amp pages | Sakshi

కుక్కను చూసి మొరుగుతాడు..!

Published on Thu, 06/26/2014 - 22:55

అతడి పేరు రూడీ రాక్. మిమిక్రీలో దిట్ట. ప్రత్యేకించి జంతువుల అరుపులను అనుకరించడంలో నేర్పరి. దాదాపు ఐదారు శునకజాతుల అరుపులను ప్రాక్టీస్ చేశాడు. ఆ జాతుల శునకాలను మచ్చిక చేసుకొని.. వాటి దగ్గర అచ్చం అలాగే అరిచాడు. (మొరిగానని అతడు అంటాడు). వాటిల్లో ఒక్కో శునకం ఒక్కో విధంగా రియాక్ట్ అయ్యింది. కొన్నేమో బెదిరి పారిపోయాయి. తమకు అలవాటు అయిన మనిషి మాట్లాడకుండా అచ్చంతమలాగే మొరిగే సరికి అవి షాక్ అయి పారిపోయాయి.

మరికొన్ని ఏమో రాక్ పై విరుచుకుపడ్డాయి. అతడు ఉన్నట్టుండి మొరిగే సరికి అవి కూడా అందుకు దీటుగా స్పందిం చాయి.  మరికొన్ని జాతి కుక్క పిల్లలు మాత్రం అర్థం కానట్టుగా ప్రవర్తించాయి. రాక్ మొరుగుతున్నట్టుగా అరుస్తున్నా.. ఆ శబ్దాన్ని అవి అర్థం చేసుకోక అతడిని తమ యజమానిగా భావించి ఆడుకోవడానికి ప్రయత్నించాయి.

ఇంకొన్ని మాత్రం ఆ వీడియో సెటప్‌ను, రాక్ అరుపులను చూసి ‘ఏం జరుగుతోందిక్కడ..’అన్నట్టుగా చూశాయి. దాదాపు ఐదారు శునకజాతులతో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. రాక్ రూపొందించి యూ ట్యూబ్ లోకి అప్‌లోడ్ చేసిన ఈ వీడియో అందరినీ అలరిస్తోంది. ఈ వీడియోలో రాక్ శునకాలను అనుకరించడం ఒక ఎత్తు అయితే.. ఇతడి అరుపులను చూసి శునకాలు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు మరో ఎత్తు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)