amp pages | Sakshi

పీరియాడిక్‌ 

Published on Mon, 01/07/2019 - 00:00

సమానత్వాన్ని మూటకట్టుకుని ఇరుముడిలా నెత్తి పైనేమీ పెట్టుకోవడం లేదు మహిళలు. ఇరుముడిలోని అసమానత్వాన్ని దేవుడి దగ్గర విడిపించుకోవాలని అనుకుంటున్నారంతే.

బిందు, కనకదుర్గే అనుకున్నాం. అంతకుముందు జనవరి ఒకటిన తమిళ సంతతి మలేసియా మహిళలు ముగ్గురు, వాళ్లు కాకుండా మరో నలుగురు కూడా గర్భగుడిలోకి వెళ్లొచ్చినట్లు బయటపడింది.  బిందు, కనకదుర్గ వెళ్లొచ్చిన మర్నాడు కూడా శ్రీలంక మహిళొకరు దర్శనం చేసుకుని వచ్చారు. అయితే ఈ పది మందిలో బిందు, కనకదుర్గ తప్ప మిగతా వారెవరూ తాము గుడిలోకి ప్రవేశించినట్లు ఒప్పుకోవడం లేదు. బిందు, దుర్గ యాక్టివిస్టులు కనుక సుప్రీం కోర్టే అనుమతి ఇస్తే అడ్డుకోడానికి మీరెవరు అన్నట్లు చొచ్చుకుని వెళ్లొచ్చారు. ఒకవేళ సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వకపోయినా వాళ్లు ఇదే పని చేసి ఉండేవారు. స్త్రీ, పురుషులు సమానమన్నది కోర్టు మాత్రమే చెప్పగలిగిన విషయం కాదు. ‘తమరి దగ్గర తక్కెడ ఉంది కదండీ, కాస్త తూచి చెప్పండి.. అటువైపు ఆడ మనిషి, ఇటు వైపు మగ మనిషి.. ఎవరి బరువు ఎక్కువుందో’ అని మనమే వెళ్లి అడిగాం. ‘ఎవరి బరువు ఎంతున్నా, దేవుడి దగ్గర అందరి బరువూ ఒకటే’ అని కోర్టు తీర్పు చెప్పేసింది.

చెప్పి, ఊరుకోలేదు. తీర్పుకు విరుద్ధంగా ఏమైనా జరిగితే శిక్ష ఉంటుంది అని కూడా హెచ్చరించింది. తీర్పు కోసం వెళ్లి శిక్షను తూయించుకొచ్చాం! వేరే గ్రహాల్లో మనిషికి బరువుండదు. దైవం దగ్గరా అంతే. స్వర్గం అనేది కూడా ఒక గ్రహమే అని మనం అనుకుంటే. తీర్పు ఒకటుండబట్టి, ఆ తీర్పును గాఢభక్తులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి.. ఒకటి.. రెండు.. మూడూ.. అని దర్శనం చేసుకున్న యాభై ఏళ్ల లోపు మహిళా భక్తుల్ని లెక్కిస్తున్నాం కానీ, తీర్పుకు ముందు సంవత్సరాల్లో మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకుని ఉండరా?! ఇంతకంటే ఎక్కువమందే ఉండి ఉంటారు. పట్టింపు కోసమే దర్శనానికి వచ్చేవాళ్లెవరూ ఉండరు. ఆ ఒకరిద్దరు పంతం కోసమే వచ్చారనుకున్నా.. తీర్పు తర్వాత అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న యాభై ఏళ్ల లోపు వయసున్న మహిళల సంఖ్య నాలుగు వేలకు పైగానే ఉంది! అంటే, అయ్యప్ప దర్శనభాగ్యం కోసం ఏళ్లుగా మహిళలు ఎదురు చూస్తున్నారనే కదా. 

