amp pages | Sakshi

ఎండకావరం... కన్ను కలవరం!

Published on Wed, 04/19/2017 - 23:52

సమ్మర్‌ కేర్‌ కన్ను

కండకావరం అన్న మాటను కాస్త ఎండకూ వర్తింపజేద్దాం. అప్పుడది ఎండకావరం అవుతుంది. కంటికి వెలుగు కావల్సిందే. చూపు కోసం కాంతి అవసరమే. కానీ వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ కంటికీ కొన్ని సమస్యలు రావచ్చు. రకరకాల రేడియేషన్‌ల ఉగ్రత వల్ల నేత్రాలకు అనర్థాలు కలగవచ్చు. వాటి నుంచి రక్షణ పొందడం ఎలాగో తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక కథనం.

కాంతి అంటే ఏమిటంటే?
మన భూమికి చేరే అనంతమైన రేడియేషన్‌లలో కేవలం మనం చూడగలిగేదీ, మనం గ్రహించగలిగేదీ చాలా పరిమితం. ఈ రేడియేషన్స్‌ అన్నీ... తరంగాల రూపంలో మనకు చేరుతుంటాయి. ఇందులో రేడియో తరంగాలూ, ఎక్స్‌–కిరణాలూ, మైక్రోవేవ్‌ తరంగాలూ ఇలా ఎన్నో ఉంటాయి. దీన్నంతా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌ అంటారు. అయితే ఇందులో వేర్వేరు కిరణాలకు వేర్వేరు వేవ్‌లెంగ్త్‌ ఉంటుంది. కాంతి కిరణంలో పక్కపక్కనే ఉండే అలలోని...  ఒక పీక్‌కూ, మరో పీక్‌కూ మధ్యనున్న దూరాన్ని వేవ్‌లెంగ్త్‌గా చెప్పుకుంటే మన కళ్లకు కనిపించే కాంతి చాలా పరిమితమైన వేవ్‌లెంగ్త్‌తోనే ఉంటుంది. మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే 380 – 780 నానో మీటర్ల రేంజ్‌లో ఉండే దాన్ని మాత్రమే మనం కాంతిగా పేర్కొంటాం. అంతకంటే తక్కువ వేవ్‌లెంగ్త్‌ ఉండే కిరణాలను అల్ట్రా వయొలెట్‌ కిరణాలుగానూ, అంతకంటే ఎక్కువ వేవ్‌లెంగ్త్‌ ఉండేవాటిని ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలుగానూ చెబుతుంటారు.

యూవీ కిరణాల ప్రభావం ఇలా...
సూర్యుడి నుంచి వాతావరణాన్ని చీల్చుకొని మన కంటి వరకు చేరే రేడియేషన్‌లోని చాలా హానికారక కిరణాలను ఓజోన్‌ పొర వడపోస్తుంది. కేవలం 3 శాతం అల్ట్రా వయొలెట్‌ కిరణాలు మాత్రమే భూమి ఉపరితలం వరకు చేరతాయి. అల్ట్రా వయొలెట్‌ కిరణాల వల్ల కంటిపై దుష్ప్రభావాలు రెండు రకాలు. తక్షణం కలిగే అనర్థాలను ‘అక్యూట్‌ అనర్థాలు’గా చెప్పవచ్చు. రేడియేషన్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అవుతున్నప్పుడు వచ్చే సమస్యలు ‘క్రానిక్‌ దుష్ప్రభావాలు’. యూవీ–ఏ దుష్ప్రభావాలు తాత్కాలికమైనవి.

యూవీ–బీ వల్ల కలిగే అనర్థాలను వైద్య చికిత్స ద్వారా చక్కదిద్దవచ్చు. యూవీ–సి అనర్థాలు చాలా తీవ్రమైనవి. కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ. అయితే అదృష్టవశాత్తు యూవీ–సీ రకానికి చెందిన కిరణాలను ఓజోన్‌ పొర నిరోధిస్తుంది. ఈ కాంతి కిరణాలు నేరుగానూ, కొన్ని సందర్భాల్లో కింద నుంచి రిఫ్లక్షన్‌ చెంది కంటిపై పడుతుంటాయి. మంచు, ఇసుక, నేల, రోడ్డు, కంకర వంటి వాటిపై పడి రిఫ్లెక్ట్‌ అయి కంటికి చేరి దుష్ప్రభావం చూపుతుంది. సాధారణంగా కిందివైపుకు ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి రిఫ్లెక్టెడ్‌ కిరణాలతో ఇలా ప్రభావం పడుతుంది. టోపీ, గొడుగు ధరించినా సరే... రిఫ్లెక్టెడ్‌ కిరణాల నుంచి రక్షణ ఉండదు.

