amp pages | Sakshi

అన్నిటికన్నా ఆలూ ముఖ్యం!

Published on Sun, 01/17/2016 - 15:38

  ఆత్మబంధువు
 ‘ఆంటీ... ఆంటీ’ అంటూ ఇంట్లోకి వచ్చాడు చరణ్.
 ‘‘హాయ్ హీరో... ఏంటి సంగతి... పొద్దుటే ఆంటీ గుర్తొచ్చింది’’ అంటూ నవ్వుతూ పలకరించింది రేఖ.
 ‘‘మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చానాంటీ!’’
 ‘‘థ్యాంక్సా... ఎందుకూ?’’
 ‘‘మీరు చెప్పిన టైమ్ గ్రిడ్ బాగా పనిచేస్తుందాంటీ. ఇప్పుడు నా టైమ్ నేను బాగా మేనేజ్ చేసుకోగలుగుతున్నా.’’
 ‘‘గుడ్... ‘ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చదివావా?’’
 ‘‘చదివానాంటీ. వండర్‌ఫుల్ బుక్.’’

 ‘‘గుడ్... ఇంకా!’’
 ‘‘టైమ్ మేనేజ్ చేస్తున్నా కానీ...’’ అంటూ నసిగాడు చరణ్.
 ‘‘హా... కానీ? ఏంటో చెప్పు చిన్నూ!’’ అంది రేఖ.
 ‘‘టైమ్ మేనేజ్ చేస్తున్నా కానీ... ఎక్కడో ఏదో తేడా కొడుతోందాంటీ. అదేంటో అర్థం కావడంలేదు.’’
 ‘‘తేడా కొట్టడమంటే?’’
 ‘‘అంటే... అన్నీ టైమ్ ప్రకారమే చేస్తున్నా. కానీ ప్రయారిటీస్‌లో ఏదో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుంది.’’
 ‘‘ఔనా... సరే రా... వంట చేస్తూ మాట్లాడుకుందాం..’’ అంటూ వంట గదిలోకి వెళ్లింది. చరణ్ కూడా వెళ్లాడు.
 ‘‘నీకు వంట చేయడం వచ్చా?’’ అడిగింది రేఖ.

 ‘‘రాదాంటీ.’’
 ‘‘తినడం?’’ నవ్వుతూ అంది.
 ‘‘బాగా వచ్చాంటీ’’ నవ్వుతూనే చెప్పాడు చరణ్.
 ‘‘తినడం వచ్చినప్పుడు... ఆ తినేది ఎలా వండాలో కూడా నేర్చుకోవాలోయ్.’’
 ‘‘తప్పకుండా నేర్చుకుంటా. ఇప్పటికి ఆ అవసరం రాలేదుగా.’’
 ‘‘అవసరం వచ్చినప్పుడు నేర్చుకోవడం కాదు. ఏదైనా ముందు నేర్చుకుంటే అవసరానికి ఉపయోగ పడుతుంది. సరే... ఆ జార్ ఇటు అందుకో.’’
 గాజు జార్ తెచ్చిచ్చాడు చరణ్. దాని నిండుగా బంగాళా దుంపలు వేసి... ‘‘ఇప్పుడిది నిండినట్టేనా చరణ్?’’ అని అడిగింది.
 తల ఊపాడు చరణ్. రేఖ వెంటనే దాన్లో శనగలు పోసింది. బంగాళదుంపల మధ్యనున్న ఖాళీల్లోంచి కొన్ని శనగలు లోపలికి చేరాయి. ‘‘ఇప్పుడు నిండిందా?’’

 ‘‘హా.. నిండింది ఆంటీ!’’
 ‘‘అంటే దీన్లో మరేమీ పట్టవుగా?’’
 ‘‘పట్టవు... ఫుల్‌గా నింపేశారుగా.’’
 తలూపి దాన్లో చక్కెర పోసింది రేఖ. బంగాళాదుంపలు, సెనగల మధ్యగుండా కొంత చక్కెర లోపలికి చేరింది. ‘‘ఏమీ పట్టవన్నావుగా చిన్నూ... మరి చక్కెర పట్టిందిగా?’’ అంది రేఖ.
 ‘‘అంటే’’... నసిగాడు చరణ్.
 ‘‘సర్లే.. ఇప్పటికైనా నిండినట్లేనా?’’

 ‘‘హా... ఇప్పుడైతే పూర్తిగా నిండినట్లే. జార్ అంచులవరకూ చక్కెర వచ్చిందిగా. ఇంకేం పట్టవు’’ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.
 అలాగా అంటూ జార్‌లో నీళ్లు పోసింది రేఖ. ఎందుకలా చేస్తుందో తెలియక ఆశ్చర్యంగా చూస్తున్నాడు చరణ్. అదే మాట అడిగాడు.
 ‘‘ఈ జార్ మన జీవితం లాంటిది. ఇందులో వేసిన దుంపలు అత్యంత ముఖ్యమైన అంశాల్లాంటివి. జీవితంలో అన్నీ కోల్పోయినా మనతోపాటే మిగిలి ఉండేవి. అంటే... విద్య, ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులు, ప్యాషన్ వగైరా. శనగలు అవసరమైన విషయాలు. ఉద్యోగం, ఇల్లు, కారులాంటివి. మిగతా వన్నీ చక్కెరలాంటివి. అంత ప్రాముఖ్యత లేని సినిమాలు, షికార్లు, గాసిప్‌లు, ఫేస్‌బుక్ లాంటివి. నువ్వు జీవితాన్ని తియ్యగా కనిపించే చక్కెరతో నింపేస్తే... దానిలో సెనగలకూ, బంగాళా దుంపలకూ చోటుండదు. అలాక్కాకుండా ముందు బంగాళాదుంపలతో నింపేస్తే... మిగతా అన్నింటికీ చోటు ఉంటుంది.’’

 అర్థమైందన్నట్లుగా తలాడించాడు చరణ్. ‘‘ఏం అర్థమైంది?’’ అంది రేఖ.
 ‘‘జీవితంలో ముఖ్యమైన వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనీ, వాటికే ఎక్కువ టైమ్ కేటాయించాలనీ.’’
 ‘‘గుడ్... గుడ్.’’
 ‘‘మరి మీరు చివర్లో పోసిన నీళ్లు ఏంటి ఆంటీ?’’
 ‘‘జీవితంలో అన్నీ సాధించా మనుకున్నా... అన్నీ నిండాయనుకున్నా... ఇంకా ఎంతో కొంత చోటు మిగిలే ఉంటుందని.’’
 ‘‘మీరు సూపర్ ఆంటీ! థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్.’’ అంటూ సంతృప్తిగా ఇంటికి వెళ్లిపోయాడు చరణ్.
 - డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)