amp pages | Sakshi

సెల్‌ఫోన్‌ వల్ల బొటనవేలి నొప్పి!

Published on Sat, 01/11/2020 - 02:19

ప్ర: నేను స్మార్ట్‌ఫోన్‌ను చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. బ్యాంకింగ్‌ వ్యవహారాలకూ, ఆఫీస్‌ కమ్యూనికేషన్స్‌ వేగంగా టైప్‌ చేయడంతో పాటు చాలా కీస్‌ నా బొటనవేలితో నొక్కుతుంటాను. ఈమధ్య ఆ వేలు చాలా నొప్పిగా ఉంటోంది. సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడటం వల్లనే వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇదేమైన సమస్యా? నా బొటనవేలి నొప్పి తగ్గడానికి మార్గాలు చెప్పండి.

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బొటనవేలి నొప్పికి మీ సెల్‌ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడమే కారణమనిపిస్తోంది. మీరు బ్లాక్‌బెర్రీ థంబ్‌ లేదా గేమర్స్‌ థంబ్‌ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీన్నే వైద్యపరిభాషలో ‘డీ–క్వెర్‌వెయిన్‌ సిండ్రోమ్‌ అని అంటారు. మనం మన స్మార్ట్‌ ఫోన్‌ను వాడేటప్పుడు  బొటనవేలిని మాటిమాటికీ ఉపయోగిస్తుంటాం. దాంతో బొటనవేలి వెనకభాగంలో ఉన్న టెండన్‌ ఇన్‌ఫ్లమేషన్‌కు గురై వాపు వస్తుంది. మళ్లీ అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. ఫలితంగా ఈ సమస్య వస్తుంది. మీలా సెల్‌ఫోన్‌ను చాలా ఎక్కువగా వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ తరహా నొప్పిని చాలావరకు నివారించుకోవచ్చు. ఆ జాగ్రత్తలివే...

►టైపింగ్‌ లేదా టెక్ట్స్‌ మెటీరియల్‌ పంపడం కోసం ఒక బొటన వేలినే కాకుండా ఇతర వేళ్లను కూడా మార్చి మార్చి ఉపయోగిస్తూ బొటనవేలిపై పడే భారాన్ని తగ్గించడం.
►ఫోన్‌ను ఒక చేత్తో పట్టుకొని మరో చేతి బొటనవేలిని ఉపయోగించే బదులు, దాన్ని ఒక ఉపరితలం మీద పెట్టి ఇరుచేతుల వేళ్లను మార్చి ఉపయోగిస్తూ ఉండటం.
►మణికట్టును చాలా రిలాక్స్‌గా ఉంచి వీలైనంత వరకు మణికట్టుపై భారం పడకుండా చూడటం.
►మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒళ్లో పెట్టుకొని ఉండకుండా, కాస్త ఛాతీ భాగం వద్ద ఉండేలా చూసుకోవడం. ఒళ్లో పెట్టుకోవడం వల్ల కంటి మీద, ఒంగి స్క్రీన్‌ చూస్తూ ఉండటంతో మెడ మీద భారం పడుతుంది. అదే ఫోన్‌ను ఛాతీ వద్ద పెట్టుకుంటే అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుంది.
►ఫోన్‌ను శరీరానికి ఏదో ఒక వైపున ఉంచకుండా మధ్యన ఉంచడం. దీని వల్ల శరీరం అసహజ భంగిమలో ఒంగకుండా బ్యాలెన్స్‌తో ఉంటుంది.

ఇక ఈ జాగ్రత్తలతో పాటు మరికొన్ని జాగ్రత్తలూ అవసరం. అవి...
►ఫోన్‌ ఉపయోగించే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం.
►పొడవు పొడవు వాక్యాలు కాకుండా అర్థమయ్యేరీతిలో షార్ట్‌కట్స్‌ వాడుతూ బొటనవేలి ఉపయోగాన్ని తగ్గించడం. దీనివల్ల మీ బొటనవేలు, ఇతర వేళ్లు, మణికట్టుపై భారం తగ్గుతుంది.
►‘ఐ యామ్‌ ఇన్‌ మీటింగ్‌’ లాంటి కొన్ని రెడీమేడ్‌ వాక్యాలు ఉంటాయి. వాటి సహాయం తీసుకుంటే టైపింగ్‌ బాధ తగ్గడంతో పాటు, సమయమూ ఆదా అవుతుంది.
►ఎవరిపేరునైనా కనుగొనాలంటే పూర్తిగా స్క్రీన్‌ స్క్రోల్‌ చేస్తుండే బదులు షార్ట్‌కట్స్‌ ఉపయోగించడం ద్వారా సమయాన్నీ, బొటనవేలి ఉపయోగాన్నీ తగ్గించవచ్చు.
►అదేపనిగా ఫోన్‌ ఉపయోగించే వారు... ప్రతి 15 నిమిషాల్లో కనీసం 2–3 నిమిషాల పాటు మీ బొటనవేలికి విశ్రాంతినివ్వాలి. అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించండి.
డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,  
కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)