యూవీ దుష్ప్రభావాలు...
తక్కువ శక్తిమంతమైన యూవీ కిరణాలు సోకినప్పుడు కంటిపై పడే దుష్ప్రభావాల ఫలితం చాలా సందర్భాల్లో తాత్కాలికంగానే ఉంటుంది. ఉదాహరణకు.. కంటి నుంచి నీళ్లు కారడం, కన్ను పొడిబారడం, కళ్ల వాపు, ఎక్కువ కాంతిని చూడాల్సి వస్తే కంటికి ఇబ్బందిగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఇలా ఎక్కువ కాంతిని చూడలేకపోవడాన్ని ‘ఫొటోఫోబియా’ అంటారు. అయితే చాలా సందర్భాల్లో సుదీర్ఘకాలం పాటు యూవీ కిరణాలకు ఎక్స్‌పోజ్‌ కావడం వల్లనే అనర్థాలు సంభవిస్తాయి.

కంటిపై పడే ఇతర దుష్ప్రభావాలు
కనురెప్ప క్యాన్సర్‌లు: కంటి రెప్పపై యూవీ కిరణాల దుష్ప్రభావాల కారణంగా కొన్ని తీవ్రమైన అనర్థాలు కనిపించే అవకాశాలున్నాయి. అవి... బేసల్‌ సెల్‌ కార్సినోమా క్యాన్సర్, స్క్వామోజ్‌ సెల్‌ కార్సినోమా క్యాన్సర్, మెలనోమా అనే ఇంకోరకం క్యాన్సర్‌. కంటిపై ఉండే పొర (కంజెంక్టివా)కు వచ్చే అనర్థాలు: కంజెంక్టివాకు వచ్చే సమస్యను ‘పింగ్వెక్యులా’ అంటారు. ఈ సమస్య వచ్చిన వారిలో కంటిపై పొర మందంగా, ఒకింత పసుపు రంగు లోకి మారుతుంది. నల్లపొర అంచుల పైకి రెండువైపుల నుంచి ఈ పొర పాకివస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని ‘ఎల్లో బంప్‌ ఇన్‌ ఐ’ అంటారు. ఎప్పుడూ కంటిపై యూవీ కిరణాలు ప్రసరిస్తూ ఉండటం వల్ల కన్ను పొడిబారి ‘పింగ్వెక్యులా’ రావచ్చు. అలాగే కొంతమందిలో కంటిలో గడ్డలు (ట్యూమర్స్‌) కూడా కనిపించవచ్చు.  

కార్నియా పై: కొందరిలో ఫొటోకెరటైటిస్‌ సమస్య రావచ్చు. సాధారణంగా ఎలాంటి రక్షణ లేకుండా వెల్డింగ్‌ వంటివి చేసేవారిలో ఈ ఫొటో కెరటైటిస్‌ సమస్య ఎక్కువగా వస్తుంది. మంచుపై స్కీయింగ్‌ చేసే వారిలో సైతం రిఫ్లెక్షన్‌ వల్ల పడే కాంతి కిరణాలు వల్ల కార్నియాకు దెబ్బతగిలి కంటి చూపు మందగిస్తుంది. దీన్ని ‘స్నో బ్లైండ్‌నెస్‌’ అంటారు.

రెటీనా పై: తీవ్రమైన యూవీ కిరణాలు ప్రసరించడం వల్ల కొందరిలో రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉండవచ్చు. దీన్నే సోలార్‌ బర్న్‌ అని పేర్కొంటారు. దీనివల్ల కొందరిలో హఠాత్తుగా కనుచూపు తగ్గే ప్రమాదం ఉంది. ఇది మనం సాధారణంగా సూర్యగ్రహణం పట్టినప్పుడు, దాన్ని నేరుగా చూస్తే కలిగే ప్రమాదం.

ఎవరెవరిలో...
అత్యంత కాంతిమంతమైన వాతావరణంలో పనిచేయడం... ఉదాహరణకు డ్రైవర్లు అదేపనిగా అత్యంత ఎక్కువ కాంతిని చూస్తూ ఉండాల్సి వస్తుంది. అలాగే పట్టపగలు తీవ్రమైన కాంతిలో తిరిగే సేల్స్‌ రిప్రజెంటేటివ్స్, నిర్మాణరంగంలోని పనివారు, రైతులు, కూలీలు వంటివారు అదేపనిగా ఎక్కువ కాంతికి ఎక్స్‌పోజ్‌ అవుతుంటారు. వీరిలో పైన పేర్కొన్న అనర్థాలు కనిపించే అవకాశం ఎక్కువ. ఇక అత్యంత ఎక్కువ కాంతిని వెలువరిచే నదీప్రాంతాలు, సముద్రజలాలు వంటి చోట్ల సంచరించే వారిలో. కాంతి తీక్షణత ఎక్కువగా ఉండే ప్రాంతాలైన భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల వారిలోనూ.
     
