amp pages | Sakshi

వారఫలాలు : 23 జూలై నుంచి 29 జూలై 2017 వరకు

Published on Sun, 07/23/2017 - 00:22

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. ఖర్చులు పెరుగుతాయి. ఇంటాబయటా సమస్యలు ఎదుర్కొంటారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగే సూచనలు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. వారం చివరిలో వస్తులాభాలు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఎరుపు, లేత గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)
రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెర గవచ్చు. మీ అభిప్రాయాలపై భిన్నస్పందనలు వ్యక్తమవుతాయి. ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. పనుల్లో పొరపాట్లు దొర్లవచ్చు, నిదానం అవసరం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు కొంత నిరాశ తప్పదు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఉద్యోగావకాశాలు. నీలం, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు ఎదుర్కొంటారు. శ్రమాధిక్యం. ముఖ్య నిర్ణయాలలో మార్పులు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రాబడికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు నిరాశాజనకంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో విందువినోదాలు. స్వల్ప ధనలాభం. ఆకుపచ్చ, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత ఉపశమనం. ఆరోగ్యం కుదుటపడుతుంది. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు ఆదరణ పెరుగుతుంది. వారం మధ్యలో ధనవ్యయం.  వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువర్గంతో విభేదాల వల్ల కలత చెందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆస్తివివాదాలపై మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. కళాకారుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనూహ్యమైన రీతిలో వ్యవహారాలు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. ఇంటి నిర్మాణయత్నాలు సఫలం. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల పరిస్థితి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ఖర్చులు పెరుగుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరే సమయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య నిర్ణయాలకు కుటుంబసభ్యులు మద్దతునిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. కళాకారులకు మంచి గుర్తింపు తథ్యం. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. నేరేడు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం కొంత పెరిగి ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మీ అభిప్రాయాలపై మిత్రులు సానుకూలత వ్యక్తం చేస్తారు. సంఘంలో గౌరవం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, లేత గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం మంచిది.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలలో నిరుత్సాహం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కళాకారులకు ప్రయత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో వృథా ఖర్చులు. సోదరులతో మాటపట్టింపులు. పసుపు, తెలుపు రంగులు,ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మీ శ్రమ ఇతరులకు అనుకూలిస్తుంది. ఆరోగ్యంపై దృష్టి సారించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లు నిరాశకు లోనవుతారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.


కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి  వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. నలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆలోచనలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ఉన్నతపోస్టులు రావచ్చు. కళాకారులకు మరింత అనుకూలమైన కాలం. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబీ, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

Videos

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి పిఠాపురం శేషు కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్

నా కొడుకు కోసం బందరులో ఎక్కడైనా అడుగు.. ఒక్కటే సమాధానం

మంగళగిరిలో నారా లోకేష్ మొహం చూపించుకోలేకపోతున్నాడు..!

పవన్ కళ్యాణ్ ని వంగా గీత ఒక్క మాట కూడా అనలేదు.. అది ఆమె సంస్కారం..!

Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ

సీదిరి అప్పలరాజు స్పెషల్ ఇంటర్వ్యూ

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)