amp pages | Sakshi

పదిలో నూరు శాతం ఫలితాలు సాధించాలి

Published on Tue, 08/08/2017 - 00:06

ఎంఈఓలు, హెచ్‌ఎంలకు డీఈఓ సూచన
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట):
ఈ ఏడాది పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌.ఎస్‌.గంగాభవాని సూచించారు. సోమవారం ఏలూరు డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఒలతో స్థానిక సెయింట్‌ థెరిస్సా బాలికోన్నత పాఠశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ప్రతీ రోజూ సాయంత్రం ఒక గంట అదనంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌ కోసం ప్రత్యేక  శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే ప్లేఫీల్డ్స్‌కి ప్రధానోపాధ్యాయులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఏలూరు డీవైఈఓ ఉదయ కుమార్‌ మాట్లాడుతూ 10వ తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుండి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, తరగతి గదులను ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని, వారాంతపు సమీక్షలు నిర్వహించి, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలపై తగు సలహాలు ఇవ్వాలని సూచించారు. అలాగే బయోమెట్రిక్‌ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతీ పాఠశాలలో కిచెన్‌గార్డెన్లు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన పథకానికి కూరగాయలు పండించాలన్నారు. అనంతరం రిటైర్డ్‌ డీవైఈఓ ఏడీవీ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏలూరు డివిజన్‌లోని మండల విద్యాశాఖాధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
 
 
 

#

Tags

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