amp pages | Sakshi

కెరీర్‌కు సరైన అమరిక ఇంటీరియర్ డిజైన్

Published on Tue, 05/17/2016 - 23:28

వాట్ ఆఫ్టర్: ఇంటర్మీడియట్
నేడు ప్రతి ఒక్కరూ ఇంటిని, కార్యాలయాలను తమ అభిరుచి మేరకు తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు. దీని కోసం ఖర్చుకు కూడా వెరవడం లేదు. ఈ క్రమంలో ఇంటీరియర్ డిజైనర్ పాత్ర కీలకం. దీంతో ఈ కోర్సుల ఉత్తీర్ణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీ.. బ్యాచిలర్ ఆఫ్ డి జైన్ (ఇంటీరియర్ డిజైన్)లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇంటీరియర్ డిజైన్ కెరీర్‌పై ఫోకస్..
 
సృజనాత్మక, పరిశీలనా నైపుణ్యాలను ఉపయోగించి అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగదారుని అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దడమే ఇంటీరియర్ డిజైన్. ఈ క్రమంలో కస్టమర్ల ఇష్టాయిష్టాలు, ఆసక్తులు తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తి, నిర్మాణ రంగాలు శరవేగంగా అభివృద్ధి  చెందుతున్న నేపథ్యంలో ప్రతి నిర్మాణంలో సృజనాత్మకత అవసరం ఎంతో. దీంతో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్, ఆఫీస్ పరిసరాలు, ఇంటి లోపల భాగాలను అందంగా తీర్చిదిద్దే ఇంటీరియర్ డిజైనర్లకు నానాటికి డిమాండ్ పెరుగుతోంది. సంబంధిత కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి వివిధ దేశాల కంపెనీలు సైతం స్వాగతం పలుకుతున్నాయి.
 
అవసరమైన నైపుణ్యాలు
ఇంటీరియర్ డిజైనింగ్ చేసేవారికి  ప్రధానంగా సృజనాత్మకత, ప్రాదేశిక కల్పన(స్పేషియల్ ఇమాజినేషన్), మంచి కలర్‌‌సను ఎంచుకునే స్కిల్స్ ఉండాలి. వీటితోపాటు డిజైన్ స్కిల్స్, పరిశీలనా నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం, మేనే జ్‌మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు ఫొటోషాప్, 3డీ స్టూడియో మ్యాక్స్, ఆడోబ్ ఇలస్ట్రేటర్, ఆటోక్యాడ్ వంటి  సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన అవసరం.
 
వేతనాలు/ ఆదాయం
ఇంటీరియర్ డిజైనర్లకు వేతనాలు అనేవి వారి వ్యక్తిగత నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. స్థిరాస్తి, నిర్మాణ రంగం, ఇతర రంగాల్లో  అనేక కంపెనీలు ప్రారంభంలో కనీసం రూ.18 వేల నుంచి రూ.20 వేల వేతనాలతో ఉద్యోగాలిస్తున్నాయి. అనుభవం పెరుగుతున్న కొద్దీ వేతనాలు పెరుగుతుంటాయి. స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకున్నవారు ఇంటీరియర్ డిజైన్ స్టూడియో/కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో వారి సృజనాత్మకత ఆధారంగా నెలకు లక్షల్లో సంపాదించొచ్చు.
 
ఎలాంటి ఇన్‌స్టిట్యూట్‌లను ఎంచుకోవాలి
ఇంటీరియర్ డిజైనింగ్‌లో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లలో టీ చింగ్  ఫ్యాకల్టీ అర్హత లు, అనుభవంతో పాటు ఇన్‌స్టిట్యూట్ నేపథ్యాన్ని తెలుసుకోవాలి. క్యాంపస్ పరిసర ప్రాంతాలు  కోర్సుని అభ్యసించేవారికి అనుకూలంగా ఉండాలి.  బోధన పద్ధతులు, గత సంవత్సరంలో సాధించిన ఫలితాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్లను పరిగణనలోకి  తీసుకోవాలి.
 
కోర్సుల వివరాలు
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్సులో నాలుగేళ్ల వ్యవధిలో 8 సెమిస్టర్లుంటాయి. మొదటి ఆరు సెమిస్టర్లలో వివిధ సబ్జెక్టులను బోధిస్తారు. ఏడో సెమిస్టర్‌లో ప్రాజెక్ట్ వర్క్, ఎనిమిదో సెమిస్టర్‌లో ఇంటీరియర్ డి జైనర్స్ కార్యాలయంలో 20 వారాలపాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇలా పూర్తిస్థాయిలో తమ నైపుణ్యాలను పెంచుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు.
 
అర్హత: ఇంటర్మీడియెట్/10+2లో ఉత్తీర్ణత. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) జూలైలో నిర్వహించే ఆర్ట్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏడీసీఈటీ)లో అర్హత సాధించాలి.
 
మంచి అవకాశాలు
ఇంటీరియర్ డిజైనింగ్‌లో కోర్సు పూర్తిచేసిన వారికి  కంపెనీలు ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్లు ఇస్తున్నాయి. కొందరు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కోర్సుల్లో ఉత్తరాదివారు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు తెలుగువారు వారితో పోటీపడుతున్నారు.
 
జేఎన్‌ఏఎఫ్‌ఏయూ నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్సుకు అర్హులు. మొత్తం 60 సీట్లున్నాయి. వీటిలో 42 శాతం ఆంధ్ర , 36 శాతం తెలంగాణకు, 22 శాతం రాయలసీమకు కేటాయించారు. హమ్స్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజై న్, లకోటియా ఇన్‌స్టిట్యూట్‌లు కూడా వర్సిటీ నిబంధనల మేరకు కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
- ప్రొఫెసర్ ఎస్.కుమార్, డెరైక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)