amp pages | Sakshi

65 నామినేషన్లుతిరస్కరణ

Published on Fri, 04/11/2014 - 00:39

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో మరో అంకం ముగిసింది. గురువారం నాటితో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు బుధవారం నాటికి నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. 14 అసెంబ్లీ స్థానాలకు 421 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గురువారం చేపట్టిన పరిశీలనలో 61 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. దీంతో బరిలో 360 మంది అభ్యర్థులు నిలిచారు. రెండు పార్లమెంటు స్థానాలకు 52 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. పరిశీలన ప్రక్రియలో నలుగురి నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో చివరకు పోటీలో 48 మంది ఉన్నారు.


 ఎల్‌బీనగర్‌లో అధికంగా
 అసెంబ్లీ నియోజకవర్గ కేటగిరీలో ఎల్‌బీనగర్ సెగ్మెంట్ నుంచి అధికంగా 13 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయి. ఆ తర్వాత మల్కాజిగిరి సెగ్మెంట్ నుంచి 11 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల నుంచి ఒక్కో అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు.

 అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్లు దరఖాస్తు సమయంలో బలపర్చే అభ్యర్థుల సంఖ్య అవసరం మేరకు లేకపోవడం, పలు వివరాలు సమర్పించకపోవడంతోనే వాటిని తిరస్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తిరస్కరణపై అప్పీలుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వారంతా పోటీ నుంచి దాదాపు నిష్ర్కమించినట్లే. ఇదిలాఉండగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శనివారంతో పూర్తికానుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్