amp pages | Sakshi

గ్రేట్‌ రైటర్‌

Published on Mon, 06/04/2018 - 02:04

వాస్తవానికీ కల్పనకూ మధ్యన అంతరాన్ని చెరిపేసిన రచయితగా ఫిలిప్‌ రాత్‌కు పేరు. బలమైన  ఆత్మకథాత్మక పాత్రలు ఆయన రచనల్లో కనబడతాయి. రాజకీయాలపై వ్యంగ్యం, సామాజిక వ్యాఖ్యానం, లైంగికతపై ముసుగులేని ఆలోచనలు చేస్తాడు. జీవితం తాలూకు సిగ్గులేని కల్మషాన్ని వ్యక్తపరుస్తాడు. నాథన్‌ జుకెర్‌మాన్‌ పాత్రే మళ్లీ మళ్లీ అతడి రచనల్లో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ‘నా జీవితపు అసలైన డ్రామా నుంచి ఒక నకిలీ ఆత్మకథని, బూటకపు చరిత్రని, అర్ధ కల్పిత అస్తిత్వాన్ని పుట్టించటమే నా జీవితం’ అంటాడు.

ఒక నవలను శ్రద్ధగా చదవాలంటే అది పాఠకుడినుంచి కొన్ని గుణాలు డిమాండ్‌ చేస్తుందనీ, అవి ఉన్నవాళ్లు చాలా తక్కువమంది అనీ, అందుకే భవిష్యత్తులో చదవడం అనేది కొద్దిమందికే పరిమితం కాబోయే కార్యక్రమమనీ నిరాశ పడతాడు. ‘గుడ్‌బై, కొలంబస్‌’, ‘ఎమెరికన్‌ పాస్టరల్‌’, ‘ద హ్యూమన్‌ స్టెయిన్‌’, ‘పోర్ట్‌నోయ్స్‌ కంప్లెయింట్‌’, ‘మేరీడ్‌ ఎ కమ్యూనిస్ట్‌’, ‘ఎవ్‌రీమేన్‌’, ‘వెన్‌ షి వజ్‌ గుడ్‌’, ‘ద ఘోస్ట్‌ రైటర్‌’ ఆయన ప్రసిద్ధ నవలల్లో కొన్ని. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నాడు రాత్‌. అమెరికాలో ఒక యూదుడిగా తన అనుభవాల్ని రాసినప్పటికీ తనను తాను యూదుడు అనుకోవడానికి ఇష్టపడలేదు. అమెరికా పౌరుడిగానే భావించాడు. 1933లో జన్మించిన ఫిలిప్‌ రాత్‌ తన ఎనభై అయిదో ఏట గత నెల మే 22న కన్నుముశాడు.

Videos

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..

ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?

చంద్రబాబు కుట్రలు...భగ్నం

చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)