amp pages | Sakshi

కొంగలు నీటిలో ఎందుకు నిలబడతాయంటే...

Published on Sat, 12/20/2014 - 23:19

జంతు ప్రపంచం
 
 ఒకప్పుడు కొన్ని వందల రకాల జాతుల కొంగలు ఉండేవి. కానీ క్రమంగా అంతరించిపోయి ఇప్పుడు పదిహేను జాతులు మాత్రమే మిగిలాయి!వీటికి ఇవే తినాలన్న నియమం ఏమీ ఉండదు. ఎప్పుడేది దొరికితే అది తినేసి కడుపు నింపుకుంటాయి. చేపలు, పురుగులు, పండ్లు, గింజలు, మొక్కలు... ఏవైనా సరే! ఇవి మూడు నుంచి ఐదేళ్ల వయసు వచ్చేవరకూ జతకట్టవు. ఒక్కసారి జతకట్టాక జీవితాంతం దానితోనే ఉంటాయి. అది చనిపోయినా సరే... మరోదానికి దగ్గర కావు!

కొంగలలో ఐకమత్యం చాలా ఎక్కువ. ఒక  కొంగకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే... అది ఒక రకమైన శబ్దం చేస్తుంది. ఈ శబ్దం దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ వినిపిస్తుంది. దాన్ని గుర్తుపట్టిన ఇతర కొంగలన్నీ వచ్చేస్తాయి. కలసికట్టుగా శత్రువుతో పోరాటం జరుపుతాయి! కొంగలు గంటలపాటు చల్లటి నీటిలో నిలబడి ఎందుకు ఉంటాయో తెలుసా? శరీర ఉష్ణోగ్రతను సమన్వయం చేసుకోవడానికి ఇవి రక్తప్రసరణ వేగాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అందుకోసం కాళ్లలో ఉండే రక్తనాళాలను బిగబడతాయి. దానికోసమే గడ్డకట్టించేంత చల్లటి నీటిలో గంటలసేపు నిలబడిపోతాయి!

వీటి కాళ్లు చాలా బలంగా ఉంటాయి. శత్రువులు దాడి చేసినప్పుడు తమ కాళ్లతోనే ప్రతిఘటిస్తాయి! కొంగలు ప్రపంచమంతా ఉన్నాయి. కానీ అంటార్కిటికా, దక్షిణ అమెరికాల్లో మాత్రం ఎక్కడా ఒక్క కొంగ కూడా కనిపించదు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