amp pages | Sakshi

ఇంటికో మంచి కథ

Published on Thu, 07/02/2020 - 13:35

లాక్‌డౌన్‌ చూశాము.
లాక్‌డౌన్‌ చూడాల్సి రావచ్చు.
తెరిచిన దారుల్లోనే కథలు ఉండవు.
మూసిన తలుపుల వెనుకా ఉంటాయి.
కాసింత ధైర్యం, కాసింత నమ్మకం, 
కాసింత సహకారం ఉంటే
ఇంటి లోపలే ఉన్నా ఆనందం వెతుక్కోవచ్చు.
అందరం పాత్రధారులు కాకతప్పని ఈ సమయంలో
మన పాత్రను గట్టిగా పోషించుకుని నిలబెట్టుకోవడమే
కావలసింది అని చెబుతోంది ‘హోమ్‌ స్టోరీస్‌’ 
అనే ఈ వెబ్‌ సినిమా.

‘యాంగ్జయిటీ’ అనే చూడటానికి ఒక పదమే కాని అది మనిషి మెదడులో ఒక పెద్ద మాయా ప్రపంచాన్నే సృష్టిస్తుంది. కల్పిత భయాలను సృష్టిస్తుంది. దాటలేని శుష్క అగాధాలను నిర్మిస్తుంది. ఒక ఫ్లాట్‌లో నివాసం ఉండే ఆ యువకుడికి యాంగ్జయిటీ డిజార్డర్‌ ఉంటుంది. అతడు ధైర్యంగా బయటకు రాలేదు. బయటకు వస్తే ఊపిరి ఆగిపోయినట్టుగా ఉంటుంది. అతను రోజూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ‘ఇవాళ ఎలాగైనా బయటకు వెళ్లాలి’ అని అనుకుంటూ ఉంటాడు. అందుకు ఆన్‌లైన్‌లో సైకియాట్రిస్ట్‌ సహాయం తీసుకుంటూ ఉంటాడు. బయటకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాక, స్నానం చేశాక, బట్టలు తొడుక్కున్నాక తలుపు దగ్గరకు వెళ్లి బోల్ట్‌ తీసేవేళకు యాంగ్జయిటీ వచ్చేస్తుంటుంది. అతడు చేయగల అతి పెద్ద సాహసం ఏదైనా ఉందంటే అది గది బయట పెట్టి వెళ్లిన ఎగ్‌ బాక్స్‌ను లోపలికి తీసుకెళ్లగలగడమే. కాని ఒకరోజు ఎలాగైనా సరే బయటకు రావాల్సిందేనని నిర్ణయించుకుంటాడు. కాని యథావిథిగా రాలేకపోతాడు. కనీసం ఎగ్‌బాక్స్‌ను లోపలికి తెచ్చుకుందాం అని తలుపు తెరిచి అతి కష్టమ్మీద బయటకు రాగా వెనుక నుంచి తలుపు లాక్‌ పడిపోతుంది. ఇతను బయట ఉండిపోతాడు. ఒక్క క్షణం ఊపిరి తిరగదు. కాని తెరిపిన పడి చుట్టూ చూస్తే ఊపిరి తిరగకపోవడం అంటూ ఏమీ ఉండదని అర్థమవుతుంది. అతడు భయాన్ని జయిస్తాడు. హాయిగా బయటకు వస్తాడు. కాని బయట ఎవరూ ఉండరు. దానికి కారణం ఆ ముందురోజు రాత్రే లాక్‌డౌన్‌ విధించారని తెలుస్తుంది. 

అయితే ఏమిటి? అతడు తన భయాల్ని జయించాడు. ఈ లాక్‌డౌన్‌ను జయించలేడా? కథ ముగుస్తుంది. ఈ కథ పేరు ‘ఔట్‌ విత్‌ ఇట్‌’.రెండో కథ ‘విల్‌ యూ బి మై క్వాంటైన్‌?’. స్నేహితురాలిని కలవడానికి వచ్చిన మిత్రుడు ఆమె ఇంట్లో హటాత్‌ లాక్‌డౌన్‌ వల్ల ఇరుక్కుపోతాడు. వాళ్లిక మూడు వారాలు కలిసి ఉండక తప్పదు. ఆమె ఒక్కత్తి. అతనూ ఒక్కడు. ఇదేదో ఒక రోజు వ్యవహారం అని ఇద్దరూ కలిశారుకాని ఇప్పుడు కలిసి ఉండటమంటే? ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి అభ్యంతరాలుంటాయి. ఆ తర్వాత కీచులాటలు ఉంటాయి. ఆ తర్వాత స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది. లాక్‌డౌన్‌ అనేది ఎదుటివారి పట్ల నెగెటివిటీని పోగొట్టుకునే ఒక మార్గం. మనిషితో గడిపే సమయం పెంచుకుంటే మనిషిని మరింత అర్థం చేసుకోవచ్చు అని చెప్పే కథ ఇది. ఒక అందమైన ప్రేమ కథ.

