amp pages | Sakshi

అప్పుడే పుట్టిన ర్యాటిల్ స్నేక్ విషం కూడా ప్రమాదమేనా?

Published on Sat, 11/08/2014 - 22:41

జంతుప్రపంచం
 

ర్యాటిల్‌స్నేక్ శరీర నిర్మాణం మిగతా సర్పాల మాదిరిగా ఉండదు. తల త్రిభుజాకారంలో ఉంటుంది. కనుగుడ్లు పొడవుగా ఉంటాయి. తోక చివర గలగల శబ్దం చేసే గిలక్కాయ మాదిరిగా ఉంటుంది. దాన్ని ర్యాటిల్ అంటారు. అందుకే ఈ పాముల్ని ర్యాటిల్ స్నేక్స్ అంటారు!

పుట్టినప్పుడు పిల్లల తోకకు ర్యాటిల్ ఉండదు!

ఇవి అత్యంత విషపూరితమైన పాములు. వీటి కాటుకు గురి అయిన జీవి శరీరంలోని రక్తనాళాలు, కణాలు క్షణాల్లో చచ్చుబడిపోతాయి. ప్రాణాలు పోతాయి. అయితే ఇవి ఒక్కోసారి కాటు వేస్తాయి కానీ విషాన్ని వదలవు. అలాంటప్పుడు ప్రమాదం ఉండదు. ఇలాంటి కాట్లను ‘డ్రై బైట్స్’ అంటారు!

విచిత్రమైన విషయం ఏమిటంటే... కాటు వేసినప్పుడు ఎంత విషాన్ని వదలాలా అన్న అంచనా ఉంటుంది వీటికి. అవతలి జీవి పరిమాణాన్ని బట్టి విషం మోతాదును వదులుతుంటాయి!పూర్తిగా ఎదిగిన ర్యాటిల్ స్నేక్ కంటే అప్పుడే పుట్టినవి చాలా ప్రమాదకరం. వీటిలో విషం పెద్దవాటిలో కంటే ఎక్కువగా ఉంటుంది! ఈ పాముల తోక చేసే శబ్దం వల్ల ఇతర జీవులు
 
వీటి జాడను గుర్తించి, దగ్గరకు రాకుండా జాగ్రత్త పడు తుంటాయి. అయితే వీటికి ఆశ్చర్యం కలిగినప్పుడు తోక శబ్దం చేయడం మానేస్తుంది. అలాంటప్పుడు మాత్రం వీటిని గుర్తించడం కష్టం! ఇవి ఎలుకలు, చుంచులు, కుందేళ్లు, పక్షుల్ని తింటాయి. ఏదీ దొరక్కపోతే పస్తులుంటాయి తప్ప, పొరపాటున కూడా శాకాహారాన్ని ముట్టవు. జంతువు కనబడగానే కాటు వేసేస్తాయి. అవి చనిపోయేవరకూ వెంటాడి, చనిపోయాక తింటాయి!
     
ఇవి గడ్డకట్టించే చలిలో కూడా మనగలవు. అయితే అతి వేడిని మాత్రం తట్టుకోలేవు. వేడి 38 డిగ్రీలు దాటిందంటే వీటికి ప్రాణగండమే! వీటికి శబ్దాలు వినిపించవు. కానీ నోటికి కాస్త పైన ఉండే జాకబ్‌సన్స్ అనే అవయవం కారణంగా వాసనలు బాగా తెలుస్తాయి. భూప్రకంపనల ద్వారా చుట్టూ జరిగే వాటిని అర్థం చేసుకుంటాయి! అవి అత్యంత వేగంగా కదులుతాయి. ఎక్కడో దూరంగా చుట్ట చుట్టుకుని ఉంది కదా అని అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులు. అంత దూరం నుంచీ తన శరీరాన్ని వాయువేగంతో మనవైపు తీసుకొస్తుంది. చప్పున కాటు వేసేస్తుంది!
 
 

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?