amp pages | Sakshi

యంగ్‌స్కర్ట్స్

Published on Thu, 07/02/2015 - 23:15

యంగ్‌స్టర్స్ కోసమే పుట్టింది స్కర్ట్. కాలేజీ అమ్మాయిలే కాదుస్కర్ట్ వేసుకుంటే అమ్మలూ యంగ్‌గా కనపడతారు.  ఈ కాలంది కాకపోయినా కాలంతో పనిలేకుండా ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది స్కర్ట్. సినీతారల మేనిపైనే కాదు ఫ్యాషన్ షోలలోనూ హొయలు పోతోన్న స్కర్ట్ నయా ట్రెండ్ విశేషాలు ఇవి....
 
కాలేజీ, కార్యాలయం, క్యాజువల్.. అంతటా తానై అతివల మదిని దోచుకుంటున్న డ్రెస్ స్కర్ట్. 1970 ల కాలం నాటి ఈ డ్రెస్ ఈ యేడాది బిగ్గెస్ట్ ట్రెండ్ జాబితాలో ముందువరసలో ఉంది. 1970’ల కాలంలో ’అ’లైన్ మ్యాక్సీ స్కర్ట్‌లు బాగా ప్రాచుర్యంలో ఉండేవి. ఆ తర్వాత ప్యాచ్‌వర్క్, కుచ్చుళ్లు, ఎంబ్రాయిడరీ...తో రకరకాల హంగులను స్కర్ట్‌కు తీసుకువచ్చారు డిజైనర్లు. ‘ప్రపంచంలోని అన్నిదేశాల్లోనూ స్కర్ట్ డిజైనింగ్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. దీంతో స్కర్ట్ డిజైన్స్‌లో విస్తృతి పెరిగింది’ అంటున్నారు భారతీయ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ రితూకుమార్. ‘ఫ్యాషన్ డిజైనర్లందరి చేతుల్లోనూ మెరిసిన ఏకైక డ్రెస్‌గా స్కర్ట్ ను చెప్పుకోవచ్చు’ అంటారు మరో ప్రసిద్ధ డిజైనర్ నీతాలుల్లా. 70’ల కాలంనాటి స్కర్ట్ నాటి యూత్ మదిని షేక్ చేస్తే, 80’ల కాలం స్కర్ట్ చిలిపితనాన్ని కళ్లకు కట్టింది. 90’ల కాలంలో మనసును హత్తుకుంటూ వస్తున్న స్కర్ట్ ఈ దశాబ్దంలోనూ ఎన్నో అద్భుతాలకు వేదికగా మారి ఔరా అనిపిస్తోంది.
 
నేటి ఫ్యాబ్రిక్...
 షిఫాన్, క్రేప్, కాటన్,.. అన్ని రకాల క్లాత్‌లతో స్కర్ట్స్‌ని అందంగా ముస్తాబు చేయవచ్చు. ఇప్పుడు క్రష్డ్, డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో ఎన్నో వైవిధ్యమైన స్కర్ట్‌లు చూపుతిప్పుకోనివ్వని డిజైన్లలో రూపుకడుతున్నాయి. రూ.200/- నుంచి లభిస్తున్న ఈ స్కర్ట్స్‌ను కాస్త డిజైనింగ్ సృ్పహ, కుట్టుపని తెలిసిన ఎవరైనా సొంతంగా తయారుచేసుకోవచ్చు.
 - ఎన్.ఆర్
 
సన్నగా ఉంటే లాంగ్ స్కర్ట్...
కాళ్లు సన్నగా ఉన్నవారు ఫుల్ స్కర్ట్ ధరించాలి. లేదా మోకాలి కిందవరకూ ఉన్న స్కర్ట్‌ను ఎంచుకోవాలి.లాంగ్ స్కర్ట్స్ వేసుకున్నప్పుడు ఫిట్‌గా ఉండే టాప్ ధరించాలి. దీని వల్ల నడుము కింది భాగంలో స్కర్ట్ గొడుగు ఆకారంలా కనిపించి, చూడ్డానికి అందంగా ఉంటుంది.శరీరాకృతిని బట్టి రంగులు, ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవాలి. ప్రింట్లు ఉన్న ఫ్యాబ్రిక్‌ను స్కర్ట్‌కు ఎంచుకుంటే టాప్ ప్లెయిన్ లేదా తక్కువ ఎంబ్రాయిడరీ ఉన్నది ఎంచుకోవాలి. వేసవిలో పొట్టి స్కర్ట్స్, చలికాలంలో పొడుగు స్కర్ట్‌లు, వర్షాకాలంలో మిడ్ స్కర్ట్స్ బాగుంటాయి.  స్కర్ట్ మీదకు క్రాప్‌టాప్ అందంగా ఉంటుంది. క్రాప్‌టాప్ మీదకు లేయర్డ్ డ్రెస్‌ను వేసుకుంటే స్టైలిష్‌గా కనిపిస్తారు.  స్కర్ట్ ధరించినప్పుడు మెడ లో స్కార్ఫ్ అదనపు ఆకర్షణ.
 
 

Videos

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)