amp pages | Sakshi

నా బేనర్లో నేనే డైరెక్టర్ ఛాన్స్ ఇస్తానేమో

Published on Thu, 01/08/2015 - 23:09

పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
స్టోరీ: పూరి డెరైక్షన్:  మీరే!!

 
10 డేస్...
10 స్టోరీ ఐడియాస్
10 మినిట్స్...

 
ఇప్పటికి ఏడు స్టోరీ ఐడియాలు చెప్పా. ఇవాళ్టిది ఎనిమిదో ఐడియా. ఇలా మరో రెండు ఐడియాలు చెప్తా. మొత్తం పది ఐడియాలు. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్‌తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి.
 
గమనిక: నేను చెప్పే కథల్లో గానీ, ఐడియాల్లో గానీ,  ఏదైనా స్టాండర్డ్ తగ్గిందని మీరు ఫీలైతే, వాటిని మీ స్టాండర్డ్స్‌కి మార్చుకుని అందంగా తీయండి.
 
ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు  ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే!
 
ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే   నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో!
 
పూరి  Idea-8
 
 అమ్మాయి మిస్ ఇండియాలా ఉంటుంది. అబ్బాయేమో మిస్టర్ బాహుబలి. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్సే. ఇద్దరి కళ్లూ కలిశాయి. మాటలు కలిశాయి. హార్ట్‌లూ కలిశాయి. ఫైనల్‌గా ఇద్దరి సాఫ్ట్‌వేర్‌లూ ఒక్కటయ్యాయి. అయితే ఇద్దరికీ పెళ్లంటే విముఖత. కానీ ఒకే ఇంట్లో ఇద్దరూ కలిసి మెలిసి ఉండాలని ఫిక్సయిపోయారు. ‘‘ఏంటి సహజీవనమా?’’అని ఎవరైనా అడిగితే, ‘‘మీరు ఏ పేరైనా పెట్టుకోండి. మాకు ఈ జీవనం హాయిగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

ఆరు నెలలు ఆరు క్షణాల్లా గడిచి పోయాయి. కట్ చేస్తే - ఇద్దరికీ తేడా వచ్చింది. మాట పట్టింపు వచ్చింది. వాళ్లిద్దరూ బ్రేకప్‌కి సిద్ధమయ్యారు. ఆ బ్రేకప్ ఎలా ఉంటుందో సరదాగా షార్ట్ ఫిల్మ్ తీయండి. ఆ అమ్మాయి వెర్షన్ వింటే కరెక్టే కదా అనిపించాలి. అబ్బాయి మాటలు వింటుంటే, ఇది సబబే కదా అనే భావం కలగాలి. చివరకు విడిపోవాలి. వాళ్లిద్దరూ విడిపోవడమే మంచిదని మనకూ అనిపించాలి. అంతా ఫన్నీగా ఉండాలి.

నెల రోజులు టైం ఇస్తున్నాం.

 ఫిబ్రవరి 14 వేలంటైన్స్‌డే  మీ ఎంట్రీలకు లాస్ట్ డే.  మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌ని directorsakshi@gmail.comకి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డెరైక్టర్‌ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్‌లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్‌లో పెడతాం. దీంతో మీకు ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఎక్స్‌పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు.
 
ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ
 
సామర్థ్యం ఉన్నవారికి ఆర్థిక సహాయం
 
పూరి జగన్నాథ్ స్టోరీకి దర్శకత్వ బాధ్యతలు వహించి, ష్టార్ ఫిల్మ్ తీయాలనుకున్న పేద కుటుంబాలకు చెందిన యువకులకు తాను ఆర్థిక సాయం చేస్తానని విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వివేకానంద కాలనీకి చెందిన సిగడాం భాస్కరరావు ముందుకొచ్చారు. ‘స్టోరీ పూరి... డెరైక్టర్ మీరే’ అనే శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న స్టోరీలకు షార్ట్ ఫిల్మ్ తీయడానికి ప్రతిభ ఉండి, డబ్బు లేక డెరైక్షన్ చేయలేకపోతున్నామే అని ఆవేదన చెందే యువకులకు తాను ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇందుకోసం ఎవరైనా సమర్థత కలిగినవారు తన ఫోన్ నంబర్‌ను (9949451283) సంప్రదించవచ్చని భాస్కరరావు చెప్పారు.
 
 సిగడాం భాస్కరరావు

 
 
 

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)