amp pages | Sakshi

ప్రతి అక్షరం నాయకత్వ లక్షణం

Published on Mon, 02/12/2018 - 01:04

అక్షరం.. చీకటిని చీల్చే దీపఖడ్గం. వట్టి పాదాలతో నిష్టగా ఆ ఖడ్గం అంచుపై నడిచి ఆ రుధిరధారతో పదునెక్కిన రచయిత్రి చిత్రాముద్గల్‌. దత్తా సామంత్‌ పేరు మీరు వినే ఉంటారు. శంకర్‌ గుహ నియోగి పేరు కూడా. ఇద్దరూ కార్మిక సంఘాల నాయకులు. ముంబై సిటీలోని లక్షల మంది జౌళి మిల్లు కార్మికుల యూనియన్‌ లీడర్‌ దత్తాసామంత్‌. 1997లో అండర్‌వరల్డ్‌ మాఫియా అతడిని చంపేసింది. అంతకుముందే 1991 శంకర్‌ గుహ నియోగి హత్య జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌ గని కార్మికుల ప్రియతమ నాయకుడు నియోగి. అక్కడి ఇండస్ట్రియల్‌ మాఫియా అతడిని చంపేసింది. ఈ రెండు హత్యలు భారతదేశంలోని కార్మిక సంఘాలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అక్షర యోధురాలైన ముద్గల్‌ చేత ‘ఆవాన్‌’ అనే పుస్తకాన్ని రాయించాయి. దత్తా సామంత్‌ ఆమె తాత్విక గురువు కూడా. కార్మిక సంఘాల ఉద్యమాలు బలంగా వేళ్లూనుకుంటున్న సమయంలోని కార్మిక జీవితాలపై, ఆనాటి పరిస్థితులపై ముద్గల్‌ రాసిన ‘ఆవాన్‌’.. హిందీ సాహిత్యంలో ఒక ‘క్లాసిక్‌’గా నిలిచిపోయింది.

కార్మిక సంఘ నాయకత్వ లక్ష్యంలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోడానికి అదొక ప్రామాణిక గ్రంథం అయింది. డెబ్బయ్‌ మూడేళ్ల ఈ వయసులోనూ ముద్గల్‌ ఆధునిక హిందీ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నవారిలో ఒకరిగా నిలబడే ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో మొదలౌతున్న ఆరు రోజుల సాహిత్య అకాడమీ వేడుకల్లో అకాడమీ ఎగ్జిబిషన్‌కు చిత్రా ముద్గలే ప్రారంభోత్సవం చేయబోతున్నారు.

ముద్గల్‌ చెన్నైలో పుట్టారు. ముంబైలో చదువుకున్నారు. హిందీ లిటరేచర్‌లో ఎమ్మే చేశారు. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా అవ«ద్‌ నారాయణ్‌ ముద్గల్‌ అనే జర్నలిస్ట్‌ని వివాహం చేసుకున్నారు. దత్తా సామంత్, శంకర్‌ గుహ నియోగి కార్మిక సంఘాల నాయకులైతే, చిత్రా ముద్గల్‌ అక్షర కార్మికురాలిగా కార్మిక ఉద్యమానికి జెండా పట్టిన యోధురాలు. ఆమె ప్రతి అక్షరం నాయకత్వ లక్షణం.

- రచయిత్రి చిత్రా ముద్గల్‌

#

Tags

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)