amp pages | Sakshi

ఎమిలీ జోలా (గ్రేట్‌ రైటర్‌)

Published on Mon, 03/11/2019 - 00:35

రచయిత కూడా ఒక శాస్త్రవేత్తలాగా సమాజంలోని పాత్రలను ఆద్యంతమూ పరిశీలించాలనే నేచురలిస్టు వాద రచయిత ఎమిలీ జోలా (1840–1902). ఎంతోమంది రచయితలను ప్రభావితం చేసిన 19వ శతాబ్దపు ఫ్రెంచ్‌ రచయిత. ఇటాలియన్‌ తండ్రికీ, ఫ్రెంచ్‌ తల్లికీ జన్మించాడు. ఏడేళ్లప్పుడు తండ్రి చనిపోయాడు. చాలీచాలని డబ్బుతో తల్లి పోషించింది. ఒక్కోసారి వాలిన పిచ్చుకలను పట్టుకుని తిని బతికారంటారు. పాత్రికేయుడిగా మారకముందు గుమస్తాగా కూడా జోలా పనిచేశాడు. చిన్నతనం నుంచే రచన మీద ఆసక్తి ఉన్న జోలాకు పేరు వస్తున్నకొద్దీ డబ్బు ఒక సమస్య కాకుండా పోయింది.

వారసత్వం, పరిణామం ఒక కుటుంబంలోని ఒక్కో సభ్యుడిని ఎలా ప్రభావితం చేస్తాయో చిత్రించే ఆయన 20 సంపుటాల నవల, ‘లెస్‌ రౌగాన్‌ – మక్వార్ట్‌’. 1870లో ప్రారంభించి సుమారు ఏడాదికొకటి చొప్పున 1893 వరకు పూర్తి చేశాడు. తలచుకోవడానికే భయమేసే బృహత్తర ప్రయత్నం. ఇందులోని జెర్మినల్, ఎర్త్, ద కిల్, నానా భాగాలు విడిగానూ ప్రసిద్ధం.

‘డ్రెయ్‌ఫస్‌ ఎఫైర్‌’ పేరుతో పన్నెండేళ్లపాటు కొనసాగిన చరిత్రాత్మక కేసులో యూదు సైనికుడు డ్రెయ్‌ఫస్‌ వైపు నిలిచాడు జోలా. ఫ్రెంచ్‌ సమాజాన్ని రెండుగా చీల్చిన ఈ చర్య ఆయనను ఎందరికో శత్రువుగా చేసింది. అయినప్పటికీ ఫ్రాన్సులో యూదులపట్ల వ్యతిరేకత పోవడానికి క్రమంగా కారణమయ్యాడు. 1902లో ఇంట్లోనే విషవాయువు బారిన పడి ప్రమాదవశాత్తూ జోలా మరణించాడు. ఈ వాయువు లీక్‌ అవడానికి జోలా వ్యతిరేకులే కారణమని నమ్మినవాళ్లూ ఉన్నారు.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