amp pages | Sakshi

నేలతల్లికి ఎంత కష్టం.. ఎంత కష్టం..

Published on Tue, 01/01/2019 - 09:40

విత్తనం మొలకెత్తి ధాన్యరాశులైతేనే మన కడుపు నిండేది. మనం తింటున్న ఆహారం 95% మేరకు నేలతల్లే మనకు అందిస్తున్నది. అయితే, ఈ క్రమంలో మనం అనుసరిస్తున్న విధ్వంసకర పద్ధతుల వల్ల భూమి నిస్సారమైపోతోంది. భూమి నాశనమైపోతోందని అందరికీ తెలిసిందే. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఎంత భూమి పాడై ఉంటుంది? ఈ విషయం తెలుసుకునేందుకు 2018లో ఐక్యరాజ్య సమితి ఒక సర్వే జరిపింది. భూముల విస్తీర్ణంలో 75% ఇప్పటికే తీవ్రస్థాయిలో నిస్సారమై పోయిందని దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని వెల్లడించింది. రైతులే కాదు మానవాళి యావత్తూ మేలుకొని జాగ్రత్తపడకపోతే 2050 నాటికి 90% భూమి నాశనమైపోవచ్చని కూడా ఐరాస హెచ్చరించింది. భూమికి జరిగే ఈ నష్టం విలువ ఎంత ఉండొచ్చు? ఎడారీకరణపై ఐక్యరాజ్యసమితి ఒడంబడిక నివేదిక ప్రకారం ఈ నష్టం 23 ట్రిలియన్‌ డాలర్ల మేరకు ఉండొచ్చని అంచనా. 

భూతాపం పెరిగి సాగు యోగ్యం కాకుండా ఎడారిగా మారిపోవడానికి మూడింట ఒక వంతు కారణం.. అడవిని నరికేయడం, ప్రకృతికి నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల భూమిలో కర్బనం తగ్గిపోవడం, నీటి లభ్యత తగ్గిపోవడం. భూమిలో జీవం తగ్గిపోవడం వల్ల జీవవైవిధ్యం అంటే.. భిన్న జాతుల చెట్టు చేమ, జీవరాశి అంతరించిపోతోంది.  

వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ సంస్థ తొలిసారి 2018లోనే ‘గ్లోబల్‌ సాయిల్‌ బయోడైవర్సిటీ అట్లాస్‌’ను రూపొందించింది. చాలా దేశాల్లోని భూముల్లోని సూక్ష్మజీవరాశి, వానపాములు వంటి జీవులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. నిజానికి ఈ ముప్పు మానవాళికి ఎదురవుతున్న ముప్పే. జాగ్రత్తపడకపోతే 2050 నాటికి 500 కోట్ల మంది మనుగడకే ముప్పు పొంచి ఉంటుంది. 

అటువంటి దేశాల జాబితాలో మన దేశంతోపాటు పాకిస్తాన్, చైనా కూడా ఉన్నాయి. ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో నేలల్లో సూక్ష్మజీవరాశి ఘోరంగా దెబ్బతిన్నది. భూమి లోపల జీవైవిధ్యం దెబ్బతినటంతోపాటు పరపరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు, సీతాకోకచిలుకలు అంతరించిపోతున్నాయి. వ్యక్తులు, సంస్థలు, అన్ని దేశాలూ కలసికట్టుగా కదలాలి. నిర్ణీత కాలంలో జీవవైవిధ్యాన్ని పెపొందించుకునేలా చర్యలు తీసుకొని అమలు చేయడం మేలని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏటేటా ముప్పు పెరుగుతోంది. 

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)