amp pages | Sakshi

ఐ యామ్‌ నాట్‌ సిండ్రిల్లా

Published on Sun, 02/25/2018 - 01:37

ప్రియమైన తిరోగామి భారతమా.. నాకు రాత్రింబవళ్లతో పని లేదు.. నచ్చింది చేస్తా. నన్ను ఆపగలిగే హక్కు నీకుందని ఎన్నడూ అనుకోవద్దు.  # ఐ యామ్‌ నాట్‌ సిండ్రిల్లా వీధి వేధింపులకు గురైన  డీజే వర్ణికా కుందును తప్పు పడుతూ రాజకీయ నాయకుడు రామ్‌వీర్‌ భట్టి చేసిన వ్యాఖ్యలపై ఓ యువతి ప్రకటించిన నిరసన ఇది. మగాళ్లు మగాళ్లే అంటారు రామ్‌వీర్‌ లాంటి నాయకులు. బాధితులపైనే నోరు పారేసుకుంటారు. అమ్మాయిల తల్లిదండ్రులకు సుద్ధులు చెబుతుంటారు.

ఈ తరం యువతులు ఇలాంటి ఆంక్షల్ని ప్రశ్నిస్తున్నారు. రామ్‌వీర్‌ ధోరణిని తప్పుపడుతూ యువతులు చేసిన ట్వీట్లు ఇందుకు ఒక ఉదాహరణ. నగర యువతులు అర్ధరాత్రి వేళ వీధుల్లోకి వచ్చి ఫొటోలు తీసుకుని ‘ఆ యామ్‌ నాట్‌ సిండ్రిల్లా’ హ్యాష్‌టాగ్‌తో వాటిని పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం స్టాకింగ్‌ బాధితులకు భద్రత ఇవ్వగల చట్టాలు లేవంటున్నారు వర్ణిక.  భయంకరమైన తన అనుభవాల నేపథ్యంలో ఆమె స్టాకింగ్‌ వ్యతిరేక ప్రచారం చేపట్టారు.

స్టాకింగ్‌ను నాన్‌బెయిలబుల్‌ నేరంగా పరిగణించాలని కోరుతూ  హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, మహిళా శిశు అభివృద్ధిశాఖ మంత్రి మేనకాగాంధీలకు పిటిషన్‌ పెట్టారు. దీనిపై ఇప్పటికి 1,54,000 మందికి పైగా సంతకాలు చేశారు. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం – స్టాకింగ్‌ కేసు నిందితుల్లో 80% మంది.. చార్జిషీట్‌ ఫైల్‌ కాక ముందే బెయిల్‌ మీద బయటకు వస్తున్నారు. స్త్రీ సాధికారత కోసం వర్ణిక చేస్తున్న ప్రచారానికి గుర్తింపుగా 24టీవీ చానల్‌ ఆమెకు జషే యంగిస్తాన్‌ అవార్డు ప్రదానం చేసింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