amp pages | Sakshi

ఈ సమయంలో జ్వరం వస్తే ప్రమాదమా?

Published on Sun, 02/16/2020 - 11:58

నా వయసు 26 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. ప్రెగ్నెన్సీ సమయంలో జ్వరం వస్తే పుట్టబోయే బిడ్డకు ప్రమాదమా? మాత్రలు వేసుకోవచ్చా? ఈ సమయంలో యావరేజ్‌ బాడీ టెంపరేచర్‌ ఎంత ఉండాలి? 
– యం.శాంతిశ్రీ, ఆత్మకూర్, కర్నూలు జిల్లా
ప్రెగ్నెన్సీ సమయంలో జ్వరం వస్తే ఆలస్యం చెయ్యకుండా, శరీరం మరీ వేడెక్కకుండా ఒళ్లు నార్మల్‌ టెంపరేచర్‌లోకి రావడానికి మంచినీటిలో స్పాంజింగ్‌తో పాటు, పారాసెటిమాల్‌ మాత్ర జ్వరాన్ని బట్టి ఆరు గంటలకొకసారి వేసుకోవడం మంచిది. అసలు జ్వరం ఎందుకు వస్తోందో తెలుసుకోవడానికి డాక్టర్‌ సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి అవసరమైన యాంటీబయోటిక్స్‌ వాడుకోవచ్చు. జ్వరం వల్ల, ఒళ్లు మరీ వేడెక్కిపోవడం వల్ల కొన్నిసార్లు కొందరిలో అబార్షన్లు, నెలలు నిండకుండానే కాన్పులు కావడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. జ్వరం వచ్చిన కారణం కంటే కూడా శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత 99–100 డిగ్రీల కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 


నాకు కొత్తగా పెళ్లయింది. అయితే నా భర్త నాకు దూరంగా ఉంటున్నారు. ‘ఆమె దగ్గర విపరీతమైన దుర్వాసన వస్తుంది’ అని నా గురించి ఎవరితోనో చెప్పారట. నిజానికి శుభ్రత విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ‘అతి శుభ్రత పాటిస్తావు’ అని కూడా వెక్కిరించేవాళ్లు. అలాంటి నా దగ్గర దుర్వాసన రావడం ఏమిటో అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి ఏదైనా చెబుతారని ఆశిస్తున్నాను.
– శివరాణి, ఉంగుటూరు

మీ వారి దృష్టిలో దుర్వాసన అంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తున్నారో. కొంతమందిలో నోటి నుంచి కూడా దుర్వాసన రావచ్చు. కొందరిలో యోనిలో ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల దుర్వాసన రావచ్చు. కొంతమంది మగవారు మనసులో ఏదో పెట్టుకుని, కారణం ఏదో ఒకటి చెబుతుంటారు. నిజంగా ఆయనకి ఏదైనా నీవల్ల ఇబ్బంది అనిపిస్తే అది నీతో మాట్లాడి, సమస్యకు మార్గం ఏమిటో, డాక్టర్‌కు చూపించటమో ఏదో చెయ్యాలి కాని, బయటవాళ్లకి నీమీద చెప్పటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు కదా! ఒకసారి నువ్వే ఆయనతో నీ వల్ల ఆయనకు ఏమి ఇబ్బందిగా ఉందో మాట్లాడి, సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్‌కి చూపించి చికిత్స తీసుకోవచ్చు. లేకపోతే ఈ దూరం పెరిగిపోయి, మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి.

నా వయసు 28 సంవత్సరాలు. సన్నగా ఉంటాను. ప్రస్తుతం నాకు మూడో నెల. ప్రెగ్నెన్సీ సమయంలో, ఆ తరువాత తప్పనిసరిగా తీసుకోవాల్సిన వాక్సిన్‌ల గురించి వివరంగా తెలియజేయగలరు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వల్ల ఉపయోగం ఏమిటి?
– జి.నళినిప్రసాద్, వికారబాద్‌
గర్భిణి సమయంలో తప్పనిసరిగా తీసుకోవలసిన వ్యాక్సిన్‌ ‘టెటానస్‌’ (టీటీ) ఒక్కటే. ఇది నాలుగో నెల నుంచి ఒక నెల వ్యవధిలో రెండు డోసులు తీసుకుంటే చాలు. ఇది చాలా తక్కువ ఖరీదు ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా కూడా ఇస్తారు. మిగతా వ్యాక్సిన్స్‌ అన్నీ ఆప్షనల్‌ ఇంజెక్షన్లు మాత్రమే. వీటిలో ఫ్లూ వ్యాక్సిన్‌ ఒకటి. ఇది ఐదో నెల తర్వాత ఒక డోస్‌ తీసుకోవచ్చు. రెండో డోస్‌ ఉత్త టెటానస్‌ బదులు టెటనస్‌తో పాటు డిఫ్తీరియా, కోరింత దగ్గు నివారణ కోసం ‘టీడాప్‌’ అనే వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. కాన్పు తర్వాత కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆప్షనల్‌ వ్యాక్సిన్‌గా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ కూడా తీసుకోవచ్చు. ఇది హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) నిరోధం కోసం తయారు చేసిన వ్యాక్సిన్‌. హెచ్‌పీవీ వైరస్‌ కారణంగా వచ్చే సెర్వికల్‌ కేన్సర్‌ బారి నుంచి తప్పించుకోవడానికి దీనిని తీసుకుంటారు. ఇది ఆరు నెలల్లో మూడు డోసులు తీసుకోవచ్చు. కొంచెం ఖర్చుతో కూడుకున్నది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