amp pages | Sakshi

కొత్తసరుకు

Published on Tue, 10/14/2014 - 23:52

ఐబాల్ ఆండీ ఫ్రిస్‌బీ...

దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐబాల్ తాజాగా ఫ్రిస్‌బీ, స్టాలియన్ పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫ్రిస్‌బీ రూ.5799, స్టాలియన్ రూ.6999లకు ఈకామర్స్ సైట్ల ద్వారా లభిస్తున్నాయి. ఫ్రిస్‌బీ ఫీచర్ల విషయానికొస్తే... ఇది లేటెస్ట్ ఓఎస్ కిట్‌క్యాట్‌తో నడుస్తుంది. నాలుగు అంగుళాల స్క్రీన్‌సైజున్న ఈ ఫోన్‌లో 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను వాడారు. ఒక జీబీ ర్యామ్, 4జీబీల ప్రధాన మెమరీ ఉన్నాయి. ప్రధాన కెమెరా రెజల్యూషన్ 8 ఎంపీ, సెల్ఫీ కెమెరా రెజల్యూషన్ 0.3 ఎంపీ మాత్రమే. బ్యాటరీ సామర్థ్యం 1600 ఎంఏహెచ్ మాత్రమే. ఇక స్టాలియన్ ఫీచర్లను పరిశీలిస్తే... దీని స్క్రీన్ సైజు అయిదు అంగుళాలు కాగా, బ్యాటరీ సామర్థ్యం 1700 ఎంఏహెచ్. మిగిలిన ఫీచర్లన్నీ ఫ్రిస్‌బీతో సమానంగా ఉన్నాయి. రెండు ఫోన్లకూ త్రీజీ, ఎడ్జ్,జీపీఆర్‌ఎస్, వైఫై 802.11.బీ/జీ/ఎన్, మైక్రోయూఎస్‌బీ, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్లున్నాయి.
 
జోల్లా సెయిల్‌ఫిష్...
 
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో సరికొత్త ఎంట్రీ ఈ జోలా సెయిల్‌ఫిష్ ఓఎస్. ఆండ్రాయిడ్, విండోస్, ఆపిల్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల తరువాత ఫైర్‌ఫాక్స్ ఓఎస్ అందుబాటులోకి రాగా తాజాగా ఈ సరికొత్త ఓఎస్ సెయిల్‌ఫిష్ మార్కెట్‌లోకి వచ్చింది. మాజీ నోకియా ఉద్యోగులు కొందరు ఏర్పాటు చేసిన కంపెనీ ద్వారా విడుదలైన సరికొత్త స్మార్ట్‌ఫోన్ అనేక ఆసక్తికరమైన ఫీచర్లు కలిగి ఉంది. ఇటీవలే భారతీయ మార్కెట్‌లో విడుదలై ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు రూ.16,499. సెయిల్‌ఫిష్ ఓఎస్ ప్రత్యేకత దాని యూజర్ ఇంటర్ఫేస్, మల్టీటాస్కింగ్ సామర్థ్యాల్లో ఉందని నిపుణులు అంటున్నారు.  స్క్రీన్‌సైజు 4.5 అంగుళాలు కాగా, దీంట్లో 1.4 గిగాహెర్ట్జ్‌డ్యుయెల్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ఫోన్‌ను ఉపయోగించారు. రామ్ ఒక జీబీ, ఇంటర్నల్ స్టోరేజీ 16 జీబీ. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా మెమరీని మరింత పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా 8 ఎంపీ రెజల్యూషన్‌తో, సెల్ఫీ కెమెరా 2ఎంపీ రెజల్యూషన్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లోని చాలావరకూ అప్లికేషన్లను సపోర్ట్ చేయడం మరో విశేషం. ఎస్‌ఎంఎస్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి అన్ని రకాల మెసేజింగ్‌లు ఒకేచోట ఉండటం మరో ఆసక్తికరమైన ఫీచర్.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)