మూడో కథ ‘డెలివరింగ్‌ స్మైల్స్‌’. ఇది ఒక ఫుడ్‌ డెలివరీ బాయ్‌ కథ. ఉదయాన్నే లేచి మాస్క్, శానిటైజర్, గ్లౌవ్స్‌ తీసుకొని బండి మీద ఫుడ్‌ డెలివరీ చేయడానికి బయలుదేరుతాడు. లాక్‌డౌన్‌లో నిర్మానుష్యమైన ముంబైలో ఇతనొక్కడు ఒక అన్నదాత, స్నేహదాతలా తిరుగుతుంటాడు. ప్రతి ఒక్కరికి ఫుడ్‌ అందించాక అతడు చెప్పే మాట ‘హావ్‌ ఏ నైస్‌ డే’. అతని నుంచి ఫుడ్‌ అందుకునే వారు రకరకాల వారు ఉంటారు. కాని అతను మాత్రం అందరితో చిరునవ్వుతోనే ఉంటాడు. చిరునవ్వు పంచడానికి ఖర్చు ఉంటుందా? మనం ఎంతమందికి చిరునవ్వు పంచుతున్నాం? కష్టకాలంలో చిరునవ్వే కదా ఒక పెద్ద సాయం అని చెబుతుందీ కథ. మనకు ఎదురు పడే మనుషుల్ని చిరునవ్వుతో చూసేలా చేస్తుంది.

నాలుగో కథ ఇంకా గమ్మత్తు కథ. దీని పేరు ‘వెబ్‌ నే బనాది జోడి’. అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. కాని లాక్‌డౌన్‌ వచ్చి పడుతుంది. అమ్మాయి ఒక చోట అబ్బాయి ఒక చోట బంధువులు ఒక చోట. అయినా పెళ్లి పెళ్లే అనుకుంటారు. అమ్మాయి తండ్రికి ఇది నచ్చదు. పెళ్లి పోస్ట్‌పోన్‌ చేద్దాం అంటాడు. ధూమ్‌ధామ్‌గా చేయనిది పెళ్లి ఎలా అవుతుంది? అంటాడు. కాని అమ్మాయి అబ్బాయి ఆయనను ఒప్పిస్తారు. ఆన్‌లైన్‌లోనే అమ్మాయికి నలుగు పెడతారు. ఆన్‌లైన్‌లోనే సంగీత్‌ నిర్వహిస్తారు. పెళ్లి కూడా చెరోచోట ఉండి పురోహితుడి మంత్రాల సాక్షిగా ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకుంటారు. కాలం వేరే విధంగా ఉండమని చెప్పినప్పుడు వేరే విధంగానే ఉండాలి. పద్ధతులు మార్చుకోవాలి. మార్చుకుంటే కొత్త పద్ధతులు కూడా బానే ఉంటాయని చెబుతుందీ కథ. 
ఈ నాలుగు కథలు చూస్తే ఒక్కోసారి మనకు ఉన్న చికాకులు కూడా కథలు అవుతాయని, కొంచెం ప్రయత్నిస్తే అవి సుఖాంతం అవుతాయని అనిపిస్తుంది. లాక్‌డౌన్‌ మీద విసుక్కోకండి. అందులో మంచి వెతకండి. హావ్‌ ఏ నైస్‌ డే.
– సాక్షి ఫ్యామిలీ

వెబ్‌ ఆంథాలజీ: హోమ్‌ స్టోరీస్‌ 
(నాలుగు కథలు)
భాష: హిందీ
నిడివి: 47 నిమిషాలు
నిర్మాణం: నెట్‌ ఫ్లిక్స్‌
ప్రదర్శన: యూట్యూబ్‌ 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