amp pages | Sakshi

తేలికపాటి వ్యాయామం చేసినా..

Published on Fri, 04/27/2018 - 15:45

లండన్‌ : మెరుగైన ఆరోగ్యం కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు, ఎక్కువసేపు నడవడం, యోగా, ధ్యానం అంటూ భారీ సమయం వెచ్చిస్తుంటారు. అయితే రోజూ కొద్దిసేపు తేలికపాటి వ్యాయామం, శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చని తాజా అథ్యయనం తేల్చింది. తేలికపాటి వ్యాయామం, చిన్నపాటి శారీరక కదలికలతో గుండె ఆరోగ్యం పదిలపరుచుకోవచ్చని, నూతన కణాల పరిమాణం వీటితో పెరుగుతున్నట్టు తేలిందని పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగంలో వెల్లడైంది. చిన్నపాటి వ్యాయామమైనా రోజువారీ దినచర్యలో భాగంగా నిత్యం చేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుందని హార్వర్డ్‌ అథ్యయనం పేర్కొంది.

రోజూ వ్యాయామం, శారీరక కదలికలతో కణాల పునరుజ్జీవం పెరుగుతుందని, ఇది శరీరంలో వాపు ఇతర ఇన్‌ఫెక్షన్లతో పోరాడి నిస్సత్తువ, గుండె జబ్బులను దరిచేర్చకుండా కాపాడుతుందని పరిశోధనలో గుర్తించారు. రోజూ వ్యాయామం చేసే ఎలుకలో కొత్త గుండె కణాలను నాలుగు రెట్లు అధికంగా గుర్తించారు. గుండె పోటుకు గురైన వారు, వృద్ధుల గుండెను పరిరక్షించుకునేందుకు తేలికపాటి వ్యాయామాలూ మెరుగ్గా ఉపకరిస్తాయని తేలినట్టు పరిశోధకులు వెల్లడించారు. గాయం లేదా వయసు మళ్లిన కారణంగా కుచించుకుపోయే గుండె కణజాలం నూతన కణజాలంతో పునరుజ్జీవం కావడం ద్వారా సమతుల్యతను కాపాడుకోవచ్చని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రొఫెసర్‌, పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ ఆంథోని పేర్కొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)