amp pages | Sakshi

ఆ చీకట్లో.. ఆ చినుకుల్లో

Published on Sun, 10/13/2019 - 09:05

నాలుగు సంవత్సరాల క్రితం నాటి సంగతి ఇది. నెల్లూరు నుండి కడప జిల్లాలోని పప్పిరెడ్డిపల్లె అనే చిన్న ఊరికి వెళ్లాల్సి వచ్చింది. సాయంత్రం నెల్లూరు నుండి బయలుదేరాను. బస్సు తెల్లవారుఝామున ఒంటిగంటకు చేరింది. అక్కడి నుంచి పప్పిరెడ్డిపల్లె వెళ్లాలంటే రాయచోటికి వెళ్లే బస్సు ఎక్కి, కొండలవారిపల్లె అనే గ్రామ సమీపంలో ఉన్న రోడ్డుపై దిగి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న పప్పిరెడ్డిపల్లె నడుచుకుంటూ వెళ్లాలి.ముహుర్తం టైమ్‌కు వెళ్లాలి కాబట్టి రాత్రి ఒంటిన్నర గంటకు రాయచోటికి పోయే బస్‌ ఎక్కాను. అప్పుడే వర్షం మొదలైంది. బస్‌ కిటికీలు బిగించారు.సరిగ్గా రెండున్నర గంటలకు కండక్టర్‌ నన్ను లేపి ‘‘కొండవారిపల్లె స్టాప్‌ వచ్చింది’’ అని దిగమన్నాడు. బస్సు దిగాను. చిమ్మచీకటి. చిరు జల్లులు.

‘‘ఊరేదయ్యా?’’ అని అడిగితే– ‘‘ఎదురుగా ఉన్న డొంక వెంబడి వెళ్తే ఒక కిలోమీటర్లో ఆ ఊరు వస్తుంది’’ అని చెప్పాడు.నరసంచారం లేదు. కనుచూపు మేరలో లైట్లు లేవు. ఊరికి పోయే డొంక కనిపించలేదు. మూడు కిలోమీటర్లు ఆ చీకట్లో ఎలా పోగలను? అని రోడ్డుపైన చీకట్లో నిల్చున్నాను.ఒక గంట గడిచింది. ఒకటి రెండు లారీలు, ఒక వ్యాన్‌ వెళ్లిపోయాయి. నాకు ధైర్యం సడలింది. ఏదో ఒక బస్సు ఎక్కి అటు రాయచోటికి కాని వెనుదిరిగి కడపకుగాని పోదామని  ఎంత ప్రయత్నించినా ఏ బస్సూ ఆపలేదు. రోడ్డు దిగి రెండు గజాలు నడిచాను, తెల్లగా సున్నం రాసిన దిమ్మలాంటిది ఉన్నట్లు కనిపించింది.
కొంచెం కళ్లు చిట్లించి చూడగా దానికి మెట్లున్నట్లు గమనించాను.

నిదానంగా మెట్లు ఎక్కగా, కాలి స్పర్శ వల్ల అది ఒక అరుగుగా, దానికి రెండ్లు మెట్లున్నట్లు గమనించాను. నిదానంగా మెట్లు ఎక్కి అరుగు దగ్గరకు చేరాను. ముందు భుజాన ఉన్న సంచి తీసి ఆ అరుగు మీద పెట్టి కొంచెంసేపు కూర్చుందామనిపించింది.సంచి అరుగు మీద పెడుతుంటే ‘టంగ్‌’మని శబ్దం రాగా సంచిలో ఒక చిన్న పెన్‌టార్చి ఉన్న విషయం గుర్తుకువచ్చింది. అబ్బ! దీని సంగతే మరిచిపోయానే అనుకొని టార్చి బయటకు తీసి బాటరీలు సరిచేసి లైటు వేశాను.అరుగు ఒక పక్క ఎత్తుగా ఉంది.

‘ఏమిటబ్బా!’ అని లైటు అన్ని పక్కలకు వేశాను.అరుగు ఒక పక్క ఎత్తుగా ఉంది.‘మన్నెం రామసుబ్బమ్మ, నిర్యాణం’ అని ఉంది.ఇంకేముంది, గుండె గుభేలుమంది. అది శ్మశానం అని ఆ అరుగు గోరీ అని తెలియగానే భయం మొదలైంది. వెంటనే ఆ అరుగు మీద సంచి తీసుకొని గబగబా రోడ్డు మీదికి వచ్చాను. ఆంజనేయదండకం మొదలుపెట్టాను. ఒక గంట తరువాత ఒక బస్సు నాకు దూరంగా రోడ్డుపై ఆగింది. నేను గబగబా బస్సు దగ్గరకు పోయాను. అందులో నుంచి ఏడెనిమిది మంది ప్రయాణికులు దిగారు,కొంతసేపటికి వాళ్లలో ఒకరు ‘‘అరే నువ్వట్రా!’’ అని గుర్తుపట్టి ‘‘అక్కడికేనా?’’ అని అడిగాడు. ‘‘అవును’’ అన్నాను. ‘‘మన వాళ్లు వ్యాన్‌ పంపుతున్నారు’’ అనేసరికి ‘హమ్మయ్య’ అనుకున్నాను. ఇప్పటికీ బస్సులో ప్రయాణం చేస్తే ఈ సంఘటన గుర్తుకు వచ్చి నవ్వుకుంటాను.
– పి.వి.సుబ్రహ్మణ్యం, నెల్లూరు 

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)