amp pages | Sakshi

స్వచ్ఛమేస్త్రీలు

Published on Thu, 06/28/2018 - 00:25

అవసరం నడిపించినంత అభ్యుదయ పథంలో మనిషిని మరే ఇజమూ నడిపించలేదు. అందుకే బతికి బట్టకట్టి తీరాలనే పట్టుదల వారి చేత తాపీ పట్టించింది. స్వచ్ఛభారత్‌ వారికి తోడయ్యింది. సాధారణంగా నిర్మాణ రంగంలో మగవాళ్లు తాపీ పట్టుకుని ఇటుక పేర్చి, సిమెంట్‌ రాస్తుంటే... ఆడవాళ్లు తాపీ మేస్త్రీలకు సిమెంట్, ఇటుక అందించే పనిలో ఉంటారు.

అయితే అస్సాంలోని బార్‌పేట జిల్లాలో ఏకంగా మూడువందలకు పైగా మహిళలు తాపీ పని చేస్తున్నారు. వీళ్లలో బెంగాల్‌నుంచి అస్సాంకు వలస వచ్చిన ముస్లిం మహిళలున్నారు. ఇంకా.. స్థానిక బోడో మహిళలు, బెంగాలీ హిందువులు... ఇలా రకరకాల సాంస్కృతిక నేపథ్యాల మహిళలున్నారు. తాపీ పని నేర్చుకున్న తర్వాత వాళ్ల జీవితాలు ఎంత మెరుగయ్యాయో చెప్పడానికి  బార్‌పేట జిల్లాలోని భులుకాబారీ పత్తర్‌ గ్రామంలో నూర్‌ నెహర్‌ బేగం జీవితమే ఉదాహరణ.

భార్యపై భర్తకు ఫిర్యాదు చేశారు!
‘‘ఊళ్లో పనుల్లేవు, మగవాళ్లు పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. వాళ్లు వచ్చే వరకు ఇంటిని నెట్టుకొచ్చేదెలాగ? పొట్ట నింపడానికి ఎలాగో తిప్పలు పడతాం. కానీ పిల్లల ట్యూషన్‌కి ఫీజు కట్టాలంటే డబ్బెలా? అందుకే ఈ పని నేర్చుకున్నాను. ఇప్పుడు ఇల్లు గడిచేదెలాగ అనే బెంగ లేదు.

నేను తాపీ పని నేర్చుకున్నానని ఊళ్లో మగవాళ్లు నా భర్త వచ్చినప్పుడు ‘మగవాళ్లు చేయాల్సిన పనులు చేస్తోంది నీ భార్య ’ ఆయన్ను నిలదీశారు. ‘అలా నిలదీసిన వాళ్లలో ఎవరైనా నా బిడ్డల కోసం ఒక్క రూపాయి ఇచ్చారా’ అని నేను నా భర్తను అడిగాను. పోయినేడాది నేను తాపీ పని నేర్చుకున్నప్పుడు నేనొక్కర్తినే, ఇప్పుడు మా ఊరు, ఆ చుట్టు పక్కల 11 గ్రామాలకు కలిసి మూడు వందల ఇరవై రెండు మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదు’’ అంటోంది నూర్‌ నెహర్‌ బేగం.

పని ఇచ్చింది స్వచ్ఛ భారత్‌
మగవాళ్లే పనుల్లేక పరాయి రాష్ట్రాలకు వలస పోతున్న ఆ చిన్న గ్రామాల్లో అంతమంది మహిళలు తాపీ పని నేర్చుకున్నారు సరే, వాళ్లకు పని ఎలా? స్వచ్ఛభారత్‌ ఉద్యమం వీళ్లకు పని కల్పిస్తోంది. స్వచ్ఛభారత్‌లో టాయిలెట్‌లు కట్టడం ఒక ఉద్యమంలా సాగుతోంది. నిర్ణీత సమయంలో టార్గెట్‌ను చేరుకోవడానికి అధికారులకు చేతినిండా పని వాళ్లు కావాలి.

మగవాళ్లు వలస పోయిన కారణంగా అందుబాటులో ఉన్న మహిళా తాపీ మేస్త్రీలను ప్రోత్సహించారు అధికారులు. డిస్ట్రిక్ట్‌ వాటర్, శానిటేషన్‌ అధికారి అపర్ణా అధికారి ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. మగవాళ్లు కట్టిన టాయిలెట్‌ల కంటే ఆడవాళ్లు కట్టినవే బాగున్నాయనే ప్రశంసలు కూడా వస్తున్నాయి స్థానికుల నుంచి.

ఎక్కడా మొక్కబడిగా చేయలేదు
నేర్చుకునే దశలో ఉండడంతోనో లేక మహిళల్లో స్వతహాగా ఉండే సమగ్రత వల్లనో కానీ నిర్మాణం రూపం వచ్చిన తరవాత మా పని అయిపోయిందన్నట్లు చేతులు దులుపుకోవడం లేదు బార్‌పేట జిల్లా మహిళలు. సిమెంట్‌ నిర్మాణానికి నీరు పట్టి, లీక్‌లు చెక్‌ చేయడం, వాటర్‌ క్యూరింగ్‌ వంటివన్నీ తమ బాధ్యతే అన్నట్లుగా చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌నాటికి జల్‌కారా గ్రామంలో పదిహేడు ఇళ్లకు మాత్రమే టాయిలెట్‌ ఉండేది.

ఇప్పుడు అదే గ్రామంలో 106 ఇళ్లలో పక్కా టాయిలెట్‌లున్నాయి. వీళ్లు మొత్తం ఐదు పంచాయితీలకు గాను 1,423 టాయిలెట్‌లు నిర్మించారు. ఈ స్ఫూర్తితో ఈ మహిళలు తమ ఇళ్లలో కూడా పక్కా టాయిలెట్‌ను నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఐదారుగురు బృందాలుగా ఏర్పడి, ఎవరికి ఎవరూ డబ్బిచ్చే పని లేకుండా, ఒకరి ఇంటి టాయిలెట్‌ నిర్మాణంలో మిగిలిన వాళ్లు సహాయం చేసుకుంటున్నారు.

– మంజీర

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)