amp pages | Sakshi

శ్రావణం రాణుల ఓణీలు

Published on Thu, 07/27/2017 - 23:44

శ్రావణం వచ్చింది.
పండగ వాతావరణానికి సంతకం పెట్టింది.
వ్రతాలకు తోరణం అయింది.
అమ్మాయిల అలంకరణ గృహాలన్నీ
ఇప్పుడు రాణిగారి మందిరాలే!
హరివిల్లులు సైతం వెలవెల పోయేలా
ఈ యవరాణులు వర్ణాలను వస్త్రాలుగా ధరిస్తున్నారు.
శ్రావణం వచ్చింది.
లంగా ఓణీ ధరించింది.
శుభం. లక్ష్మీ కటాక్షం!


సాదా సీదాగా కనిపించే కుచ్చుల లెహంగాకు మరో ప్రింటెడ్‌ క్లాత్‌ని కుడివైపున లేయర్‌గా జత చేస్తే ఈ తరం డిజైనర్‌ పరికిణీ అవుతుంది. దీనికి ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్, ప్లెయిన్‌ ఓణీ ధరిస్తే అమ్మడి సింగారానికి కొత్త భాష్యాలు రాసుకోవచ్చు.

లంగా, ఓణీ, బ్లౌజ్‌ ఒకే రంగులో ఎంపిక చేసుకుంటే ఈ తరం అమ్మాయిల ఎంపికకు నూటికి నూరు శాతం మార్కులు పడ్డట్టే! స్వరోస్కి వర్క్‌  చేసిన రాయల్‌ బ్లూ కలర్‌ లెహంగా, అదే హంగులతో అమరిన స్లీవ్‌లెస్‌ బ్లౌజ్, చిన్న చిన్న బుటీలతో ఓణీ సింగారం అబ్బుర పరుస్తుంది.

పండగ అంటేనే పసుపు–ఎరుపుల కాంబినేషన్‌. ఆ రంగుల హ్యాండ్లూమ్‌ క్లాత్‌ని ఎంపిక చేసుకొని లంగాఓణీగా డిజైన్‌ చేసుకుంటే పండగ వేళ ఇలా కళగా ముస్తాబు కావచ్చు. నట్టింటికి పండగ శోభను ఇట్టే మోసుకురావచ్చు.

పసుపు రంగు నెటెడ్‌ లెహంగా, దానికి అంచుగా డిజైనర్‌ ప్యాచ్‌ జత చేస్తే పండగ శోభ వచ్చితీరాల్సిందే! అంచు రంగులో ఎంపిక చేసుకున్న స్లీవ్‌లెస్‌ బ్లౌజ్, కాంట్రాస్ట్‌ ఓణీ ధరిస్తే ఆధునికతకు సంప్రదాయపు హంగులు అద్దినట్టే!

తెల్లటి పరికిణీకి ఎంబ్రాయిడరీ చేసిన పర్పుల్‌ కలర్‌ అంచును  ప్యాచ్‌గా వేసి, అదే రంగు ప్లెయిన్‌ బ్లౌజ్‌ ధరించి, వైబ్రెంట్‌గా వెలిగే ఓణీని జత చే ర్చితే... ఇదిగో ఇలా తెలుగింటి పండగకు నట్టింట విరుస్తాయి సంబరాల వెలుగులు.

గులాబీ రంగు బెనారస్‌ పట్టు లెహంగాకు అంచుగా ప్లెయిన్‌ క్లాత్, దానికి కిందగా మరో లేయర్‌.. డిజైనర్‌ లెహంగాలో కొత్తగా మెరిసిపోతుంది ఈ తరహా డ్రెస్సింగ్‌. బంగారురంగును పోలి ఉండే లాంగ్‌ జాకెట్, ప్లెయిన్‌ ఓణీ వేడుకును మరింతగా వెలిగిపోయేలా చేస్తుంది.

చేతిపనితనంతో లతలలో ఒదిగిన పువ్వుల హంగులు నీలిరంగు పరికిణీపై నిలువుగా పరుచుకున్నాయి. అంచు లుగా తీరుగా ముస్తాబు అయ్యాయి. ఏ మాత్రం మ్యాచ్‌ కాని కాంట్రాస్ట్‌ బ్లౌజ్, క్రీమ్‌ కలర్‌ ఓణీ పండగకు సంప్రదాయపు కళ అద్దుతుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)