amp pages | Sakshi

వర్ణం: ఈతకాలం!

Published on Sun, 03/02/2014 - 00:27

 వేసవి కాలాన్ని అందరూ వేసవి కాలమనే పిలుస్తారు. కానీ యువకులు మాత్రం ‘ఈత కాలం’ అని పిలుచుకుంటారు సరదాగా. మరి వారికి ఇలాంటి స్విమ్మింగ్ పూల్ దొరికితే? ఇది సాల్వడార్ నగరానికి దగ్గర్లోని ఎకో రిసార్ట్ కొలను. ఫిఫా వరల్డ్ కప్‌కు వచ్చే క్రీడాకారులకు ఏర్పాటుచేసిన విడిది ఇది. స్విమ్మింగ్ పూల్, ఆ పక్కనే సముద్రం! ఓహ్.

 

 


 
 బాల్యమంటే బొమ్మలే!
 పిల్లలు ఎక్కడైనా పిల్లలే కదా... జపాన్ పిల్లలు అయినంత మాత్రాన వారు బొమ్మలతో కాకుండా మెషీన్లతో ఆడుకుంటారా? జపాన్‌లోని కనోసు నగరంలో నిర్వహించిన ఓ బొమ్మల ప్రదర్శనలో ఓ చిన్నారి తన తల్లితో కలిసి బొమ్మలు చూస్తున్న చిత్రమిది. 1800 బొమ్మలున్న పిరమిడ్ కొలువు ఇది.
 


 మాతృత్వం విశ్వజనీనం!
 
 మాతృత్వం మనిషికే కాదు, జంతువులకూ అపురూపమే. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ శివారులోని జంతు ప్రదర్శన శాలలో దృశ్యమిది. రోజుల వయసున్న పిల్ల జిరాఫీ పాలు తాగుతున్న దృశ్యం. ఇది ప్రేమికుల రోజున పుట్టిందట. దాని ఒంటిపై మూడు చోట్ల హృదయాల గుర్తులున్నాయట.
 


 నిజంగా పులిని చూసినట్లే!
 ఈ చిత్రంలోని టీవీ ఎంత అద్భుతమైన పిక్చర్ క్లారిటీని ఇస్తుందంటే... లైవ్‌లో చూసినట్లే అనుభూతి చెందుతాం. దక్షిణా కొరియా రాజధాని సియోల్‌లో శాంసంగ్ కంపెనీ  సినిమా స్క్రీన్‌లాగా వంపు తిరిగిన ‘యుహెచ్‌డీ’ టీవీలను ఇటీవల విపణిలోకి వదిలింది. అత్యద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో, ఇంట్లో ఏ మూలన కూర్చున్నా అత్యంత నాణ్యమైన సౌండ్స్‌తో ఒక థియేటర్ అనుభూతిని కల్పిస్తాయి ఈ టీవీలు. వీటిల్లో ఒకేసారి వివిధ ఛానళ్లు చూసే అవకాశం ఉంది.  
 

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)