amp pages | Sakshi

నరకలోకం  టు  నరలోకం!

Published on Sun, 04/22/2018 - 00:04

2200 సంవత్సరం:నరకానికి వచ్చి బోలెడు సంవత్సరాలవుతున్నా... జస్ట్‌ నిన్నగాక మొన్న వచ్చినట్లే ఉంది వీరప్పన్‌కు.నరకం చాలా బోర్‌గా ఉంది. ఎక్కడి ఎర్రచందనపు చెక్కలు.... ఎక్కడి మనుషుల వేపుళ్లు! నిద్రలో రోజూ గంధపు చెక్కల సువాసనభరిత కలలే!‘‘ఈ నరకంలో ఒక్క గంధపు చెట్టూ లేదు. ఉన్నా వాటిని కొట్టే చాన్స్‌ ఇవ్వరు. ఛీ... వెధవ చావు అయిపోయింది’’ నిట్టూర్చాడు వీరప్పన్‌.ఈలోపే... ‘‘అన్నా గుడ్‌న్యూస్‌’’ అని పరుగెత్తుకు వచ్చాడు పక్క సెల్‌లో ఉండే కూరప్పన్‌.‘‘గుడ్‌న్యూస్‌ అనే మాట వినక ఎన్ని సంవత్సరాలవుతుందిరా కూరప్పన్‌. ఇంతకీ ఏమిటా న్యూస్‌?’’ ఆసక్తిగా అడిగాడు వీరప్పన్‌.‘‘సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను మన భూలోకంలో జాతీయ పర్వదినాల సందర్భంగా విడుదల చేస్తుంటారు అనే విషయం నీకు తెలుసు కదా! భూలోకంలోలాగే ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి సిస్టమే అమలు చేయబోతున్నారు’’ చెప్పాడు కూరప్పన్‌.‘‘మరి ఇక్కడ జాతీయపర్వదినాలేవీ జరుపుకోరు కదా!’’ అనుమానంగా అడిగాడు  వీరప్పన్‌.‘‘యమధర్మరాజుగారి బర్త్‌డేనే మన జాతీయ పర్వదినం... అది ఎప్పుడో కాదు... ఎల్లుండే... ఈ సందర్భంగా సత్‌ప్రవర్తన కలిగిన కొందరు  నరకవాసులను విడుదల చేస్తారు’’ అన్నాడు ఆనందంగా కూరప్పన్‌.‘‘ఇక్కడ సత్‌ప్రవర్తన లేనిది ఎవడికని? ఈ నరకంలో ప్రతివాడూ చచ్చినట్లు మంచివాడుగానే ఉండాలి. ఈ లెక్కన అందరూ మంచివాళ్లే కదా... మరి అందరినీ ఎలా విడుదల చేస్తారు?’’ అడిగాడు వీరప్పన్‌.‘‘చాలా మంచి క్వశ్చన్‌ వేశావు భయ్యా.... ఇలాంటి సమస్యను దృష్టిలో పెట్టుకునే సార్‌ బర్త్‌ డే రోజు లక్కీ డ్రా తీస్తారు. ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేస్తారు. ఆ ముగ్గురు నిరభ్యంతరంగా  భూమి మీద వారి సొంత ప్రదేశాలకు వెళ్లిపోవచ్చు. అక్కడ సుఖంగా జీవించవచ్చు’’ చెప్పాడు కూరప్పన్‌.

ఆరోజు యమధర్మరాజు బర్త్‌డే.‘‘యమధర్మరాజుగారి పుణ్యమా అని తీయని కేక్‌ తినే మహా అవకాశం మనకు వచ్చింది. ఈ తీయని సందర్భంలో కేక్‌ కంటే తీయని పాట ఎవరైనా పాడితే చాలా బాగుంటుంది. మీలో ఎవరు పాడతారు?’’ అడిగాడు చిత్రగుప్తుడు.‘‘సర్‌... నేను పాడతాను’’ అంటూ ‘గానఘోరగంధర్వ’ తిత్తిసత్తిపండు అనే గాయకుడు స్టేజీ మీదకు వచ్చాడు. పాట అనగానే యమధర్మరాజుకు హుషారు వచ్చింది. ‘‘మానవా... త్వరగా పాడవా’’ అన్నాడు. సత్తిపండు ‘యమగోల’ సినిమాలో పాట అందుకున్నాడు...‘సమరానికి నేడే ప్రారంభంయమరాజుకి మూడెన్‌ ప్రారబ్దంనరకలోకమున కార్మికశక్తికితిరుగులేదని చాటిద్దాం.ఇంక్విలాబ్‌ జిందాబాద్‌... ఇంక్విలాబ్‌ జిందాబాద్‌... లెఫ్ట్‌ రైట్‌ లెఫ్ట్‌ రైట్‌’పాట విని యమధర్మరాజుకు యమ మండింది.‘‘ఏమీ అసందర్భ గీతం... అభ్యంతరకర రోతం... నీ ఖేల్‌ ఖతం... లెఫ్ట్‌ రైట్‌ లెఫ్ట్‌ రైటా... వీడిని లెఫ్ట్‌ వైపుకు తీసుకెళ్లి రైట్‌ చెంప మీద నాలుగిచ్చుకోండి... అలాగే రైట్‌ వైపుకు తీసుకెళ్లి... లెఫ్ట్‌ చెంప మీద నాలుగిచ్చుకోండి. అటు పిమ్మట వీడిని సలసల కాగు నూనెలో లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ బాగా కాల్చండి’’ అని ఆదేశించాడు యమధర్మరాజు. బర్త్‌డే వేడుకల అనంతరం లక్కీ డ్రా కార్యక్రమం జరిగింది. యమధర్మరాజు మునిమనవని ముని మునవడు చిరంజీవి ఘనధర్మరాజ్‌ మూడు చీటీలు తీశాడు.

