amp pages | Sakshi

వీరికీ కొన్ని హక్కులున్నాయి

Published on Sun, 12/20/2015 - 23:35

ఆ వాదనలో నిజం లేదు...
లీగల్ కౌన్సెలింగ్

 
మా వివాహమై ఆరు సంవత్సరాలైంది. మా దాంపత్య జీవితంలో ఏ లోటూ లేదు. పిల్లలు కలిగినప్పుడే కలుగుతారులే మనకింకా వయసైపోలేదని మా వారి వాదన. ఇదిలా వుండగా నాకో షాకింగ్ విషయం తెలిసింది. మా వారు నాకు చెప్పకుండా ఏనాడో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారని. నాకాయన ముఖం చూడాలన్నా అసహ్యం వేస్తోంది. అతనితో కలసి వుండలేను. ఏం చేయాలి?
 - ఉమ, వైజాగ్

హిందూ వివాహచట్టం సెక్షన్ 13ను అనుసరించి ‘క్రూరప్రవర్తన’ విడాకులు తీసుకోడానికి ఒక ఆధారం. అది శారీరకం కావచ్చు. మానసికం కావచ్చు. వైద్యకారణాలు లేకుండా భర్త లేదా భార్య రహస్యంగా పిల్లలు కలుగకుండా ఆపరేషన్ చేయించుకుంటే అది క్రూరత్వమే అవుతుంది. భార్యాభర్తలలో ఒకరికి తెలియకుండా, మరొకరి అంగీకారం లేకుండా ఇలా చేయడం క్రూరత్వమేనని, ఆ కారణం మీద విడాకులు ఇవ్వవచ్చునని సుప్రీంకోర్టు అనేక కేసులలో రూలింగ్ ఇచ్చింది. మీరు అన్ని వివరాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించండి.
 
 నా భర్తపై 498-ఎ కేస్ వేశాను. అది కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ లోగా మా ఇరుకుటుంబాల వారు మాట్లాడుకొని, కేస్ కాంప్రమైజ్ అవ్వాలని, దానికి గాను అతను 15 లక్షలు శాశ్వతమనోవర్తి ఇచ్చేలా, ఇరువురూ క న్‌సెంట్ విడాకులు తీసుకునేలా నిర్ణయించారు. నా సమస్యేమిటంటే విడాకుల పిటిషన్ దాఖలు చేసే నాడు 10 లక్షలు, విడాకులు మంజూరు చేసే నాడు మిగతా 5 లక్షలు ఇస్తామని అంటున్నారు. నాకేమో మోసపోతానని భయంగా ఉంది. ఏం చేయమంటారు?
 - సౌమ్య, విజయవాడ

మీరుచెప్పిన విషయాలు పిటిషన్‌లో రాసుకుంటే భయపడే అవసరం లేదు. మొదటి విడత డబ్బులు ఎలాగూ ఇచ్చేస్తారు. రెండో మొత్తం మీకు ముట్టిందని జడ్జిగారు నిర్ధారించుకున్న తర్వాతనే మీకు విడాకులు వస్తాయి. మీకు మొత్తం సొమ్ము ముట్టకుండా విడాకులు రావు. ఒక వేళ మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎటూ క్రిమినల్ కేసు ఉండనే ఉంది. ముందు విడాకుల కేసు, తర్వాత క్రిమినల్ కేసు ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు క్రిమినల్ కేస్ కాంప్రమైజ్ అవ్వవచ్చు.

మేము ఒక ట్రైబల్ తండాకు చెందిన వాళ్లము. మాకు ఒక పాప. కొన్ని కారణాల వలన మేము ఇద్దరం మా పెద్దల కులపంచాయతీ ద్వారా విడాకులు తీసుకున్నాము. తర్వాత నేను రెండో పెళ్లి చేసుకున్నాను. నేను మా తండాలోనే అంగన్‌వాడీ వర్కర్‌గా పనిచేస్తున్నాను. పాపకూడా నాదగ్గరే ఉంది. నాభర్త బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఒక రోజు నా మాజీ భర్త పాపను చూసివెళ్తానని అడిగితే అంగన్‌వాడీ స్కూల్ దగ్గరకురమ్మని చెప్పి పాపను చూపించి పంపించాను. అది తెలిసిన నా భర్త నన్ను అనుమానించి, చిత్రహింసలు పెట్టి అసలు మా వివాహం చెల్లదని, రద్దు చేయమని కోర్టును ఆశ్రయించాడు. నేను అసలు మొదటి భర్త నుండి విడాకుల తీసుకోలేదని అతని వాదన. నేను అతనికి అన్నీ చెప్పే వివాహం చేసుకున్నాను. నాకు సలహా ఇవ్వండి.
 - మంగ్లీ, ఆదిలాబాద్

