amp pages | Sakshi

పాలకూర పప్పు, పన్నీర్‌ రుచిగా వండుతా

Published on Sun, 12/29/2019 - 07:46

సాక్షి, సిటీబ్యూరో: ఆ యువతిది రష్యా. మాస్కోలో బాలీవుడ్‌ డ్యాన్స్‌ చూసి ముచ్చట పడింది. భారతీయ సంప్రదాయ నృత్యాల గురించి తెలుసుకుంది. కథక్‌ నాట్యం పట్ల ఆకర్షితురాలైంది. జీవితాంతం కథక్‌ నృత్య కళాకారిణిగానే కొనసాగాలని నిశ్చయించుకుంది. 9 ఏళ్ల శిక్షణ తర్వాత తొలిసారిగా సోలో ప్రదర్శన ఇవ్వడానికి తాను నృత్యం నేర్చుకున్న హైదరాబాద్‌నగరానికి ఇటీవల వచ్చింది. ఆమె కథక్‌ నృత్యకారిణి కేథరిన్‌ క్రివెంకో. తొలి నాట్య ప్రదర్శన అనంతరం తన అనుభవాలను ‘సాక్షి’తో ఇలా పంచుకుంది.

భారతీయ వంటలు నేర్చుకున్నా..  
ఇండియాకు రాకముందు నాకు ఇంగ్లిష్‌ సరిగా రాదు. కొన్ని హిందీ పదాలు తప్ప ఎక్కువగా తెలియదు. ఇండియా వంటలు వండటం నేర్చుకున్నాను. పాలకూర పప్పు, పన్నీర్, ఎగ్‌ కర్రీ, బటర్‌ చికెన్, మేథీ చికెన్‌ నేర్చుకున్నాను. 2015లో త్యాగరాజ సంగీత కాలేజ్‌లో హిందుస్తానీ సంగీతం నేర్చుకున్నాను. విజయ్‌ మరార్‌ వీడియోల్లో పనిచేశాను. తెలంగాణ బతుకమ్మ వీడియోలో ఫ్రెండ్స్‌తో కలిసి కనిపిస్తాను. 

హైదరాబాద్‌.. సెల్ఫ్‌ సఫీషియెంట్‌..

ఇండియాలో అన్ని ప్రదేశాల కంటే హైదరాబాద్‌ అంటే ఇష్టం. ఇది నా హోం. ఈ సిటీ ఎందుకు ఇష్టమంటే.. ఇక్కడ ఏం తినాలన్నా లభిస్తుంది. మొఘలాయి, ఆంధ్రా, ఇటాలియన్, చైనీస్, జపనీస్‌ ఇలా అన్ని క్విజైన్‌ ఫుడ్స్‌ లభిస్తాయి. ఇక్కడ అనేక సంస్కృతులు ఉన్నాయి. సంప్రదాయ బద్ధమైన లైఫ్‌కి అవకాశం ఉంది. ఇక్కడ బస్సు, మెట్రో, ఆటోలో కూడా సులభంగా వెళ్లగలం. హైదరాబాద్‌లో భద్రత విషయంలో ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. నా వరకు హైదరాబాద్‌ బ్యూటీ సిటీ. 

రష్యన్స్‌ లైక్‌ లామకాన్‌..
కథక్‌ శిక్షణ పూర్తయిన తర్వాత కూడా మధ్య మధ్యలో ఇండియాకు వచ్చి వెళ్లేదాన్ని. స్నేహితులతో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. డిసెంబర్‌ 13న నా మొదటి సోలో ప్రదర్శన ఇచ్చాను. కళలకు, కళాకారులకు ఎంతో విలువనిచ్చే లామకాన్‌లోనే నా మొదటి సోలో ప్రదర్శన  ఇవ్వటం నాకు ఎనలేని సంతోషాన్నిచ్చింది.  

