amp pages | Sakshi

సినిమా చూస్తూ... ఎందుకు ఏడుస్తారు?

Published on Mon, 06/30/2014 - 23:05

పరిశోధన
 
‘‘ఇక నేను ఎలా బతికేది తల్లీ’’ అంటూ అత్తగారింటికి వెళుతున్న చెల్లి తల మీద చేయి వేసి హీరో ఏడుస్తుంటాడు.
 ప్రేక్షకుల్లో కొందరు...ఇది చూసి కన్నీరు పెట్టుకుంటారు. కర్చీఫ్ వెదుక్కుంటారు. తమ చెల్లిని గుర్తు తెచ్చుకుంటారు. మరోసారి, చిన్నగా తమలో తాము ఏడుస్తుంటారు. సినిమా దాటి ఎక్కడికో వెళ్లిపోతుంటారు. ఇది కొందరి సంగతి!
 
మరి కొందరు... ‘‘మీ పక్కింటి మీద పది బాంబులు పడ్డాయి’’ అని ఆందోళనగా చెప్పినా - ‘అలాగా’ అని నింపాదిగా తమ పనిలో తాము నిమగ్నమవుతారు. ‘రేసుగుర్రం’ సినిమాలో హీరోయిన్ మాదిరిగా స్పందనరహితంగా ఉంటారు. సినిమా అని తెలిసినా...అతిగా స్పందించడానికి, వాస్తవం అని తెలిసినా...ఏ స్పందన లేకపోవడానికి ‘ప్రత్యేక కారణం’ అంటూ ఏదైనా ఉందా?

 ఉందనే అంటున్నారు శాస్త్రవేత్తలు.
 సినిమాల్లో విషాద సన్నివేశాలు చూసినా, విషాద వార్తలు చదివినా... కొందరు అతిగా స్పందించి దుఃఖితులు కావడానికి వారిలోని ‘యస్‌పియస్’ (సెన్సరి ప్రాసెసింగ్ సెన్సిటివిటీ) కారణం అంటున్నారు శాస్త్రవేత్తలు. వందలో ఇరవై మందిపై దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. బ్రెయిన్ హైలీ సెన్సిటివ్‌గా మారడమే యస్‌పియస్. ‘యస్‌పియస్’ ప్రభావం ఉండడానికి జీన్స్ కారణం అనేది శాస్త్రవేత్తల అంచనా. ‘‘యస్‌పియస్ ప్రభావాన్ని ప్రతికూల దృష్టితో చూడాల్సిన పని లేదు.

ఒకవిధంగా చెప్పాలంటే మనసు తేలిక అవుతుంది’’ అంటున్నాడు అమెరికాలోని స్టానీ బ్రూక్ యూనివర్శిటీ సైకాలజిస్ట్ అర్ధర్. యస్‌పియస్ ప్రభావం ఉన్నవాళ్లు అతి సున్నిత మనస్కులుగా ప్రవర్తించినా, రకరకాల సమస్యలను ఎదుర్కోవడంలో  మాత్రం గట్టిగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఆల్బర్ట్ ఐన్‌స్టిన్ కాలేజీ ఆఫ్ మెడిసిన్, మన్‌మౌత్ యూనివర్శిటీలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నాయి. దీని తాలూకు వివరాలను ‘బ్రెయిన్ అండ్ బిహేవియర్’ పుస్తకంలో ప్రచురించాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)