amp pages | Sakshi

ముక్కాలా... మెహబూబా... ముకాబులా... ఓ మెహబూబా!

Published on Sat, 04/08/2017 - 23:47

‘ప్రేమికుడు’ సినిమాలో ‘ముకాబులా’ పాటను పాడించడానికి  గాయకుడు మనోను ఒక రాత్రి స్టూడియోకు పిలిపించాడు రెహమాన్‌. పాటకు ఏవో రిపేర్లు జరుగుతుండడంతో సోఫాలో ఒక కునుకేశాడు మనో. కొద్దిసేపటి తరువాత ఆఫీసుబాయ్‌ నిద్రలేపి ‘సార్‌ రమ్మంటున్నాడు’ అన్నాడు. అప్పుడు సమయం రాత్రి ఒంటిగంట దాటింది. ‘‘ఈ టైమ్‌లో పాటేం పాడుతామురా దేవుడా’’ అని గొణుక్కుంటూ నిద్రమత్తుతో రెహమాన్‌ దగ్గరికి వెళ్లాడు మనో.

 మరోవైపేమో రెహమాన్‌ మాంచి జోష్‌లో ఉన్నాడు. ‘బాస్‌ రెడీ కమాన్‌’ అంటున్నాడు. పియానో మీద ఒక ట్యూన్‌ వాయించి ‘లిరిక్స్‌ రాసుకో’ అన్నాడు. ‘‘సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా పాడాలి. అరిచినట్లుగా ఉండకూడదు. కానీ షౌటింగ్‌ ఉండాలి’’ అన్నాడు రెహమాన్‌. ఈ దెబ్బకు నిద్ర అడ్రస్‌ లేకుండా ఎగిరిపోయింది. ‘‘డిఫరెంట్‌గా అంటే ఎలా? ఘంటసాలలాగా, సౌందరరాజన్‌లాగా పాడమంటారా?’’ అడిగాడు మనో. ‘‘నో నో’’ అన్నాడు రెహమాన్‌.

అప్పుడు సమయం రెండున్నర దాటింది. ‘‘టీ తాగొస్తాను’’ అని ఆఫీసు నుంచి బయటికి వచ్చాడు మనో. ‘‘ఏ వాయిస్‌ ఫ్లేవర్‌ అయితే బాగుంటుంది’’ ఆలోచించుకుంటూ వచ్చాడు. అక్కడొక వాచ్‌మన్‌ చిన్నట్రాన్సిస్టర్‌  పెట్టుకొని పాట వింటున్నాడు. ఆర్‌.డి. బర్మన్‌ ‘షోలే’ సినిమాలో పాడిన ‘మెహబూబా మెహబూబా’ పాట అది. ‘అబ్బ! దొరికేసింది’ అనుకొని వేడి వేడిగా టీ తాగి హుషారుగా వెళ్లి ‘మెహబూబా’ పాటలో బర్మన్‌ వాయిస్‌ ఫ్లేవర్‌తో ‘ముక్కాలా ముకాబులా’ పాట పాడి శబ్బాష్‌ అనిపించుకున్నాడు మనో!

Videos

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?