amp pages | Sakshi

నోటి క్యాన్సర్‌ అంటున్నారు.. ఏం చేయాలి!

Published on Mon, 03/09/2020 - 10:10

నా వయసు 49 ఏళ్లు. నేను ఇరవై ఏళ్లుగా గుట్కా తింటున్నాను. ఒక నాలుగు నెలల నుంచి నా నోటిలో వాపు కనిపించడంతో పాటు నొప్పి కూడా చాలా ఎక్కువగా వస్తోంది. గత రెండు నెలల నుంచి ఈ బాధ మరీ ఎక్కువయ్యింది. నోటిలో పుండ్లు (మౌత్‌ అల్సర్స్‌) కూడా వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్‌ కావచ్చని, దగ్గర్లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లమని అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. 
– ఎన్‌. రామస్వామి, సూళ్లూరుపేట 

గుట్కాలు/పొగాకు నమిలివారిలో నోటి క్యాన్సర్‌ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత (ఓరల్‌ హైజీన్‌) పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్‌ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. ముందుగా క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌ మిమ్మల్ని పరీక్షించి, మీ చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలో ఏ భాగంలో క్యాన్సర్‌ వచ్చిందో తొలుత పరీక్షించి చూడాల్సి ఉంటుంది. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. మీరు చెబుతున్న లక్షణాలైతే క్యాన్సర్‌కు సంబంధించినవిగానే కనిపిస్తున్నాయి. 

►మొదట మీకు సమస్య ఉన్న భాగంతో పాటు, మెడ భాగంలోనూ  సీటీ స్కాన్‌ లేదా ఎమ్మారై స్కానింగ్‌ పరీక్షలు చేయించి, క్యాన్సర్‌ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్‌ గ్రంథులకూ వ్యాపించిదా అన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్‌ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు.

► ఒకవేళ క్యాన్సర్‌ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరు తెరవడం కూడా కష్టమవుతుంది. మీలోని క్యాన్సర్‌ ఇతరచోట్లకు వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్‌ వచ్చిన భాగం మేరకు తొలగించాల్సి ఉంటుంది. అలా తొలగించిన భాగాన్ని ఆ తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ లేదా రీ–కన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు.

► సర్జరీ తర్వాత నోరు మునపటిలా తెరచుకోదేమోనని కొందరు ఆందోళన చెంతుటుంటారు. కానీ రోబోటిక్‌ సర్జరీతో కుట్లూ ఉండవు. నోరు కూడా పూర్తిగా మునపటిలాగే తెచుకుంటుంది. ముందులాగే నోటిద్వారా ఆహారం తీసుకోవచ్చు.

► ఒకవేళ మెడలోని లింఫ్‌ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్‌ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్‌ డిసెక్షన్‌ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయలు పూర్తిగా మానిపోయాక, రేడియోథెరపీ ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. మొదట మీరు గుట్కా/పొగాకు నమలడం పూర్తిగా మానేయండి. అది కేవలం నోటికే గాక, మెడ, ఆహారనాళం లేదా కడుపులోని ఏ భాగానికైనా క్యాన్సర్‌ వచ్చేలా చేయగలదు. మీరు వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని క్యాన్సర్‌ నిపుణుడిని సంప్రదించండి. 
డాక్టర్‌ సచిన్‌ మార్దా, సీనియర్‌ ఆంకాలజిస్ట్‌ అండ్‌ రోబోటిక్‌ సర్జన్, 
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్‌ 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)