మొదటి పేరు: పీటర్‌ కాస్‌గ్రోవ్, ఆస్ట్రేలియా.పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి.రెండో పేరు: మాల్కం జఫా జఫా, ఇండోనేసియా.మరోసారి గట్టిగా హర్షధ్వానాలు.‘‘చూశావారా కూరప్పన్‌... ఇక్కడ కూడా మన ఇండియాకు అన్యాయం జరుగుతుంది’’ అన్నాడు ఆవేదనగా వీరప్పన్‌. ‘‘బాధ పడకన్నా... ఇంకో అవకాశం ఉంది కదా’’ అంటూ ఓదార్చాడు కూరప్పన్‌. ఇంతలో మూడో పేరు వినిపించింది. ‘కూసుమునిస్వామి వీరప్పన్, ఇండియా’కలా? నిజమా?... ఆనందం పట్టలేక అదేపనిగా ఏడ్చాడు వీరప్పన్‌. అందరికీ వీడ్కోలు చెప్పి భూలోకానికి పయనమయ్యాడు. భూలోకానికి రావడంతోనేతమిళనాడులోని  ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం టౌన్‌లో అడుగుపెట్టాడు. అక్కడ అందరూ ఆక్సిజన్‌ మాస్క్‌లు ధరించి ఉన్నారు.‘‘ఈ టౌన్‌లో అందరూ మాస్క్‌లు «పెట్టుకొని తిరుగుతున్నారేమిటి?’’ దారిన పోయే దానయ్యను అడిగాడు వీరప్పన్‌.‘‘ఈ టౌన్‌ అని ఏమిటి! ఈ భూలోకంలో  అన్ని టౌన్లలో, ఊళ్లలో మాస్కులు పెట్టుకుంటున్నారు’’ అన్నాడు దానయ్య.‘‘మాస్క్‌ల గొడవ నాకెందుకుగానీ... ఇక్కడ పెద్ద ఫారెస్ట్‌ ఉండాలి కదా ఏది?’’ అని  ఆరాతీశాడు వీరప్పన్‌.‘‘ఫారెస్టా? అంటే?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఆ కుర్రాడు. ‘‘అదేనయ్యా... అడవి... అంటే... పెద్ద ఎత్తున చెట్లన్నీ ఒక చోట ఉండటం... అందులో గంధపు చెట్లు కూడా ఉంటాయి’’ వివరించాడు వీరప్పన్‌.‘‘మ్యూజియంలో తప్ప ఇప్పుడు చెట్లు ఎక్కడా కనిపించడం లేదు. అడవులనేవి ఇప్పుడు ఎక్కడా లేవు’’ అన్నాడు కుర్రాడు. ‘‘మరి జనాలు ఎలా బతుకుతున్నారయ్యా?’’ ఆశ్చర్యంగా అడిగాడు వీరప్పన్‌.‘‘టేటినో 3.5 సెవన్‌ లాక్‌ 4 బై 2 పేరుతో ఆర్టిఫిషియల్‌ చెట్లు, ఆర్టిఫిషియల్‌ గాలి, ఆక్సిజన్‌ మాస్క్‌లు... ఇలా రకరకాలు వచ్చాయి. కృత్రిమ ఆక్సిజన్‌ కోసం ఎప్పటికప్పుడు బాడీని రీచార్జ్‌ చేసుకుంటూ ఉండాలి. ప్రాణాలతో ఉండాలంటే ఈ భూమి మీద నూకలు కాదు చేతిలో  డబ్బులు ఉండాలి...’’ అని చెప్పాడు దానయ్య. కాసేపటికి వీరప్పన్‌ కళ్లు తిరిగాయి. గాలి లేక శ్వాస ఆడటం లేదు.....‘‘ఇతనికి శ్వాస ఆడటం లేదు... ఎయిర్‌ అంబులెన్స్‌కు ఫోన్‌ చేయండి...’’ ఎవరో అంటున్నారు.‘‘దయచేసి నన్ను బతికించవద్దు. చెట్లు లేని ఈ భూలోకం కంటే నరకమే ఎన్నో రెట్లు మేలు’’ అంటూనే కన్ను మూసి.... నరకానికి మరోసారి క్షేమంగా చేరుకున్నాడు వీరప్పన్‌!
– యాకుబ్‌ పాషా 

Videos

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)