో 11.368 టీఎంసీల నీరుంది. 
 
300 క్యూసెక్కులు వస్తున్నాయి 
ఈ నెల 15 వరకు పూర్తిస్థాయిలో నీరు తీసుకోవాలని అనుకొన్నాం. డ్యామ్‌లో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. 1,591 అడుగుల వరకే నీరుండటంతో హెచ్చెల్సీ హెడ్‌ కు కావాల్సినంత నీరు అందడం లేదు. అరకొరగా వస్తున్న నీటిని కర్ణాటక వాళ్లే వాడుకుని 300 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నారు. ఈ రోజు రాత్రికో, సోమవారం ఉదయానికో ఆ నీరు కూడా పూర్తిగా ఆగిపోతుంది. పంటలను సంరక్షించుకునేందుకు రైతులు నాగాలాపు రం, అంబాపురం వద్ద షట్టర్లను దించుకున్నారు. కణేకల్లు చెరువు కింద సాగులో ఉన్న పంటల కోసం చెరువు షట్టర్లను కూడా క్లోజ్‌ చేశారు.
– వెంకట సంజన్న, డీఈఈ  

#

Tags

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)