amp pages | Sakshi

ఈ టెర్మినేటర్.. మంచి ఇన్వెస్టర్

Published on Fri, 04/11/2014 - 22:38

ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్.. ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది టెర్మినేటర్ సినిమా.  బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్స్, సినిమాలతో కోట్లు సంపాదించాడు. ఆ వచ్చిన సంపాదనను జల్సాలకంటూ ఖర్చు పెట్టేయకుండా ఇన్వెస్ట్ చేయడంలోనూ తెలివిగానే వ్యవహరించాడు.  400 మిలియన్ డాలర్ల పైగా ఆస్తిని ఆర్జించాడు. బాడీబిల్డర్‌గాను, యాక్టర్‌గాను, గవర్నర్‌గానూ, ఇన్వెస్టర్‌గాను వివిధ పాత్రల్లో రాణించిన ఆర్నాల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ విశేషాలే ఈ వారం సెలబ్రిటీ స్టోరీ..
 
ఆర్నాల్డ్ ప్రపంచవ్యాప్తంగా రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఇన్వెస్ట్ చేశాడు. రెస్టారెంట్లలో, కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. కమర్షియల్ జంబో జెట్లను కొనుక్కుని, లీజుకు ఇచ్చేవాడు. ఇవే కాకుండా షేర్లు, బాండ్లు మొదలైన వాటిల్లో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టాడు.
 
పద్ధతిగా పెట్టుబడి..
 
ఆర్నాల్డ్ 1968లో తోటి బాడీబిల్డర్‌తో కలిసి నిర్మాణ సామగ్రి వ్యాపారాన్ని ప్రారంభించాడు. తమ మార్కెటింగ్ వ్యూహాలను జోడించి వ్యాపారాన్ని సక్సెస్ చేశాడు. అందులో వచ్చిన లాభాలతో కొరియర్ తరహా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. బాడీ బిల్డింగ్, ఫిట్‌నెస్ సంబంధిత ఉత్పత్తులను విక్రయించడం మొదలుపెట్టాడు. ఈ వ్యాపారాలతో వచ్చిన డబ్బును రియల్టీలోకి మళ్లించాడు.

10,000 డాలర్లు పెట్టి అపార్ట్‌మెంట్ బిల్డింగ్ కొన్నాడు. ఆ తర్వాత అనేక రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాడు. తోటి నటులు బ్రూస్ విల్లీస్, సిల్వెస్టర్ స్టాలోన్ తదితరులతో కలిసి ప్లానెట్ హాలీవుడ్ పేరిట రెస్టారెంట్ చెయిన్‌ని కూడా ప్రారంభించాడు. కానీ దాన్నుంచి తర్వాత వైదొలిగాడు. ఇవే కాకుండా, ఓక్ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థ, ఫిట్‌నెస్ పబ్లికేషన్స్ పేరిట ప్రచురణ సంస్థ కూడా ఏర్పాటు చేశాడు.
 
పాఠాలు
పెట్టుబడులు, లక్ష్యసాధనకు సంబంధించి ఆర్నాల్డ్ నుంచి చాలానే నేర్చుకోవచ్చు. ప్రతి సంవత్సరం ప్రారంభంలో ఆ ఏడాది సాధించాల్సిన లక్ష్యాలను రాసి పెట్టుకునేవాడు. ఇలాంటి అంశాలన్నీ కూడా టోటల్ రికాల్ పేరుతో రాసిన తన బయోగ్రఫీలో పొందుపర్చాడు. లక్ష్యాలపై స్పష్టత, ఇన్వెస్ట్ చేసే ముందు అధ్యయనం, ఎప్పుడూ నెగటివ్‌గా ఉండే వ్యక్తులు.. పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం తదితర విషయాలు ఆయన పుస్తకం నుంచి నేర్చుకోవచ్చు.     ఎప్పుడు, ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది తెలియడంతో పాటు ఎప్పుడు వైదొలగాలన్నది కూడా తెలిసి ఉండటం కీలకం అంటాడు ఆర్నాల్డ్. డబ్బు ఎంత సంపాదించామన్నది కాదు.. మన ం ఎంత దాచుకోగలిగామన్నదే  ముఖ్యమని చెబుతాడు.
 
తాను స్టార్‌గా కంటే బిజినెస్ మ్యాన్‌గా అనేక రెట్లు ఎక్కువగా సంపాదించాననే ఆర్నాల్డ్.. డబ్బు అనేది గొప్ప సంతోషాన్నివ్వదంటాడు. ఒకానొక సందర్భంలో..‘నా దగ్గర ఇప్పుడు 50 మిలియన్ డాలర్లు ఉన్నాయి. కానీ ఇంతకంటే చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉన్నానో ఇప్పుడూ అంతే సంతోషంగా ఉన్నాను. పెద్దగా తేడా ఏమీ లేదు.’ అని చెప్పుకొచ్చాడు.
 

Videos

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?