చాలా ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో ఉండేవారిలో. తెల్లని దేహఛాయ (మెలనిన్‌ తక్కువ) ఉండే వారిలో. సాధారణంగా కంటిలోకి కాంతి ప్రవేశించగానే ఐరిస్‌/ప్యూపిల్‌ (కంటిపాప) కాస్తంత ముడుచుకుపోయేలా మన దేహనిర్మాణం ఉంటుంది. అందుకే తీవ్రమైన కాంతిలోకి వచ్చినప్పుడు మన కన్ను దానికి అడ్జెస్ట్‌ అయ్యే వరకు మనం కంటిని చికిలించి చూస్తాం. పిల్లల్లో కంటి పాప పెద్దదిగా ఉంటుంది. దాంతో ట్రాన్స్‌పరెన్సీ ఎక్కువ. పైగా ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. అందుకే కంటిపై పడే దుష్ప్రభావాలు ఎక్కువ. కాటరాక్ట్‌ సర్జరీ చేసుకొని, యూవీ ప్రొటెక్షన్‌ లేని ‘ఇంట్రా ఆక్యులార్‌ లెన్స్‌’ వాడిన వారిలో ఈ యూవీ కిరణాల వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. టెట్రాసైక్లిన్‌ వంటి యాంటీబయాటిక్స్, గర్భనిరోధక మాత్రలు, యాంటీ మలేరియా మందులు వాడే వారితో పాటు, ఇబూప్రొఫేన్‌ వంటి నొప్పి నివారణ మందులు వాడే వారిలో కూడా యూవీ దుష్ప్రభావాలు ఎక్కువ.

మబ్బులు పట్టినా... వరండాల్లో ఉన్నాసురక్షితం కాదు!
మబ్బు పట్టి ఉన్నప్పుడు... అల్ట్రా వయొలెట్‌ కిరణాలు వడపోతకు గురవుతాయనీ, దాంతో వీటి దుష్ప్రభావం మనపై అంతగా ఉండకపోవచ్చని చాలామంది ఊహిస్తారు. కానీ... అది అంత వాస్తవం కాదు. మబ్బులు పట్టి ఉన్నా లేదా వరండా లేక బయటి గదుల్లో (ఎండతగిలే గదులు) ఉన్నా దాదాపు 3 శాతం అల్ట్రా వయొలెట్‌ కిరణాలు కంటికి చేరే అవకాశం ఉంది. అవి కంటికి హాని చేయవచ్చు. అయితే యూవీ–బి తరహా కిరణాలను మన కంటిలోపల ఉండే లెన్స్‌ చాలా వరకు ఫిల్టర్‌ చేస్తుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు యూవీ కిరణాలు రెటీనా వరకు వెళ్లి దాన్ని సోలార్‌ బర్న్‌ రూపంలో దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది.

యూవీ వల్ల కలిగే అనర్థాలివి...
టెరీజియమ్‌: కంటి చివరన ముక్కుకు దగ్గర ఉండే వైపున మనకు కాస్తంత పింక్‌ రంగులో ఉండే కండలాంటి భాగం కనిపిస్తూ ఉంటుంది. ఈ కండ క్రమంగా  నల్లగుడ్డును మూసివేసేలా పెరుగుతుంది. దీనివల్ల కనుచూపు పూర్తిగా తగ్గుతుంది.  ఇది పట్టపగలు ఆరుబయట పనిచేసే వారిలో కనిపించే సమస్య. అలాగే సముద్రం అలలపై సర్ఫింగ్‌ చేసేవారిలోనూ టెరీజియమ్‌ చాలా తరచూగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘సర్ఫర్స్‌ ఐ’ అని కూడా అంటారు. సముద్రప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, కాంతి తీక్షణంగా ఉండటం వల్ల వారిలో టెరీజియమ్‌ ఎక్కువగా వస్తుంది.