బాలీవుడ్‌ డ్యాన్స్‌ బాగా పాపులర్‌..
కలర్‌ఫుల్‌ దుస్తులు, జాయ్‌ఫుల్‌గా ఉండటం వల్ల రష్యాలో బాలీవుడ్‌ డ్యాన్స్‌ చాలా పాపులర్‌. మా దేశంలో చాలా చోట్ల బాలీవుడ్‌ డ్యాన్స్‌ నేర్పించే సెంటర్లు ఉన్నాయి. 2010లో మాస్కోలోని ఓ స్కూల్‌లో బాలీవుడ్‌ డ్యాన్స్‌ నేర్చుకోవడానికి వెళ్లాను. అప్పుడు నాకు ఇండియాలో క్లాసికల్‌ డ్యాన్సులున్నాయనే సంగతి తెలియదు. అక్కడ బేసిక్‌ కథక్‌ స్టెప్స్‌నేర్పించారు. 10– 15 నిమిషాలు కథక్‌ డ్యాన్స్‌ చూపించారు. నాకు చాలా నచ్చింది. అప్పుడు ఫ్రెండ్‌ ఇండియన్‌ అంబసీలో కథక్‌ నేర్పిస్తున్న సంగతి చెప్పింది. అలా కథక్‌ నాట్య గురువు రాఘవ్‌రాజ్‌ భట్‌ వద్ద  ఏడాది పాటు కథక్‌ నృత్యంలో శిక్షణ పొందాను. తర్వాత ఆయన స్కాలర్‌షిప్‌ అప్‌లై చేసి ఇండియాలో కథక్‌ నేర్చుకోమ్మని సూచించారు. స్కాలర్‌షిప్‌తో ఇండియాకు వచ్చి ఆకృతి కథక్‌ కేంద్రంలో మంగళా భట్‌ వద్ద 2013– 16 వరకు కథక్‌ నేర్చుకున్నాను.  

బాలీవుడ్‌ సినిమాలు చూసేదాన్ని..  
చిన్నప్పటి నుంచే నేను బాలీవుడ్‌ చిత్రాలు చూసేదాన్ని. అలా హిందీ భాష తెలుసు. కుచ్‌ కుచ్‌ హోతా హై, రబ్‌ దే బనాది జోడీ, దిల్‌ తో పాగల్‌ హై, దిల్, ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌ నా ఫేవరెట్‌ చిత్రాలు. మా అమ్మ హిందీ చిత్రాల వీడియో క్యాసెట్లు తీసుకువచ్చేది. రష్యాలో చాలా మంది బాలీవుడ్‌ చిత్రాలు చూస్తారు. 

ఇండియాకు వచ్చిన తర్వాతే..
ఇండియన్‌ డ్యాన్స్‌ అంటే బాలీవుడ్‌ డ్యాన్స్‌ అని అనుకునేదాన్ని.బాలీవుడ్‌ నృత్యాల్లో కథక్, కూచిపూడి, బాంగ్డా కలిపి ఉంటాయని తెలియదు. ఇండియాకు వచ్చిన తర్వాతే ఈ నృత్యాల గురించి తెలిసింది. బాలీవుడ్‌ డాన్స్‌తో పాటు భరతనాట్యం, కథక్, కూచిపూడి, మోహిని అట్టం కూడా ఇప్పుడు రష్యాలో విరివిగా నేర్చుకుంటున్నారు. ఇండియన్స్, ఇండియా నుంచి నేర్చుకుని వెళ్లిన వాళ్లు
ఈ నృత్యాలు నేర్పిస్తుంటారు. 

25 మందికి శిక్షణ ఇస్తున్నా..
ఎప్పటికీ కథక్‌ నృత్యం చేస్తుండాలని, శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం 25 మంది విద్యార్థులు నా వద్ద శిక్షణ పొందుతున్నారు. కథక్‌ సరదాగా నేర్చుకునే నృత్యం కాదు. ఈ నృత్యానికి ఆసక్తి, డిసిప్లిన్, శ్రద్ధ లేకపోతే కష్టం. నా దగ్గర కథక్‌ నేర్చుకుంటున్న వాళ్లలో 19 నుంచి 50 ఏళ్ల వయసున్న వాళ్లున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)