 అతని వాదనలో నిజం లేదు. ఎందుకంటే మీరు మీ మొదటి భర్త నుండి తీసుకున్నవి ‘కస్టమరీ డైవర్స్’ అంటే కొన్ని ‘గుర్తించబడిన కులాలకు, తెగలకు’ చెందిన వారి ఆచారాలను సంప్రదాయాలను, తరతరాలుగా వస్తున్న పద్ధతులను అనుసరించి ‘కులపెద్దల’ సమక్షంలో విడాకులు తీసుకునే కట్టుబాటు ఉంటుంది. వీరి వివాహ పద్ధతులు, సంప్రదాయాలు, ఆచారాలు భిన్నంగా ఉంటాయి. సెక్షన్ 29(2) హిందూ వివాహచట్టం కుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం వివాహాన్ని రద్దు చేసుకోడానికి వున్న హక్కును మార్పు చేయదు. ఆచారాల ప్రకారం విడాకులు తీసుకునే పద్ధతి అమలులో వుంటే ఈ చట్టం దానిని రక్షిస్తుంది అని అర్ధం. కనుక మీ వారి పిటిషన్‌ను అడ్డుకోవచ్చు. మీవర్షన్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోయ పద్మజ వర్సెస్ లోయ వీర వెంకట గోవిందరాజులు కేస్‌లో తీర్పునిచ్చింది.
 
వీరికీ కొన్ని హక్కులున్నాయి
వారు ఒక రకంగా విధివంచితులు. వారంతా హెచ్‌ఐవీ బాధితులు. కేవలం ప్రభుత్వాస్పత్రి వారిచ్చే మందులపైనే ఆధారపడుతున్నవారు. నెలనెలా ఆస్పత్రికి పోవాలి. వారి ఐడెంటిటీలు చూపాలి. ఎవరైనా గమనిస్తారేమోనని ముఖాలకు స్కార్ఫ్ కట్టుకోని ఆస్పత్రికి వెళ్ళి మందులు తెచ్చుకోవాలి. పరీక్షలు చేయించుకోవాలి. ఇక హాస్పిటల్ సిబ్బంది నుంచి వైద్య సిబ్బంది వరకూ అందరూ వారి పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. చులకనగా చూస్తున్నారు. ఎంత రోగగ్రస్తులైనా వారికీ ఆత్మగౌరవం వుంటుంది. అసలు తమకు గల హక్కులూ, రక్షణల గురించి తెలుసుకోవాలని ఒక స్వచ్ఛంద సేవాసంస్థను సంప్రదించారు. హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కోర్టు తీర్పు ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం...  చట్టంముందు అందరూ సమానులేనన్న హక్కు.  స్వేచ్ఛగా రక్షణ వుండే హక్కు  తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించే హక్కు  ఎయిడ్స్ వున్న వ్వక్తులను వివాహం చేసుకునే హక్కు  గుప్తత హక్కు  అమానవీయ హింసల నుండి రక్షణ పొందే హక్కు  ఉద్యోగ హక్కు  నష్టపరిహారం పొందే హక్కు వీటితోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకారం ప్రతి పేషంట్‌కి నెలకు 1000/- ఆర్థికసాయం పొందవచ్చు. వారి హక్కులకు భంగం వాటిల్లితే హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. కనుక హాస్పిటల్ వారి అమానవీయ ప్రవర్తన గురించి కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలని నిర్ణయించుకున్నారు.
 
ఇ.పార్వతి
అడ్వొకేట్ అండ్
ఫ్యామిలీ కౌన్సెలర్

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)