క్యాటరాక్ట్‌: కంటిలో వచ్చే తెల్ల ముత్యం లేదా తెల్లపొరను క్యాటరాక్ట్‌గా పేర్కొంటారు. సాధారణంగా వయసు పెరగడం వల్ల వచ్చే క్యాటరాక్ట్‌లు ఎలాగూ వస్తాయి. అయితే వాతావరణంలోని అల్ట్రా వయొలెట్‌ కిరణాలకు అదేపనిగా కన్ను ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల కాటరాక్ట్‌ త్వరగా వస్తుంది. దాదాపు 10 శాతం కాటరాక్ట్‌ కేసులు ఇలా యూవీ కిరణాలకు ఎక్స్‌పోజ్‌ కావడం వల్లనే అని పరిశోధనలు చెబుతున్నాయి.

మాక్యులార్‌ డీజనరేషన్‌: మెలనిన్‌ అనే రంగునిచ్చే పదార్థం ఒంట్లోనూ, కంటిలోనూ ఉంటుంది. ఇది రెటీనల్‌ పిగ్మెంట్‌ ఎపిథీలియంలో ఉండి కాంతి ప్రసరించినప్పుడు అందులోని యూవీ కిరణాలను వడపోస్తుంటుంది. ఈ మెలనిన్‌ అనే రంగునిచ్చే పదార్థం ఒంటి రంగు నల్లగా ఉండేవారిలో ఎక్కువగానూ, తెల్లటి దేహఛాయ ఉండేవారిలో తక్కువగానూ ఉంటుంది. ఇది వాతావరణంలో ఉండే అల్ట్రా వయొలెట్‌ కిరణాలను 90 శాతం వరకు వడపోసి, కంటికి రక్షణ ఇస్తుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మెలనిన్‌ పాళ్లు కంటిలో తగ్గుతుంటాయి. దాంతో కంటిలో ఉండే నల్ల గుడ్డుకు, రెటీనాలో ఉండే ఎపిధీలియానికీ యూవీ కిరణాలను వడపోసే సామర్థం తగ్గిపోతుంది. ఫలితంగా కంటి చూపుపై ప్రభావం పడే అవకాశం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఇలా యూవీ కిరణాలను వడపోసే సామర్థ్యం తగ్గిపోవడం వల్ల కంటి చూపు కూడా క్రమంగా తగ్గవచ్చు. అందుకే దీన్ని ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులార్‌ డీజనరేషన్‌ (ఏఆర్‌ఎమ్‌డీ) అని కూడా అంటారు.

వేసవిలో కంటి రక్షణ ఇలా...
నాణ్యమైన సన్‌ గ్లాసెస్‌ వాడటం ద్వారా తీక్షణ కాంతి దుష్ప్రభావల నుంచి కంటిని కాపాడుకోవచ్చు. అయితే తక్కువ ప్రమాణాలతో తయారు చేసే సన్‌– గ్లాసెస్‌ వల్ల కంటిని మరింతగా తెరచుకుని చూడాల్సి వస్తుంది. దాంతో కంటిలోకి హానికరమైన యూవీ కిరణాలు మరింతగా ప్రవేశించవచ్చు. అందుకే నియమిత ప్రమాణాలతో... అంటే పాలీకార్బనేట్, ట్రైవిక్స్‌ వంటి మెటీరియల్‌తో తయారైన సన్‌గ్లాసెస్‌ వాడాలి.
     
100 శాతం లేదా 400 యూవీ ప్రొటెక్షన్‌ ఇచ్చే లేబుల్డ్‌ గ్లాసెస్‌ కూడా వాడవచ్చు. ఫ్రేమ్‌ అంచులు పెద్దవిగా ఉండే గ్లాసెస్‌ వాడటం వల్ల కంటి మూలల నుంచి కూడా యూవీ కిరణాలు లోపలికి ప్రసరించకుండా ఉంటాయి. అందుకే ఫ్యాషన్‌ పేరిట చిన్నఫ్రేమ్‌ వాటికంటే... ఒకింత పెద్ద ఫ్రేమ్‌ గ్లాసెస్‌ వాడడం మంచిది. కొందరు ఏ రంగు గ్లాసెస్‌ అయితే మేలు... అని ప్రశ్నిస్తుంటారు. ఏ రంగు అన్నదానికి అంతగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే... ఏ రంగు అయినా అది కంటికి పూర్తిగా రక్షణ ఇచ్చేలా ఉండాలి. పోలరైజ్‌డ్‌ సన్‌గ్లాసెస్‌ అంత సురక్షితమైనవి కావని గ్రహించండి. ఎందుకంటే... అవి కేవలం ఒక కోణంలోంచి (భూమికి సమాంతరంగా) వచ్చే కాంతి కిరణాల నుంచి మాత్రమే కంటికి రక్షణనిస్తాయి.
     