‘ఘనకార్యమా ఇది! వీళ్లేమైనా చంద్రమండలం మీద కాలు మోపారా?’  ఎందుకింత రాస్తున్నారు, ఎందుకింత చూపిస్తున్నారు?’.. అనే ఆగ్రహాలు, ఆవేశాలు శరణు ఘోషలా ప్రకంపిస్తు న్నాయి. ఘనకార్యమే. చంద్రమండలంపైకి వెళ్లడం కన్నా, మండలపూజా దర్శనానికి వెళ్లి రావడం ఘనకార్యమే. చంద్రుడి పైకి వెళ్లడానికి తోడుగా భూలోకపు పంచభూతాలను తీసుకెళతారు. భూలోకంలో ఉన్న ఈ ‘నిషిద్ధ’ భక్తి మండలాన్ని చేరుకోడానికి మహిళలకు అరచేతుల్లో పెట్టుకుని వెళ్లే ప్రాణాలు తప్ప వేరే తోడు ఉండదు. మరి ఊరుకోవచ్చుగా. దర్శనాన్ని కోరుకుంటున్న మనసు ఊరుకోనిస్తుందా? ఇష్టంలేని పనిని చేయవలసి వచ్చినప్పుడు మనసెంత బాధపడుతుందో, ఇష్టమున్న పనిని చేయకుండా ఉండాల్సి వచ్చినప్పుడూ అంతే బాధపడుతుంది. ఇష్టంలేని పనిని ‘చెయ్యి’ అనడం, ఇష్టమున్న పనిని ‘చెయ్యొద్దు’ అనడం.. ‘నేను నీ కన్నా ఎక్కువ’ అనే భావనలోంచి వచ్చే ఆజ్ఞాపనే.

స్త్రీ విషయంలో.. ‘నీ ఇష్టం’ అనే మాట మనకింకా రాలేదు. ఇంత భాషొచ్చి, ఇంత కవిత్వం రాసీ.. ఆమె దగ్గర ‘నీ ఇష్టం’ అనే మాట మనకు నోరు తిరగడం లేదు. శబరిమల వెళ్లొచ్చిన మహిళల్ని అభినందిస్తూ.. ‘విక్టరీ కాదు. పీరియడ్‌ ఇది’.. అన్నారు శోభా డే. చరిత్రలో ఇదొక ‘ఎర్ర’ గుర్తు అని. కచ్చితంగా. బిందు, దుర్గ సాధించిన విజయాన్ని హిస్టారిక్‌ విక్టరీ అంటే తక్కువ చేసినట్లే అవుతుంది. ‘పీరియాడిక్‌’ హిస్టరీ ఇది. శోభా డే  స్త్రీవాద రచయిత్రి. స్త్రీ జీవితంలో అనివార్యమైన ఎరుపు రంగు గురించి కదా మన అభ్యంతరాలు. వాటిని నవ్వుతూ తవ్వుతారు ఆవిడ. మగవాళ్ల గుండె జారిపోతుంది. మానవ సంతతికి ఎరుపు, తెలుపు రెండూ అవసరమైనప్పుడు తెలుపు కూడా  బ్లీడింగే కదా.. అది మాత్రం పవిత్రమై, రెండోది కాకుండా పోతుందా అని శోభా డే సందేహం.

సందేహం కాదు. క్లారిటీ అది. సమానత్వ ప్రదర్శనకు దేవుడి గుడే దొరికిందా అనే మాటలో న్యాయం లేదనలేం. అయితే సమానత్వాన్ని మూటకట్టుకుని ఇరుముడిలా నెత్తి పైనేమీ పెట్టుకోవడం లేదు మహిళలు. ఇరుముడిలోని అసమానత్వాన్ని దేవుడి దగ్గర విడిపించుకోవాలని అనుకుంటున్నారంతే. ఆలయాలకు పద్ధతులుంటాయి నిజమే. ఏ ఇంటికి ఆ పద్ధతి ఉన్నప్పుడు, ఏ ఆలయానికి ఆ పద్ధతి ఉండదా! ఇళ్లల్లో కూడా తమ ఇష్టాలను ఇంటి పద్ధతులకు భిన్నంగా నెరవేర్చుకోకుండా ఏమీ లేరు అమ్మాయిలు. స్వేచ్ఛ, సమానత్వాల కోసం పోరాటం కాదది. గుండె నిండా ఊపిరి తీసుకునే ప్రయత్నం. స్పేస్‌ సరిపోవడం లేదనిపిస్తే పద్ధతుల్ని పక్కకు తోసేయడం సహజంగా జరిగే పనే.           ∙ 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)