amp pages | Sakshi

శాకంభరిపాకం

Published on Mon, 07/27/2015 - 22:49

శాకంభరీదేవి... కూరగాయలకు రాణి!
 ఆమె కూరగాయల దండలను అలంకరించుకుంటుంది...
కూరగాయల కిరీటం పెట్టుకుంటుంది...
కూరగాయలే ఆ దేవికి అందం, ఆభరణం.
మరి మనకో...
మన క్షుద్బాధను తీర్చేవి ఆ కూరలే కదా...
ఎప్పుడూ ఒకే రకం కూరలు వండుకుని భుజిస్తాం.
ఈసారి విలక్షణంగా... రకరకాల కూరలను కలిపి
ఒకే వంటకం తయారుచేద్దాం.
మన ఉదర పూజ చేద్దాం...

ఆత్మమాతకు సంతృప్తి కలిగిద్దాం.
 
కావలసినవి: కందిపప్పు - పావు కప్పు; చింతపండు - పెద్ద నిమ్మకాయంత; బెల్లం పొడి - 2 టేబుల్ స్పూన్లు; సాంబారు పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కారం - అర టీ స్పూను; కరివేపాకు - రెండు రెమ్మలు; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; మునగకాడ - 1 (ముక్కలు చేయాలి); తీపి గుమ్మడికాయ ముక్కలు - 8 (కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేయాలి); సొరకాయ ముక్కలు - 8; క్యారట్ ముక్కలు - పావు కప్పు; చిలగడ దుంప ముక్కలు - కప్పు; బీన్స్ ముక్కలు - పావు కప్పు; ఉల్లిపాయలు - 10 (సాంబారు ఉల్లిపాయలు రుచిగా ఉంటాయి); టొమాటో ముక్కలు - అర కప్పు; పచ్చి మిర్చి - 4 (నిలువుగా మధ్యకు కట్ చేయాలి) (ఇష్టపడే వారు ఇంకా వేరువేరు కూరలు ఉపయోగించవచ్చు); నూనె - టేబుల్ స్పూను; ఆవాలు - టీ స్పూను; ఎండు మిర్చి - 2; కరివేపాకు - 2 రెమ్మలు; ఇంగువ - చిటికెడు

తయారీ:  ముందుగా కందిపప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించి పక్కన ఉంచాలి  చింతపండును తగినన్ని నీళ్లలో నానబెట్టి, బాగా నానిన తర్వాత గుజ్జు తీసి కప్పుడు నీళ్లు జత చేసి పక్కన ఉంచాలి  ఒక పాత్రలో చింతపండు రసం, తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కుక్కర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దించేయాలి ఉడికించుకున్న పప్పు, ఉడికించుకున్న ముక్కలను ఒక పాత్రలో వేసి, బెల్లం తురుము జత చేసి స్టౌ మీద ఉంచాలి  బాగా మరుగుతుండగా సాంబారు పొడి వేసి బాగా కలిపి దించేయాలి  చిన్న పాత్రలో నూనె వేసి కాగాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేయించి, పులుసులో వేసి కలపాలి.
 
మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్
కావలసినవి: క్యారట్ ముక్కలు - అర కప్పు; బంగాళదుంప ముక్కలు - అర కప్పు; సొరకాయ ముక్కలు - కప్పు; టొమాటో ముక్కలు - కప్పు; నూనె - టేబుల్ స్పూను; జీలకర్ర - అర టీ స్పూను; నల్ల మిరియాలు - 8; ఉల్లి తరుగు - పావు కప్పు; ఉప్పు - రుచికి తగినంత; పంచదార - అర టీ స్పూను

తయారీ:  ముందుగా బాణలిలో టేబుల్ స్పూను నూనె వేసి వేడి చేయాలి జీలకర్ర, మిరియాలు వేసి వేయించాలి  బాగా వేగిన తర్వాత ఉల్లి తరుగు వేసి వేయించాలి  క్యారట్ ముక్కలు, బంగాళ దుంప ముక్కలు, సొరకాయ ముక్కలు వేసి బాగా కలపాలి  ఉప్పు జత చేసి మరోమారు కలపాలి రెండు కప్పుల నీళ్లు పోసి మూత ఉంచి ముక్కలన్నీ ఉడికేవరకు ఉంచాలి టొమాటో ముక్కలు జత చేసి మూత పెట్టి మరికొద్ది సేపు ఉడికించి దించేయాలి  నీటిని వేరే పాత్రలోకి వడకట్టి పక్కన ఉంచాలి ముక్కలన్నీ బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక పాత్రలోకి తీసుకుని, పక్కన ఉంచిన నీటిని జత చేయాలి ఈ మిశ్రమాన్ని స్టౌ మీద ఉంచి బాగా మరిగించాలి  పంచదార జత చేసి మరోమారు కలిపి వేడివేడిగా అందించాలి.
 
