amp pages | Sakshi

స్టార్‌... స్టార్‌... విలేజ్‌ స్టార్‌

Published on Tue, 03/10/2020 - 04:31

గంగవ్వా... నీతో ఒక సెల్ఫీ... గంగవ్వా... ఒక షేక్‌హ్యాండ్‌ ఇవ్వవా... గంగవ్వా... ఏదైనా మాట్లాడవా... గంగవ్వను చూస్తే అందరికీ ఉత్సాహమే. అందరికీ సంతోషమే. గంగవ్వ సెలబ్రిటీ. ఊరి నుంచి నగరానికి, నగరం నుంచి దేశానికి తెలిసి సెలబ్రిటీ. ఆమె మాట ఆమె గుర్తింపు కార్డు. తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి ఆమె అనధికార అంబాసిడర్‌. ఆమె చేస్తున్న ‘మై విలేజ్‌ షో’ యూ ట్యూబ్‌ బాహుబలి అంత పెద్ద హిట్‌.
అందుకే గంగవ్వ సన్మానాలందుకుంటోంది. సత్కారాలు పొందుతూ ఉంది.

తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతిరూపంగా ఉన్న గంగవ్వ ‘మై విలేజ్‌ షో’ ద్వారా యూ ట్యూబ్‌ స్టార్‌గా ఎదిగింది. కూలిపనులు చేసుకుంటూ జీవించే గంగవ్వ, అక్షరం నేర్చుకోని గంగవ్వ, ఊరు దాటి బయటకు రాని గంగవ్వ... ఇప్పుడు దేశ ఎల్లలు దాటి విదేశాలలోని తెలుగువారి అభిమానాన్నీ చూరగొంటోంది. సినిమాల్లో నటిస్తోంది. తెలంగాణ గ్రామీణ సంస్కృతిని తనదైన యాసతో సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నందుకు ప్రభుత్వం ఆమెను మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా లక్షరూపాయల నగదు పురస్కారంతో సత్కరించింది. ఈ సందర్భంగా తన గురించి అడిగితే కష్టాలను తట్టుకొని ఎలా నిలబడిందో తెలిపింది.

‘మాది జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామం. మా నాయిన లచ్చయ్య నాకు ఊహ తెలియక ముందే కన్నుమూశాడు. పదమూడేళ్ల వయసులో అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తమ్ముళ్ల బాధ్యత తీసుకున్నా. నాకు ముగ్గురు పిల్లలు. మా ఆయన గంగయ్య ఏ పనీ చేయక తాగుడుకు బానిసయ్యాడు. ఏ రాత్రీ గొడవ లేకుండా తెల్లారలేదు. పగటిపూట కూలిపనులకు వెళుతూ, రాత్రిపూట బీడీలు చుట్టేదాన్ని. కంటినిండా నిద్ర అన్న విషయమే మర్చిపోయా. బాగా సంపాదిస్తానని మా ఆయన పదిహేనేళ్ల క్రితం గల్ఫ్‌కి వెళ్లాడు. వెళ్లింది వెళ్లడమే... తను ఉన్నాడో లేడో కూడా తెలిసింది కాదు. నయాపైసా పంపిందిలేదు. ఆ తర్వాత ఎప్పుడో అక్కడే చనిపోయాడని తెలిసింది.

భుజాన సచ్చిపోయిన బిడ్డతో...
నా చిన్న బిడ్డ అనితకు ఎనిమిదేళ్ల వయసులో మస్తు జొరం వచ్చింది. అప్పుడు మా ఆయన గల్ఫ్‌లో ఉన్నడు. జగిత్యాలలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చిన. వారం రోజులు గడిచాక డాక్టర్‌ ‘ఇక నీ బిడ్డను ఇంటికి తీసుకపో’ అన్నాడు. నా బిడ్డకు నయం అయ్యింది. డాక్టరు మంచోడు అనుకున్న. తనని భుజాన వేసుకుని బస్టాండుకు వెళ్లా. అనిత కాళ్లు, మెడ వేలాడుతుండడంతో బస్టాండులో ఎవరో చూసి సచ్చిపోయిన బిడ్డను ఎందుకు ఎత్తుకున్నవ్‌ అని అడిగిండ్రు. సచ్చిపోలే నిద్రపోయింది అని చెప్పిన. సచ్చిపోయినోళ్ల కాళ్లే ఇట్లా వేలాడుతయ్‌ అది కూడా నీకు తెల్వదా అనడంతో బిడ్డను కిందికి దించి, చూసేసరికి ఊపిరి ఆగిపోయిందని తెలిసింది. బస్టాండులోనే శవాన్ని పెట్టుకుని ఏడ్చిన...’ అంటూ బిడ్డను గుర్తుకు చేసుకొని కంటనీరు పెట్టుకుంది గంగవ్వ.


