amp pages | Sakshi

వర్జీనియా వుల్ఫ్‌

Published on Tue, 07/10/2018 - 19:44

తన పదమూడో ఏట వాళ్లమ్మ చనిపోయినప్పుడు తొలిసారి మానసికంగా కుంగిపోయింది వర్జీనియా వుల్ఫ్‌(1882–1941). తర్వాత రెండేళ్లకు ఆమె సోదరి మరణించింది. అదే సమయంలో ఆమె మారుతల్లి పోయింది. బాగా చదువుకున్న కుటుంబంలో పుట్టిన వర్జీనియా తన పద్దెనిమిదో ఏట తండ్రి ప్రోత్సాహంతో రాయడానికి ఉపక్రమించింది. అత్యంత ప్రభావశీలిగా నిలవబోయే ఇరవయ్యో శతాబ్దపు ఆధునిక రచయిత్రి ఆ మనో వ్యాకులతల మధ్య కలం పట్టింది.

 పైగా, ఆడపిల్ల రాయడాన్నీ, చిత్రించడాన్నీ అంత గణించదగినదిగా పరిగణించని ఛాందస ఇంగ్లిష్‌ సమాజానికి ఎదురీదుతూ లండన్‌లోని కళాకారులు, రచయితలతో జట్టుగా సాహిత్యంలో మునిగి తేలింది. వరుస విపత్తులతో కుంగిపోయివున్న వుల్ఫ్‌ వెన్వెంటనే తండ్రిని కూడా కోల్పోవడం ఆమెను మానసిక దౌర్బల్యానికి గురిచేసింది. ఒక్కోసారి తీవ్ర నైరాశ్యంలోకీ, అప్పుడే ఎగసిపడే ఉత్సాహంలోకీ ఆమె ఉద్వేగాలు మారిపోయేవి. ఈ మానసిక అనారోగ్యానికిగానూ ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది.

 చివరకు, 59వ ఏట నదిలో మునిగి చనిపోయింది. ఒక మనిషిని శూన్యం చేయకుండా వదలని విధి ఆటల నడుమే ‘మిసెస్‌ డాలోవే’, ‘టు ద లైట్‌హౌజ్‌’, ‘ఓర్లాండో’ లాంటి ప్రసిద్ధ నవలలు రాసింది. చైతన్య స్రవంతి రచనా విధానాన్ని ఉపయోగించిన మార్గదర్శుల్లో ఒకరిగా నిలిచింది. వ్యాస రచయిత్రిగా కూడా వుల్ఫ్‌ ప్రసిద్ధురాలు. స్త్రీవాద ఉద్యమానికి ఆమె రచనలు ప్రేరణ నిచ్చాయి. 

Videos

చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ

కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..

సొంత వాళ్ళ దగ్గర పరువు పోయింది..బాబుపై కేశినేని నాని సెటైర్లు

ప్రచారంలో చంద్రబాబును ఏకిపారేసిన ఆర్కే రోజా

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్

అలాంటి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే సాధ్యం

మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..

అభివృద్ధిపై నాన్ స్టాప్ స్పీచ్..టీడీపీకి దమ్ముంటే..

విశాఖకే జై కొట్టిన టిడిపి

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)