మిక్స్‌డ్ వెజిటబుల్ పికిల్
కావలసినవి: కలోంజీ (తోక మిరియాలు) - 2 టేబుల్ స్పూన్లు; వెనిగర్ - 3 టేబుల్ స్పూన్లు; ఆవ నూనె - అర లీటరు; క్యారట్ ముక్కలు - కప్పు; క్యాలీఫ్లవర్ తరుగు - కప్పు; ముల్లంగి ముక్కలు - కప్పు; పచ్చిమామిడికాయ ముక్కలు - కప్పు; బీన్స్ ముక్కలు - కప్పు; నిమ్మకాయ ముక్కలు - అర కప్పు; ఉసిరికాయ ముక్కలు - అర కప్పు; పచ్చి మిర్చి - 100 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి); అల్లం లేదా మామిడి అల్లం ముక్కలు - 100 గ్రా.; కారం - 2 కప్పులు; ఆవపొడి - 2 కప్పులు; ఉప్పు - ఒకటిన్నర కప్పులు; పసుపు - టీ స్పూను; మెంతి పొడి - టేబుల్ స్పూను; ఆమ్‌చూర్ పొడి - 50 గ్రా.; సోంపు పొడి - 50 గ్రా.; పసుపు - 2 టేబుల్ స్పూన్లు

తయారీ: కూరగాయలను అన్నిటినీ శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి, ముక్కలు చేసుకోవాలి. (అన్ని ముక్కలూ ఒకే పరిమాణంలో ఉంటే మంచిది)  తడి పోయేవరకు ఎక్కువ ఎండలేని ప్రదేశంలో కొద్దిసేపు ఆరబెట్టాలి  ఒక పెద్ద పాత్రలో సోంపు పొడి, మెంతి పొడి, ఆవ పొడి, కారం, ఉప్పు, కలోంజీ, పసుపు వేసి బాగా కలపాలి  మరొక పాత్ర తీసుకుని అందులో పొడుల మిశ్రమం ఒక కప్పుడు, ఆవ నూనె ఒక కప్పుడు వేసి బాగా కలిపి, రెండు కప్పుల ముక్కలు జత చేయాలి  ఇదేవిధంగా ముక్కలన్నీ కలపాలి  చివరగా వెనిగర్, ఇతర మసాలా దినుసులు జత చేయాలి  చివరగా నూనె వేసి బాగా కలిపి, తడిలేని గాలిచొరని పాత్రలో భద్రపరచాలి  మూడురోజుల తరవాత ఉపయోగించుకోవాలి ఈ లోగా మధ్యమధ్యలో ఊరగాయ ఎలా ఉందో గమనించుకోవాలి  అవసరమనుకుంటే కొద్డిగా ఉప్పు, ఆవనూనె జత చేయాలి  ఊరగాయలో నూనె తేలుతూ ఉంటే, ఊరగాయ చెడిపోకుండా ఉంటుంది.
 
 
మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్
కావలసినవి: బాస్మతి బియ్యం - కేజీ; క్యారట్ ముక్కలు - కప్పు; క్యాబేజీ తరుగు - కప్పు; బీన్స్ ముక్కలు - కప్పు; పచ్చి బఠాణీ - కప్పు; బంగాళదుంప ముక్కలు - కప్పు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు; ఉల్లి కాడల తరుగు - కప్పు; క్యాప్సికమ్ తరుగు - అర కప్పు; ఉప్పు - తగినంత; నూనె - 2 టేబుల్ స్పూన్లు; లవంగాలు - 4; దాల్చిన చెక్క - చిన్న ముక్క; నెయ్యి - టేబుల్ స్పూను; ఏలకులు - 2

 తయారీ: ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు చేర్చి సుమారు గంటసేపు నానబెట్టాలి  మిక్సీలో లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు వేసి మెత్తగా పొడి చేయాలి బాణలిలో నూనె వేసి కాగాక ఈ మిశ్రమం వేసి దోరగా వేయించాలి ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాలి  కూర ముక్కలు జత చేసి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి బాస్మతి బియ్యాన్ని ఉడికించాలి  ఒక పళ్లెంలో అన్నం వేసి, ఫోర్క్ సహాయంతో సమానంగా పర వాలి  టేబుల్ స్పూను నెయ్యి వేసి కలపాలి  ఉడికించిన కూర ముక్కల మిశ్రమం వేసి బాగా కలిపి, ఉల్లిపాయ పెరుగు చట్నీతో అందించాలి.
 
 
 సేకరణ: డా. వైజయంతి సాక్షి, చెన్నై

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)