amp pages | Sakshi

మాటిమాటికీ మూత్రం... ఎందుకిలా?

Published on Tue, 09/13/2016 - 23:47

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 52 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం మాటిమాటికీ లేచేవాణ్ణి. ఈమధ్య మూత్రం బొట్లు బొట్లుగా వస్తోంది. కంట్రోల్ తప్పింది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- రమేశ్, కందుకూరు
 
పురుషుల్లో అత్యంత ప్రధానమైన గ్రంథి ప్రోస్టేట్ (పౌరుషగ్రంథి). ఇది వీర్యం ఉత్పత్తిలో కీలకమైన భూమిక పోషిస్తుంది. సంతానం కలగజేయడానికి కారణమయ్యే శుక్రకణాలు ఈ ప్రోస్టేట్ గ్రంథి తయారు చేసే స్రావాలలో కలిసి వీర్యం రూపంలో బయటకు వస్తుంటాయి. ఇలా సంతాన సాఫల్యంలో ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ గ్రంథి కొద్దికొద్దిగా ఉబ్బుతుంటుంది. ఫలితంగా మూత్రవిసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తడం సహజంగా జరిగే పరిణామమే. దీన్ని బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు.

ప్రోస్టేట్ గ్రంథి సమస్య సాధారణంగా 40 సంవత్సరాలు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశవాసుల్లో ఈ సమస్య ఒకింత తక్కువేగానీ... పట్టణ ప్రాంతాల్లో, మాంసాహారం తినేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపించినా, మూత్ర సమస్యలు వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
 
కారణాలు :  ప్రోస్టేట్ పెరగడానికి హార్మోన్ల స్థాయి తగ్గుదల ముఖ్యకారణం.  కాస్త అరుదే అయినా గాయాలు కావడం  గౌట్ సమస్య

లక్షణాలు :  మాటిమాటికీ మూత్రం రావడం  పదే పదే మూత్ర విసర్జన చేయాలనిపించడం  మూత్రం ఆపుకోలేకపోవడం  మూత్రం ఆగి ఆగి రావడం  మూత్ర విసర్జనలో రక్తం పడటం
 
వ్యాధి నిర్ధారణ :  అల్ట్రా సౌండ్ సోనోగ్రఫీ  బయాప్సీ  స్కానింగ్
 
చికిత్స :
హోమియోపతి వైద్య విధానంలో ప్రోస్టేట్ గ్రంథి వాపు నుంచి పూర్తి ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో కేవలం లక్షణాలను తగ్గించడమే కాకుండా సమస్యను పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. రోగి శారీరక తత్వాన్ని బట్టి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఆర్నికా, బెల్లడోనా, కోనియం, తూజా, మెర్క్‌సాల్ వంటి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో తగిన మోతాదులో వీటిని వాడాల్సి ఉంటుంది.
- డాక్టర్ మురళి
కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి
 హైదరాబాద్

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