amp pages | Sakshi

ఫిర్యాదు చేస్తే, పోయేది అతగాడి పరువే!

Published on Mon, 02/22/2016 - 14:52

మెన్‌టోన్

లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులందరూ మహిళలేనని, నిందితులందరూ పురుషులేనని మన సమాజానికి నిశ్చితాభిప్రాయం ఉంది. అభిప్రాయాలను గౌరవించడం ప్రజాస్వామిక లక్షణం. అందువల్ల ఘనత వహించిన మన పత్రికలు, ప్రసార సాధనాలు, న్యాయస్థానాలు ఈ అభిప్రాయాన్ని ఇతోధికంగా గౌరవిస్తూనే ఉన్నాయి. అభిప్రాయాలను గౌరవించడంలో ఎలాంటి పేచీ లేదు. అయితే, వాస్తవాలను కూడా గుర్తించాలి కదా అనేదే పురుషాధముల గోడు. అరివీరభయంకర మైకాసురుల విజృంభణ కొనసాగే మీడియాలో అభాగ్య పురుషాధముల గోడు ఎవరికి వినిపించాలి? అదంతా బధిర శంఖారావమే!

మహిళల బారిన పడి లైంగిక వేధింపులకు గురవుతున్న పురుషుల సంఖ్య గడచిన రెండు దశాబ్దాలుగా నెమ్మదిగా పెరుగుతూ వస్తోందని అనధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోను, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇదే పరిస్థితి. రాజ్యాంగం ప్రవచించే సమానత్వమేదీ లైంగిక వేధింపుల చట్టాల్లో మచ్చుకైనా కనిపించదు. మన దేశం సంగతే తీసుకుంటే, ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 354, 354 ఎ, బీ, సీ, డీ సహా సంబంధిత ఇతరేతర చట్టాల్లోని సెక్షన్లన్నీ లైంగిక వేధింపుల కేసుల్లో... సమాజంలో ఎక్కువ సమానులైన మహిళలనే బాధితులుగా గుర్తిస్తాయి. పురుషులకు మహిళల నుంచి లైంగిక వేధింపులు ఎదురైతే, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకోవాలో పోలీసులకు కూడా తెలియని పరిస్థితి.

 మహిళల నుంచి లైంగిక వేధింపులకు గురయ్యే మగాళ్లలో చాలామంది ఎలాంటి ఫిర్యాదులూ చేయరు. వేధింపులు మరీ శ్రుతిమించి, మితిమీరితే గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప పోలీస్ స్టేషన్లను, కోర్టులను ఆశ్రయించరు. కర్మకాలి ఎవడైనా మగాధముడు తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు చేస్తే, పోయేది అతగాడి పరువే! బాధితుడి గోడు ఆలకించి, సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు సైతం ముందు అతడినే గేలి చేస్తారు. ఇక వ్యవహారం మీడియా వరకు వెళితే రచ్చ రచ్చే! ఇంత జరిగినా బాధితుడికి న్యాయం జరుగుతుందని ఎలాంటి గ్యారంటీ లేదు.  - దాసు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)