amp pages | Sakshi

స్త్రీలోక సంచారం

Published on Sat, 07/14/2018 - 00:44

 68 ఏళ్ల తర్వాత క్రొయేషియా తొలిసారి వరల్డ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ పోటీలలో ఫైనల్స్‌కు చేరిన ఆనందోత్సాహంలో క్రోయేషియా అధ్యక్షురాలు కొలిందా గ్రేబర్‌–కితారోబిక్‌.. డ్రెస్సింగ్‌రూమ్‌కి వెళ్లి మరీ తన దేశ క్రీడాకారుల జట్టును ఆలింగనం చేసుకున్నారు. అలా ఆమె ఆలింగనం చేసుకున్న క్రీడాకారులలో ఛాతీపై ఏ అచ్ఛాదనా లేని వారు కూడా ఉండడం మీడియాకు ఒక విశేషం అవగా, అచ్చు కొలిందా గ్రేబర్‌లా ఉండే యు.ఎస్‌. మోడల్‌ కోకో ఆస్టి  బికినీలో ఉన్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయి, అందులో ఉన్నది కొలిందానే అనుకునేంతగా నెటిజన్‌లను తప్పదారి పట్టించింది ::: మహిళల భద్రత కోసం భిన్నమైన ఆలోచనలను ఆవిష్కరించేందుకు ఐఐటి–హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ఆగస్టు 12 వరకు జరుగుతున్న ‘మెగాథాన్‌ 2018’ లో దేశవ్యాప్తంగా విద్యార్థులు పాల్గొంటున్నారు. మహిళల భద్రతకు అవసరమైన మెరుగైన పరిష్కారాలను కనుగొనడం కోసం రెండేళ్ల క్రితం తొలిసారి ‘హ్యాకథాన్‌’ పేరుతో 450 మంది విద్యార్థులతో మొదలైన ఈ విద్యార్థి ఉద్యమం 2017 నాటికి వెయ్యిమందికి చేరుకుని ఈ ఏడాది.. ఈవెంట్‌లో ప్రత్యక్షం పాల్గొనలేని విద్యార్థులను సైతం కలుపుకునేందుకు ‘ఆన్‌లైన్‌ రౌండ్‌’ను కూడా ప్రారంభించింది.

చేతిలో బిస్కెట్‌ పాకెట్లు ఉన్న ఒక మహిళను.. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా సభ్యురాలిగా అనుమానించి గ్రామస్తులు ఒక స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన దేశంలోని మహిళల భద్రతపై సందేహాలను రేకెత్తిస్తోంది. తమిళనాడు మదురైలోని మేలూరు సమీపంలో ఉన్న పత్తినెట్టంకుడిలో గురువారం జరిగిన ఈ ఘటనలో గ్రామస్తులలోనే కొందరు ఆమె ప్రాణ రక్షణ కోసం పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఆమెను విడిపించి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు ::: రాంచీలోని ‘నిర్మల్‌ హృదయ్‌’లో అవివాహిత తల్లులకు పుట్టిన బిడ్డల్ని అందులో పనిచేసే ఒక ఉద్యోగి, నన్‌ కలిసి విక్రయించారనే ఆరోపణలు వచ్చి, వారిని అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో మొత్తం ‘మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ’ పైనే దర్యాప్తు చేయించాలన్న బి.జె.పి. ఆలోచన వెనుక మిషనరీస్‌ను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశం ఉందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విమర్శించారు. ‘‘స్వయంగా మదర్‌ థెరిస్సానే స్థాపించిన మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీని కూడా వీళ్లు వదిలిపెట్టడం లేదు. చారిటీస్‌ పేరును చెడగొట్టడానికి ప్రయత్నించడం, సిస్టర్స్‌ని టార్గెట్‌ చెయ్యడం వంటివి తీవ్రంగా ఖండించవలసిన విషయాలు’’ అని మమత ట్విట్టర్‌లో కామెంట్‌ పోస్ట్‌ చేశారు ::: అత్యాచారం, లైంగిక వేధింపులలో దోషులైన వారికి డ్రైవింగ్‌ లైసెన్సు, ఆయుధాలు కలిగివుండే ౖలñ సెన్సులను రద్దు చేయడంతో పాటు, వారిని వృద్యాప్య పింఛన్లకు అనర్హులను చేయడం కూడా జరుగుతుందని హరియాణ ప్రభుత్వం ప్రకటించింది. 12 ఏళ్ల లోపు  బాలికలపై అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్షను విధించే ఆలోచన ప్రభుత్వ పరిగణనలో ఉందని పంచకులలో జరిగిన ఒక కార్యక్రమంలో వెల్లడిస్తూ..  లైసెన్సులను, పింఛన్లను రద్దు చేసే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసిందని హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్పష్టం చేశారు..

హాలీవుడ్‌ నటి డెమీ మూర్‌ క్రెడిట్‌ కార్డును దొంగిలించి, ఆ విషయాన్ని ఆమె కనిపెట్టే లోపే లక్షా 60 వేల డాలర్ల (సుమారు కోటీ పదిహేను లక్షల యాభై వేల రూపాయలు) కొనుగోళ్లు జరిపిన డేవిడ్‌ మేథ్యూ రీడ్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి, జైలుకు పంపారు. కార్డు పోయిన వెంటనే ఆ విషయాన్ని డెమీ మూర్‌ సహాయకురాలు క్రిడెట్‌ కార్డ్‌ కంపెనీకి తెలియజేసేటప్పటికీ ఖరీదైన కోనుగోళ్లు అనేకం జరిగిపోయాయి ::: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని గతంలో బహిర్గతం చేసిన పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ను గురువారం నాడు ఒక నైట్‌ క్లబ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. మారువేషంలో క్లబ్బుకు వచ్చిన ముగ్గురు ‘నైతిక విలువల పరిరక్షణ’ డిటెక్టివ్‌లను తాకినందుకే ఆమెను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు చెబుతుండగా, రాజకీయ కక్షల కారణంగానే తన క్లయింట్‌ను ఇలా సాధిస్తున్నారని స్టార్మీ తరఫు న్యాయవాది ఆరోపిస్తున్నారు ::: యు.ఎస్‌. నేవీలో మహిళా ఉద్యోగుల హెయిర్‌ స్టెయిల్‌పై ఏళ్లనాటి నిషేధాన్ని తొలగిస్తూ, ఇక మీదట మహిళలు యూనిఫామ్‌లో ఉన్నప్పటికీ తమకు ఇష్టమైనట్లు పోనీ టైల్స్, వదులు జడలు, వైడర్‌ బన్స్, లాక్స్‌ వంటి వాటితో స్వేచ్ఛగా విధులకు హాజరు కావచ్చని నేవల్‌ ఆపరేషన్స్‌ చీఫ్‌ ఆడమ్‌ జాన్‌ రిచర్డ్‌సన్‌ ప్రకటించారు. ఇందువల్ల నేవీ మరింత సంఘటితం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)