amp pages | Sakshi

రంగుల ఎక్స్‌రే...

Published on Fri, 07/13/2018 - 01:20

వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది అనుకున్న ఈ కాలంలో కూడా ఎక్స్‌రే నలుపు తెలుపుల్లోనే ఉండటం ఏమిటని మీకెప్పుడైనా అనిపించిందా? త్వరలోనే ఈ పరిస్థితి మారిపోనుంది. శరీరం లోపలి భాగాలను రంగుల్లో చూసుకునేందుకు రంగం సిద్ధమైంది. మార్స్‌ బయో సెన్సింగ్‌ అనే న్యూజిల్యాండ్‌ కంపెనీ పరిశోధనల పుణ్యమా అని అందుబాటులోకి రానున్న త్రీడీ స్కానర్‌ ఎముకలు, కండరాలతో పాటు కొవ్వులను కూడా రంగుల్లో చూపుతుంది. స్విట్జర్లాండ్‌ సరిహద్దుల్లోని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగశాల సీఈఆర్‌ఎన్‌ శాస్త్రవేత్తలు ఈ స్కానర్‌ కోసం ప్రత్యేకమైన మైక్రోప్రాసెసర్‌ను తయారు చేయడం విశేషం.

సంప్రదాయ సీటీ స్కాన్ల ద్వారా శరీరం లోపలికి ఎక్స్‌రే కిరణాలు ప్రసరించినప్పుడు దాని తీవ్రతలో వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా ఎక్స్‌రే తయారవుతుంది. ఎముకల గుండా ప్రయాణించినప్పుడు శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్రాంతం తెల్లగానూ, తగ్గని కండరాల ప్రాంతం నల్లగానూ ఉంటుందన్నమాట. ఇలా కాకుండా లోపలి పదార్థాన్ని బట్టి తగు తరంగ దైర్ఘ్యమున్న కిరణాలను పంపగల స్పక్ట్రల్‌ స్కానర్లను వాడటం ద్వారా మార్స్‌ బయో సెన్సింగ్‌ కలర్‌ ఎక్స్‌రే యంత్రాలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఓ నమూనా యంత్రాన్ని విజయవంతంగా పరీక్షించిన ఈ కంపెనీ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)