amp pages | Sakshi

ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం

Published on Fri, 04/13/2018 - 00:27

ఎండవేడి వల్ల చర్మం కమలడం, మంటపుట్టడం సంభవిస్తుంది. చెమట, దుమ్ము జిడ్డు సమస్య వల్ల చర్మం నలుపురంగుకు మారుతుంది. ఈ సమస్య నివారణకు... 

∙రెండు టీ స్పూన్ల నారింజతొక్కల పొడిలో కొద్దిగా పాలు పోసి పేస్ట్‌లా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాసి, 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజూ ఈ విధంగా చేస్తుంటే చర్మానికి ఉపశమనంగా ఉండటమే కాకుండా నలుపు తగ్గుతుంది.

∙అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును మచ్చలున్నచోట మాత్రమే కాదు, ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణాలు చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. 

∙కలబంద జెల్‌ను మచ్చలు ఏర్పడిన చోట రాసి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని మచ్చలు తగ్గుతాయి.

∙రెండు స్పూన్ల నిమ్మరసంలో స్పూన్‌ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి, మచ్చలపై రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం మచ్చలను తగ్గించుకోవచ్చు. 

∙బంగాళదుంప రసాన్ని మచ్చలున్న చోట రాయాలి. కమిలిన చర్మం మీద బంగాళదుంప రసం రాస్తే ఉపశమనం ఉంటుంది. టాన్‌ సమస్య ఉండదు.

∙స్ట్రాబెర్రీలో విటమిన్‌ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. స్ట్రాబెర్రీ గుజ్జును మచ్చల మీద రాసి, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి.

∙రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, మచ్చలున్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌ పోసి, పేస్ట్‌ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేస్తూ ఉంటే మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. 

#

Tags

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)