ఒకింత తెల్లని దేహ ఛాయ ఉన్నవారు చర్మానికి మంచి సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ను మూడు గంటలకు ఒకసారి రాసుకుంటూ ఉండాలి. అప్పుడే చర్మాన్ని కొన్ని రకాల క్యాన్సర్‌ ప్రమాదాలనుంచి కాపాడుకునే అవకాశం ఉంది. కాటరాక్ట్‌ సర్జరీ చేయించుకున్న వాళ్లు తప్పనిసరిగా యూవీ ప్రొటెక్షన్‌ ఉన్న ఇంట్రా ఆక్యులార్‌ లెన్స్‌ (ఐఓఎల్స్‌)నే ఎంచుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అంచుపెద్దవిగా ఉండే టోపీలు (హ్యాట్‌) ధరించడం మేలు. ఫొటో కెరటైటిస్‌ వంటి కండిషన్‌ ఉన్నవారు కాంటాక్ట్‌ లెన్స్‌లను వాడటం ఎంతమాత్రమూ సరికాదు. ఎందుకంటే అవి వాతావరణంలోని తీక్షణ కాంతితో పాటు యూవీ కిరణాలను 50 శాతం వరకు కంటిలోకి ప్రసరింపజేస్తాయి.
     
యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండే మంచి పోషకాహారం తీసుకోవడం అన్నది అన్ని సీజన్‌లతో పాటు ఈ వేసవిలో మరీ ఎక్కువ అవసరం.  ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఇది వేసవిలోనే కాదు, అన్ని కాలాలకూ వర్తిస్తుందని గుర్తుంచుకోండి. మిట్ట మధ్యాహ్నం వేళల్లో వీలైనంతవరకు బయటకు వెళ్లకపోవడం మంచిది.  వీలైనంత వరకు కంటిని ఎప్పటికప్పుడు చల్లని, శుభ్రమైన నీటితో కడుక్కోవడం మంచిది. అలాగే పుష్కలంగా నీళ్లు తాగుతూ ఉండాలి. సూర్యగ్రహణం చూడాలనుకునేవారు డాక్టర్లు సిఫార్సు చేసిన ఫిల్టర్‌ గ్లాసెస్‌నే వాడాలి.  తరచూ కంటి పరీక్షలు చేయించుకోండి. వేసవిలో ఒకసారి రొటీన్‌ కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

అల్ట్రా వయొలెట్‌... ఇన్‌ఫ్రా రెడ్‌లతో  కంటికి హాని!
మనకు చేరే కాంతితో పాటు మన వాతావరణంలో ప్రసరిస్తూ, ప్రవహిస్తూ ఉండే అల్ట్రా వయొలెట్, ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలతో మన కంటికి హాని చేకూరే ప్రమాదం ఉంది. పైగా వేసవిలో ఈ కిరణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం వల్ల అమితమైన శక్తితో ఉండే ఈ కిరణాలు కంటికి హాని చేసే అవకాశాలు ఎక్కువ.

అల్ట్రా వయొలెట్‌ కిరణాలు
కంటికి హాని చేసే అల్ట్రా వయొలెట్‌ కిరణాల (యూవీ రేస్‌) ను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి...
యూవీ – ఏ...  వేవ్‌లెంగ్త్‌ 315 – 400 న్యానో మీటర్లు  (ఇవి తక్కువ శక్తి కలిగినవి).
యూవీ – బీ...æ వేవ్‌లెంగ్త్‌ 280 – 315 న్యానో మీటర్లు (ఇవి ప్రమాదకరమైనవి).
యూవీ – సీ... వీటి వేవ్‌లెంగ్త్‌ 100 – 280 న్యానో మీటర్లు (ఇవి అత్యంత ప్రమాదకరం).

ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలు
ఇన్‌ఫ్రారెడ్‌ – ఏ వేవ్‌లెంగ్త్‌ 700 – 1400 న్యానో మీటర్లు
ఇన్‌ఫ్రారెడ్‌ – బీ   వేవ్‌లెంగ్త్‌ 1400 – 3000 న్యానో మీటర్లు
ఇన్‌ఫ్రారెడ్‌ – సీ   వేవ్‌లెంగ్త్‌ 3000  న్యానో మీటర్లు నుంచి 1 మిల్లీమీటరు వరకు
ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాల దుష్ప్రభావం ప్రధానంగా కార్నియా మీద ఉంటుంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)