amp pages | Sakshi

అదిగదిగో అద్దాల మేడ

Published on Thu, 12/11/2014 - 23:56

మన దగ్గరే
 
ప్రాణహిత గలగలలు, ప్రకృతి అందాలు  మూడు రాష్ట్రాల సరిహద్దులో మురిపిస్తున్న కట్టడంఇంగ్లండ్ నుంచి అద్దాలను తెప్పించారు. భవన నిర్మాణానికి అద్దాలను ఎక్కువగా వాడడంతో ‘అద్దాల మేడ’ అనే పేరు వచ్చింది. భవనాన్ని ముందు నుంచి చూస్తే తాబేలు ఆకారంలో ఉంటుంది.
 
అట్టెం మదునయ్య
చెన్నూరు, అదిలాబాద్
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని సిరొంచా పట్టణంలో ఉన్న అద్దాల మేడ రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాణహిత నది అవతలి ఒడ్డున సిరొంచాలోని అద్దాల మేడ నుంచే రజాకార్లకు వ్యతిరేకంగా భారతసైన్యం చర్యలు చేపట్టింది. ఇక్కడి నుంచే నిజాం సర్కార్‌పై సైనికులు ఉద్యమించారు.1906లో అప్పటి కలెక్టర్ గ్లాస్‌ఫోర్డ్ దీన్ని నిర్మించగా కలెక్టర్ బంగ్లాగా వినియోగించారు.

అద్దాల మేడ నిర్మించి 108 ఏళ్లు...

అద్దాల మేడ నిర్మించి ఈ ఏడాదికి 108 ఏళ్లు పూర్తయ్యాయి. మేడ ఇప్పటికీ  చెక్కుచెదరక పోవడం విశేషంగా. ఈ మేడకు ఇంగ్లండ్ నుంచి అద్దాల తెప్పించారు. భవనానికి అద్దాలను ఎక్కువగా వాడడంతో ‘అద్దాల మేడ’ అనే పేరు వచ్చింది. భవనాన్ని ముందు నుంచి చూస్తే తాబేలు ఆకారంలో ఉంటుంది. లోపల అందమైన గదులు, వంటశాల, విశ్రాంతి గది, సమావేశ గదులు చూపరులను ఆకట్టుకుంటాయి. మూడంతస్తుల మేడ కావడంతో మొదటి అంతస్తులో కలెక్టర్ కార్యాలయం, రెండో అంతస్తులో కలెక్టర్ నివాసం, మూడో అంతస్తు ఎక్కితే 12 కిలో మీటర్ల మేరకు అన్ని గ్రామాలు కనిపిస్తాయి. భవనం లోపల నుంచి 10 కిలో మీటర్ల సొరంగం ఉండేదని, ఈ సొరంగం ప్రాణహిత ఒడ్డు వరకు ఉండేదని సైనికులకు ఈ మార్గం నుంచి ఆయుధాలు అందేవని చరిత్ర చెబుతుంది

ప్రాణిహిత గలగలలు...

అద్దాల మేడ  ప్రాణహిత నది ఒడ్డున ఉంది. ఒకవైపు  ప్రాణహిత గలగలలు, మరోవైపు  పచ్చని చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కోటపల్లి మండలంలోని అర్జున్ గుట్ట దగ్గర నుంచి పడవపై ప్రాణహిత దాటితే అద్దాల మేడ సాక్షాత్కరిస్తుంది.  మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ భవనం పర్యాట ప్రేమికుల మనసు దోచుకుంటుంది.
 
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)