amp pages | Sakshi

కొలెస్ట్రాల్

Published on Wed, 12/11/2013 - 23:38

కొలెస్ట్రాల్ అనేది మైనం లాంటి పదార్థం. ఇది శరీరమంతటా ఉంటుంది. కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహారం నుంచీ, శరీరం లోపలా తయారవుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లివర్‌లో తయారవుతుంది. ఆహారం ద్వారా  పొందే కొలెస్ట్రాల్ మనం తీసుకునే పాలు, పాలపదార్థాలు, మాంసాహారం, చేపలు, గుడ్లులోని పచ్చసొన నుంచి అందుతుంది.
 
 కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. అది మంచి, చెడు కొలెస్ట్రాల్.  శరీరంలో ఉండే కొవ్వును ట్రైగ్లిసరాయిడ్స్ రూపంలో రక్తం ద్వారా శరీర కణజాలానికి చేరవేస్తుంది. ఈ ట్రైగ్లిసరాయిడ్స్ అధికంగా ఉన్న వారికి చెడు కొలెస్ట్రాల్ పాళ్లు అధికమవుతాయి. ఫలితంగా గుండెపోటు ముప్పుంటుంది. కాబట్టి ట్రైగ్లిసరాయిడ్స్ పాళ్లను అదుపులో ఉంచుకోవాలి.
 
 రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లను మనం తగ్గించుకోక పోవటం వల్ల గుండెవ్యాధులు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ను నిర్ణీత పాళ్ల కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
 ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కొలెస్ట్రాల్‌ను ఆహార విహారాదులను ఆరోగ్యకరంగా పాటించడం వల్ల వాటిని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు మరియు ఆయుర్వేద ఔషధాలు కొలెస్ట్రాల్ దుష్ర్పభావాలను తీవ్రతరం చేయకుండా కాపాడతాయి.
 
 తీసుకోవలసిన జాగ్రత్తలు:  
 వ్యాయామం: నడక వల్ల మంచి కొలెస్ట్రాల్ పాళ్లను పెంచవచ్చు.  
 ప్రాణాయామం: 15 నిమిషాలు ప్రాణాయామం చేయటం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ శుభ్రపడుతుంది  
 నీరు: రోజుకి సగటున 6-8 గ్లాసులు తీసుకోవాలి.   
 ఆల్కహాల్, మాంసాహారం, సిగరెట్లు మానివేయాలి.  
 బరువును పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.  
 పీచుకలిగిన పండ్లు, కూరగాయలు, ఆహారం, ఓట్స్ తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్‌ను పూర్తిగా అదుపు చేయవచ్చు.
 
 చెడు కొలెస్ట్రాల్ (LDL)
 LDL కొలెస్ట్రాల్: ఎక్కువగా రక్తంలో ప్రయాణించటం వల్ల గుండెకు, మెదడుకు వెళ్లి ధమనుల్లో అవరోధం ఏర్పడుతుంది. ఈ విధమైన చెడు కొలెస్ట్రాల్ పేరుకోవటం వల్ల రక్తప్రసరణకు అంతరాయం    ఏర్పడి గుండెపోటు వస్తుంది. అలాగే  మెదడుకు సరఫరా అయ్యే రక్తప్రసరణకు అడ్డంకితో పక్షవాతం ముప్పు ఏర్పడుతుంది.
 
 మంచి కొలెస్ట్రాల్ (HDL)
 HDL కొలెస్ట్రాల్: ఇది మంచి కొలెస్ట్రాల్. దీనిని పెంచుకోవటం వల్ల అనారోగ్యాలను నివారించుకోవచ్చు. ఇది శరీరంలోని చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కావున LDL కొలెస్ట్రాల్ 140-150 mg/d లోపు ఉండాలి. ఇక HDL కొలెస్ట్రాల్ 40-50 mg/dl ఉండేలా చూసుకోవాలి.
 

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)