amp pages | Sakshi

రాగానికీ విరాగానికీ మధ్య...

Published on Mon, 10/06/2014 - 22:51

రాగానికీ విరాగానికీ మధ్య విభజనరేఖ చాలా సన్నటిది. ప్రణయం బెడిసి కొడితే, ప్రియుడు కాస్తా బైరాగి అవుతాడు. ఈ రాగ, వైరాగ్యాల కలనేత- గుల్షన్ గుబుళ్లు, గోహర్ కన్నీళ్లు. పారశీక కవిత్వంలోనూ మరీ ముఖ్యంగా గజల్, రుబాయి వంటి ఛందస్సుల్లోనూ పుష్కలంగా ఉన్నాయి.
 
అప్పుడప్పుడు మన ప్రాకృత గాథా రచనలు కూడా వీటికి దగ్గరగా వస్తుంటాయి. ఛందస్సు, సంగీతం, విరహం, వేసట... ఈ తరహా రచనలను నిత్యహరితంగా ఉంచుతుంటాయి. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా ప్రపంచమంతటా శృంగారాన్ని రసరాజంగా పరిగణించినట్టు కనిపిస్తుంది.

ఆహా! అనిపించే ఒక ఊహ అతి చిన్న పద్యాన్ని సైతం కవిత్వంతో విద్యుత్కరించగలుగుతుంది. ప్రణయానికి సంబంధించినంత వరకు ఒక్కొక్క జాతికి ఒక్కొక్క సంస్కృతి ఉంది. యువతీ యువకుల అనురాగ తీవ్రతని బట్టి , నాగరకతాంతరాలను బట్టీ వ్యక్తీకరణ మారిపోతుంటుంది. విజ్ఞులైన ప్రేమికులు అపురూప శృంగారానుభవాన్ని విరహస్థితిలో ఉంచడానికే ఇష్టపడతారు. విరహ కవిత్వంలో అగ్రగణ్యమైనది ఉర్దూ, పారశీక, అరబ్బీ రచనల్లో విలక్షణంగా కనిపిస్తుంది. వీటిలో స్త్రీ పురుషులు ఒకరికోసం ఒకరు పడే తహతహకు ఆవరణంగా, యౌవనజీవన పరిమళం ప్రత్యేకించి ఉంటుంది. అటువంటి కొన్ని ముక్తకాల్ని యేరి ఆరుద్ర అరబ్బీ మురబ్బాలను రుచిమంతగా అమర్చిపెట్టారు.

‘మురబ్బా’ అంటే తేనెలోగానీ, బెల్లం పాకంలోగాని మాగిన పళ్లు. మా చిన్నప్పుడు ‘అల్లం మురబ్బా’ అంటూ ఒక సాహెబుగారు ఇళ్లకు తెచ్చి అమ్మేవారు. అల్లపు కారం చురుక్కుమనిపిస్తూనే ఒక హాయైన తీపి ఉండేది. ఆరుద్ర అరబ్బీ మురబ్బాలలో అనుప్రాస సంబంధం మాత్రమే కాక ‘అల్లం మురబ్బా’లాగ చురుకూ, తీపి, కలగలిసి అలరిస్తాయి.

-‘ఆరుద్ర అరబ్బీ మురబ్బాలు’ పుస్తకానికి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రాసిన ముందుమాట నుంచి.
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)