amp pages | Sakshi

చేతులు, పాదాల చర్మం... గరుకుదనం పోవాలంటే...

Published on Wed, 06/01/2016 - 22:38

బ్యూటిప్స్

 

పాదాలు, చేతుల చర్మం గరుకుగా మారితే పగుళ్లు ఏర్పడతాయి. దీని వల్ల పగుళ్లలో మురికి చేరుతుంది. సరైన శుభ్రత పాటించకపోతే పాదాలు, చేతులు అందవికారంగా కనిపిస్తాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే రోజూ సరైన జాగ్రత్తలు పాటించాలి. ఒక టబ్ గోరువెచ్చని నీళ్లలో కప్పు మొక్కజొన్న పిండి కలపాలి. అందులో 5-10 నిమిషాలు పాదాలను ఉంచి, విశ్రాంతి తీసుకోవాలి. తర్వాత పమిస్ స్టోన్‌తో పాదాల మడమలను రుద్ది, కడగాలి. మెత్తని టవల్‌తో పాదాలను, చేతులను తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. రోజూ రాత్రిపూట పడుకునే ముందు ఈ విధంగా చేస్తూ ఉండాలి. కాలి మడమల పగుళ్లు తగ్గాలంటే ఉల్లిపాయ ముద్ద నూరి రాయాలి.రోజూ రాత్రి పడుకునే ముందు ఆవ నూనె పాదాలకు, చేతులకు రాసుకోవాలి.

     
అర కప్పు పెరుగులో అర టీ స్పూన్ వెనిగర్ కలిపి మడమలు, పాదాలకు మసాజ్ చేయాలి.రాత్రి పూట క్యాండిల్ వ్యాక్స్, ఆవ నూనె కలిపిన మిశ్రమాన్ని పాదాల పగుళ్లకు రాయాలి. సాక్స్ ధరించాలి. మరుసటి రోజు ఉదయం శుభ్రపరుచుకోవాలి.తాజా గులాబీ పువ్వులు కప్పు, అరకప్పు పాలు కలిపి మెత్తగా నూరాలి. దీంట్లో టీ స్పూన్ శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు, చేతులకు పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రపరచాలి.పెట్రోలియమ్ జెల్లీలో టీ స్పూన్ విటమిన్ ‘ఇ’ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి.బొప్పాయి అర కప్పు, పైనాపిల్ అర కప్పు, తేనె 4 టేబుల్‌స్పూన్లు కలిపి పాదాలకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)