amp pages | Sakshi

క్లైమాక్స్ మిస్సయింది!

Published on Wed, 09/09/2015 - 23:43

హ్యూమర్ ఫ్లస్

ఈ సంవత్సరం చేపల చెరువుల మీద గుర్నాధానికి  భారీ నుంచి అతి భారీ లాభాలు వచ్చాయి.  ఈ సంతోషంలో తన చిరకాల కోరిక ఒకటి గుర్తుకు వచ్చింది. సినిమా తీయాలనేది అతని చిన్నప్పటి కోరిక.  తాను అమితంగా ఇష్టపడే ‘మిస్సమ్మ’ సినిమాను రిమేక్ చేయాలనుకొని రంగంలోకి దిగాడు. తన స్వగ్రామం పేరునే తన నిర్మాణ సంస్థకు పెట్టుకొని మురిసిపోయాడు.‘మునుగుడు పాలెం టాకీస్’....అబ్బో అదిరిపోయింది అనుకున్నాడు ఒకటికి రెండుసార్లు.

థాయ్‌లాండ్‌లోని ‘షంగ్రీ-ల’ బీచ్ హోటల్లో స్టోరీ డిస్కషన్‌ను మొదలైంది. దీనికోసం హైదరాబాద్, అమరావతి ఉభయ రాష్ట్రాల నుంచి పెద్ద రచయితలను, పెద్ద రచయిత కావాలనుకుంటున్న చిన్న రచయితలను, పనిలో పనిగా ఘోస్టు రచయితలను కూడా తీసుకువచ్చాడు గుర్నాధం.

‘‘మిస్సమ్మ సినిమానే కదా మనం రిమేక్ చేస్తుంది. దీనికి స్టోరీ డిస్కషన్ ఎందుకు? కథను చెడగొట్టకుండా ఉన్నదున్నట్లు తీస్తేనే మంచిది’’ అన్నాడు సీనియర్ రచయిత కళ్లజోడు సవరిస్తూ.

 ‘‘ఉన్నదున్నట్లు తీస్తే రీమేక్ చేయడం ఎందుకు? పాత సినిమానే మళ్లీ విడుదల చేస్తే సరిపోతుంది. మన స్టైల్లో కథ ఉండాలనే ఈ స్టోరీ డిస్కషన్ ఏర్పాటు చేశాను’’ అన్నాడు రాబోయే కాలంలో కాబోయే టాప్ ప్రొడ్యూసర్ గుర్నాథం. మొదట యువ రచయిత ఇడ్లీ ఈశ్వర్‌నాథ్  కథ చెప్పడం మొదలు పెట్టాడు...

‘‘పాత మిస్సమ్మ సినిమాలో చిన్నప్పుడు సావిత్రి మిస్ అవుతుంది. మన సినిమాలో మాత్రం హీరో చిన్నప్పుడు పుష్కరాల్లో  మిస్ అవుతాడు. ఇక అప్పటి నుంచి అతని పేరు మిస్సయ్యగా స్థిరపడిపోతుంది. మిస్సయ్య కోసం కోటీశ్వరుడైన అతని తండ్రి ప్రకాశ్‌రాజ్  వెదకని చోటు ఉండదు.  పదహారు సంవత్సరాల తర్వాత... మిస్సయ్య  ఆచూకీ కోసం పేపర్లో ప్రకటన ఇస్తాడు.

 ‘మిస్సయ్య...మోస్ట్ వాంటెడ్’ ప్రకటన చూసి ‘నేనే మిస్సయ్యను’ అంటూ ఒకడు వస్తాడు. ఎడమకాలు మీద చింతగింజంత పుట్టుముచ్చ చూసి, తన కొడుకే  అని డిసైడై పోయి ఆనందంలో మునిగిపోతాడు ప్రకాశ్‌రాజ్. కథలో ట్విస్ట్ ఏమిటంటే, నెల తిరిగే లోపే ‘వాడు మిస్సయ్య కాదు...నేనే అసలు మిస్సయ్యను’ అంటూ డజను మంది మిస్సయ్యలు వస్తారు. పుట్టుమచ్చలు సేమ్ టు సేమ్. ప్రకాశ్‌రాజ్ తల పట్టుకుంటాడు. అసలు మిస్సయ్య ఎవరు అనేదే క్లైమాక్స్’’

 ‘‘బానే ఉందిగానీ, ఆ ఒరిజినల్ మిస్సయ్యను ఎలా కనిపెట్టారు అనేది నువ్వే చెబితే ఓ పనై పోతుంది’’ అన్నాడు సీనియర్ రచయిత విసుగ్గా. ‘‘మీరు ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు రాశారు కదా...మీరు చెబితేనే బాగుంటుంది’’ అని బాంబును సీనియర్‌పై వేసి చేతులు దులుపుకున్నాడు జూనియర్. వారం రోజుల పాటు క్లైమాక్స్ కోసం చర్చలు జరిగాయి...నో ఫలితం!

 నిర్మాత గుర్నాధానికి చిర్రెత్తిపోయింది.‘‘మీరెవరూ వద్దయ్య...హాలివుడ్ ఫేమస్ స్క్రీన్‌ప్లే రైటర్ డేవిడ్ రాబ్‌సన్ డూప్‌సన్‌ను పిలిపిస్తున్నాను. పోతే పోయింది డబ్బు!’’ అని అన్నంత పని చేశాడు నిర్మాత.డబ్బు కట్టలు బ్యాగులో సర్దుకుంటూ ‘‘కథ ఏంటి?’’ అని అడిగాడు రాబ్‌సన్ డూప్‌సన్.

 నిర్మాత టకటకమని  కథ చెప్పి...‘‘గంటలో స్క్రీన్‌ప్లే చెప్పేస్తారని మీకు పేరు. మా సినిమా క్లైమాక్స్ కోసం మాత్రం ఎంత టైమ్ తీసుకున్నా ఫరవాలేదు’’ అన్నాడు గుర్నాథం. ‘‘అయిదు నిమిషాల్లో చెప్పేస్తా...నీకేమైనా అభ్యంతరమా?’’ పొడవాటి సిగరెట్ ముట్టిస్తూ అన్నాడు డూప్‌సన్. ‘‘అంత కంటే భాగ్యమా’’ మెలికలు తిరిగాడు గుర్నాథం.

 ‘‘వెరీ సింపుల్...ఇప్పుడు ఎలా అనుకున్నారో అలాగే సినిమా తీసి విడుదల చేయండి. దీనికి ‘మిస్సయ్య...ది బిగినింగ్’ అని పేరు పెట్టండి. శుభం కార్డుకు బదులు... అసలైన మిస్సయ్య ఎవరో పార్ట్-2 ‘మిస్సయ్య...ది కన్‌క్లూజన్’లో  చూడండి అని వేయండి. సినిమా హిట్ అయితే పార్ట్-2 గురించి, క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం. హిట్ కాకపోతే మాత్రం వేరే సినిమా గురించి ఆలోచిద్దాం’’ అని టైమ్ చూసుకున్నాడు డూప్‌సన్. తన టైమ్ బాగలేదని డిసైడైపోయాడు గుర్నాథం!
 
 
 

Videos

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

రాక్షస పరివార్..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?