amp pages | Sakshi

బుద్ధుని సత్యాన్వేషణ

Published on Tue, 03/28/2017 - 00:09

సందేశం

‘‘తర్జనీ దర్శయత్యన్యం సద్యస్త్వామంగుళీత్రయమ్‌’’ నీచూపుడు వేలుతో ఇతరులను చూపిస్తావు కాని, అదే సమయంలో మూడు వేళ్ళు నిన్ను చూపిస్తాయి... గ్రహించు!’’ అందుకే సత్యాన్నే పలకాలి. దాన్ని ప్రియంగా చెప్పాలి. నేను చెప్పేది సత్యాన్నే కదా అని ఎన్నడూ కఠినంగా, పౌరుషంగా చెప్పరాదు. బుద్ధ భగవానుని చరిత్ర మనకు తెలిసిందే. ఆయన జీవితం మానవ జాతికి చాలా ఆదర్శమైనది. బుద్ధుడు మహారాజవంశంలో పుట్టినా, అనేక భోగభాగ్యాలున్నా కూడా వాటిని త్యాగం చేసి సర్వసంగపరిత్యాగి అయ్యాడు. సత్యాన్వేషణకై తపస్సు చేసి జ్ఞాని అయ్యాడు.

అలాంటి బుద్ధ భగవానుని ఒక వ్యక్తి ప్రతిరోజూ దూషించేవాడు. ముఖం ఎదుటే దుర్భాషలాడేవాడు. కాని అందుకు బుద్ధునిలో ఎలాంటి స్పందన ఉండేది కాదు. మౌనంగానే వుండిపోయేవాడు. కొంత కాలం గడిచిన తర్వాత బుద్ధ భగవానుడు నోరు మెదిపాడు.‘‘అయ్యా! ఏదైనా మనం ఇతరులకిచ్చినప్పుడు మనం ఇచ్చింది వారు తీసుకోకపోతే అది తిరిగి ఇచ్చిన వారికే చెందుతుంది కదా! అలాగే మీ దూషణలను కూడా నేను స్వీకరించలేదు’’ అని చాలా ప్రశాంతంగా బదులు పలికాడు.

ఆ వ్యక్తిలో చలనం కలిగింది. ఆలోచించే కొద్దీ భయం కలిగింది. ‘అనవసరంగా ఒక దయామూర్తిని నిందించానే’ అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ బుద్ధుని పాదాలపై పడి క్షమాపణ కోరాడు. బుద్ధుడు అంతే ప్రశాంత వదనంతో ‘‘నేనెప్పుడో క్షమించి వేశాను. మీ తిట్ల వల్ల నాలో ఎలాంటి భావమూ లేదు. మీరు బాధపడవలదు’’ అని ఓదార్చి పంపించాడు. ఇలాంటి సంఘటనలు లోకంలో అనేకం జరుగుతుంటాయి.వాటన్నింటినీ పట్టించుకుంటే గమ్యం చేరలేము. సాధకులైన వారు ఏకాగ్రత వీడకుండా వుండాలి. ఇతర విషయాలేవీ పట్టించుకోరాదు.సాధకుడికి సాధన కాలంలో అనేక అంతరాయాలేర్పడతాయి. వాటిని లెక్క చేయకుండా గమ్యం వైపు దృష్టి సారించి కృషి చేయడమే ముఖ్యం. దేనిని సాధించాలన్నా నిర్దిష్ట మార్గంలో పట్టుదల కలిగి ఉండాలి.

ఉత్తమ సాధకులెవ్వరూ తమ గమ్యం చేరే వరకూ వదిలిపెట్టరు. వాళ్ళు ప్రజ్ఞానిధులు కనుక ప్రారబ్ధార్ధాన్ని వదిలిపెట్టరు. విఘ్నాలు ఎన్ని వచ్చినా వారి ప్రయత్నానికి ఆటంకం కలిగించలేవు. సత్యదర్శనం కలిగే వరకు నిరంతర సాధన జరగడమే సరైన నిర్ణయం.బుద్ధ భగవానుని సత్యాన్వేషణలో చెదరని పట్టుదల ఉంది. అందుకు తగిన నిరంతర సాధన వుంది కనుకనే జీవిత సత్యాన్ని కనుగొన్నాడు. ఆయన మాట, ఆయన బాట ఎన్ని యుగాలకైనా ఆదర్శవంతమైంది... ఆచరణీయమైంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)