పూరి జగన్నాథ్‌తో...

దశ తిప్పిన యూట్యూబ్‌
వ్యవసాయ కూలీగా పని చేసుకుంట బతుకు వెళ్లదీస్తున్న గంగవ్వకు ‘మై విలేజ్‌ షో’ అనే యూ ట్యూబ్‌ షో మరో జన్మనిచ్చిందని చెప్పింది. తనకే తెలియని తనలోని సహజ నటిని ప్రపంచానికి పరిచయం చేసింది. తన స్వభావంతో, తన మాటతో, తన విరుపుతో గంగవ్వ నటించడం వల్ల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆమె ఉన్న ఎపిసోడ్‌ హిట్‌ అని పేరుపడింది. గంగవ్వ ఇప్పటి వరకు సుమారు 100 షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించింది. తన ఇంట్లో టీవీ కూడా లేని గంగవ్వ టీవీ, సినిమా స్టార్‌గా ఎదిగింది. గంగవ్వ సహజ నటన ను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం, ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాల్లో అవకాశం కల్పించారు. టీవీ ఛానల్‌లో ప్రసారమైన సిక్త్స్‌సెన్స్‌ కార్యక్రమంలో విజేతగా నిలిచి అబ్బుర పరిచింది.


మహిళా దినోత్సవం సందర్భంగా ‘గ్రామీణ సంస్కృతి ప్రచారకర్త’గా అవార్డు అందుకుంటూ

ప్రపంచస్థాయిలో గుర్తింపు
మారుమూల గ్రామం లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగవ్వ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. బ్రిటీష్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ సంస్థ తరపున రివర్స్‌ స్టోరీ అంశంపై గంగవ్వ క్షేత్రస్థాయిలో పర్యటించి రిపోర్టింగ్‌ చేసింది. అమెరికా, ఆస్ట్రేలియాలోని తెలుగువాళ్లు గంగవ్వను కలిసేందుకు ఇష్టపడుతున్నారు. ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్లి, ఆమె మాటలు, తిట్లు వింటూ సంబరపడిపోతున్నారు. పదేళ్ల చిన్నారుల నుండి పండు ముసలివాళ్ల వరకు గంగవ్వను చూడాలని, మాట్లాడాలని పోటీ పడుతున్నారు. సోషల్‌ మీడియా, రూరల్‌ మీడియా విభాగంలో గంగవ్వ తన ప్రతిభకు పురస్కారాలు అందుకుంది. ‘బతుకంతా మస్తు కష్టపడ్డ. రాట కొట్టిన, మోట కొట్టిన, బారాన కోసం కూళ్లకు పోయిన. ఫలితం లేకపోయింది. ఇప్పుడు మీ అందరి వల్ల ఇయ్యాల పేరొచ్చింది. చిన్నగున్నమని చింత చేయద్దు. పెద్ద పోకడకు పోవద్దు. పెద్దగ పెంచుకుంట పోతే ఇంక మనకు బాగా పేరొస్తది’ అంటూ పురస్కారం అందుకున్న సందర్భంగా ఇలా అమూల్యమైన మాటలు తెలిపింది గంగవ్వ. 
– నిర్మలారెడ్డి, జవ్వాజి చంద్రశేఖర్, ల్యాల ఫొటోలు: బొమ్మెన కుమార్‌

నాకింత గుర్తింపు వస్తదనుకోలేదు
బడికి పోలేదు. పలక బలపం పట్టి చదువు నేర్సుకోలేదు కాని ఇప్పుడు ఇంగ్లిష్‌ కూడా కొంచెం కొంచెం మాట్లాడుతున్న. డైరెక్టర్‌ పూరి సార్‌ నన్ను పిలిచి సినిమాల నటించమంటే ‘నటించుడు రాదు సారూ మీరు చెప్పింది చెప్పినట్లు సేత్తా’ అంటే కొద్దిసేపు ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలో తీసుకున్నడు. మల్లేశం సినిమాలో చేసిన. టీవీలో ఓ యాడాది యాంకర్‌గా చేసిన. ఎక్కడైనా నమ్మకంగా ఉండి, ఆత్మవిశ్వాసంతో పని చేస్తే విజయం లభిస్తుంది. – గంగవ్వ, యూట్యూబ్‌ స్టార్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