amp pages | Sakshi

అభివృద్ధికి దిక్సూచి

Published on Mon, 04/14/2014 - 00:49

 సాక్షి ప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో అభివృద్ధి, సంక్షేమానికి మార్గం చూపనుంది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుని సీమాంధ్ర ప్రజలకు కష్టనష్టాలు మిగిల్చిందని, వైఎస్సార్ సీపీ అమలు చేపే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అనతికాలంలోనేఆ నష్టాన్ని భర్తీ చేయవచ్చని వివిధ రంగాలకు చెందిన నిపుణులు చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలు, బలహీనవర్గాల ప్రజలకు అందించనున్న రాయితీలతో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. గుంటూరుకు 50 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొనడంతో గుంటూరు, విజయవాడ పరిసర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇప్పటికే ఎన్‌హెచ్-16(గతంలో ఎన్‌హెచ్ -5)ను చిలకలూరిపేట నుంచి కనకదుర్గ వారిధి వరకు ఆరులైన్ల రహదారిని విస్తరించారు. అక్కడి నుంచి నాలుగు లైన్ల రహదారి విస్తరణ జరిగింది. ఈ రహదారి ఏర్పాటుతో ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తే తక్కువ సమయంలో ఇక్కడి నుంచే విదేశాలకు ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది. ఈ విమానాశ్రయ ఏర్పాటుతో గుంటూరు, విజయవాడ నగరాల్లో సేవారంగాలు విస్తరించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం మహానేత వైఎస్ హయాంలో రూ.8 వేల కోట్లతో అభివృద్ధి పరిచారు. దీని ఏర్పాటుతో అనేక అనుబంధ రంగాలు అభివృద్ది చెందాయి. అదే రీతిలో గుంటూరు, విజయవాడల్లో అనుబంధ రంగాలు విస్తరించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేది నిపుణుల మాట.
 
 ఫీజు రీయింబర్‌‌సమెంట్‌పై ఆంక్షలు తొలగింపు..
 కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించేందుకు అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంక్షలు లేకుండా చేస్తామని చేసిన ప్రకటన మధ్య తరగతి కుటుంబాలకు ఆనందం నింపింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. ఆంక్షలు లేకుండా చేస్తే వీరి సంఖ్య 80 వేల నుంచి లక్ష వరకు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అమ్మ ఒడి పథకం దోహదం చేస్తుందని, దీని ద్వారా బడికి వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని విద్యారంగ నిపుణుల అభిప్రాయం.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)